మెయిన్ ఫీచర్

మనో‘రంజనం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గురువుగా

తను నేర్చుకున్న విద్య అందరికీ నేర్పించాలని, 1987లో ఉత్సవ్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ సొసైటీ స్థాపించి ఎంతోమంది విద్యార్థులకు కళను నేర్పించింది. వీరందరూ ఎన్నో దేశాలు పర్యటించి మన కళకు ఎంతో సేవ చేశారు.

అవార్డులు

2007లో రాష్టప్రతి ప్రతిభా పాటిల్ చేతులమీదుగా ప్రతిష్ఠాత్మకమైన సంగీత నాటక అకాడమీ అవార్డు, 2003లో అప్పటి రాష్టప్రతి అబ్దుల్ కలాం చేతులమీదుగా పద్మశ్రీ, 2005లో ఇందిరాగాంధీ ప్రియదర్శిని అవార్డు, 2007లో భువనేశ్వర్ గురుపంకజ్ చరణ్ ఒడిస్సీ ఫౌండేషన్ వారి మహరి అవార్డు, అసంఖ్యాకమైన సన్మానాలు అందుకున్నారు. ఈవిడ నిండు కుండ, బంగారు కొండ.
విదేశాలలో ప్రదర్శనలు
అమెరికా, యుకె, జర్మనీ, ఫ్రాన్సు, ఇటలీ, గ్రీసు, ఆస్ట్రియా, స్విట్జర్లాండ్, పోలాండు, క్రొయేషియా, చెకొస్లవేకియా, హాలండ్, చైనా, బెల్జియం, ట్యునీషియా, సైప్రస్, కువైట్, జపాన్, యుగొస్లేవియా, శ్రీలంక, పాకిస్తాన్, భూటాన్, కంబోడియా వంటి ఎన్నో దేశాలలో మన కీర్తి పతాక ఎగురవేశారు.
నృత్యరూపకాలు
కృష్ణ ఓ కృష్ణ, నలదమయంతి, చంద్రభాగే, వసుంధర, రాంకీ శక్తిపూజా- ఇలా ఎన్నో మరెన్నో రూపకాలు దేశ విదేశాలలో ప్రదర్శించింది.
రాధగా: జయదేవుడు రాసిన గీత గోవిందం ఎంతో ప్రసిద్ధమైనది. ఇందులో రాధ ప్రణయం, విరహం అష్టపదులలో ప్రదర్శిస్తారు. నృత్యం ప్రదర్శనలో అద్భుతంగా కనిపించే ఆహార్యాన్ని చూసి ప్రేక్షకులు ముగ్ధులవుతారు. నటనలో ఆమె జీవిస్తారు. అయితే రంజనాగౌహర్ మధుర భక్తిరసాన్ని పండిస్తారు. ఆవిడ నృత్యంలో ప్రేక్షకులు వారిని వారు మరిచిపోతారు. ఆవిడ రాధను కన్నుల ముందు సాక్షాత్కరింపజేస్తారు.
చిన్నారుల కోసం కొరియోగ్రఫీ
మాట సున్నితం, మనస్సు నవనీతం అయిన రంజనా గౌహర్ చిన్న పిల్లలకోసం హోలీకీ కహానీ, బచ్చోంకీ జుబానీ, శ్రవణ్‌కుమార్, ఏకలవ్య, ఆలీబాబా చాలీస్ చోర్ వంటివి ఎన్నో కొరియోగ్రఫీ చేశారు.
డాన్స్ ఫెస్టివల్స్
ఎందరో యువ కళాకారులను తీర్చిదిద్దుతున్న ఈవిడ ఎన్నో డాన్స్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శనలు ఇచ్చారు. ఖజరహో, కోణార్క్, మల్లాపురం, కేరళలో తిరువనంతపురం, మంగళూరులో విరాసత్ ఫెస్టివల్, అలహాబాద్‌లో త్రివేణి మహోత్సవ్, ఉజ్జయినీలో కాళీదాస్ సమారోహ్ ఇంకా ఎన్నో ప్రదర్శనలు ఇచ్చి మెప్పించారు. ఆ ప్రదర్శనలు అందరినీ ఆనందసాగరంలో ముంచెత్తేవి.
రచయిత్రిగా రాణింపు
2007లో ‘ఒడిస్సీ, డాన్స్ డివైన్’ అనే పుస్తకం రాసి ఎంతో పేరు తెచ్చుకుంది. మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ వారు సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ ఇచ్చి గౌరవించారు.
భారతీయ శాస్ర్తియ నృత్యాల పథము, గమ్యము భక్తి మాత్రమే. భక్తికోసం భక్తి చేత, భక్తిద్వారా నృత్యం వ్యాపింది. రంజనా గౌహర్ నృత్యం అలౌకికము. ఈవిడ దేశ కాల పరిస్థితులు, కుల, మత, వర్ణ, వర్గములను అధిగమించి నృత్యం చేస్తుంది. పద్మశ్రీ రంజనా గౌహర్ అపర రాధ!

-డాక్టర్ శ్రీలేఖ కొచ్చెర్లకోట, పి.హెచ్‌డి 9000535383