మెయిన్ ఫీచర్

ఇతరుల కోసం ఒక్క క్షణం.. (గోరుముద్ద)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అది లాల్ బహదూర్ శాస్ర్తీ దేశ ప్రధానిగా పాలిస్తున్న రోజులు. భోపాల్‌లో ఆయన ఓ కార్యక్రమంలో పాల్గొనటానికి వెళ్లారు. ఓ ఉర్దూకవి ఆయనను చూసి మీ వేషం (్ధవతి, కుర్తా) ప్రస్తుత ప్రధాన మంత్రి హోదాకు తగ్గట్లుగా లేదు. ప్రతిరోజూ ఎంతోమంది విదేశీయులను మీరు కలుసుకోవాలి. దానికి తగ్గట్టుగా లేదు అని అన్నారు. దానికి ఆ నిరాడంబర ప్రధాని ఇలా అన్నారు. ‘‘చేసే పనులను బట్టి ఓ వ్యక్తి శీలాన్ని నిర్ణయించాలి. కానీ అతని వేషధారణను బట్టికాదు. ఒక దేశం గురించి చెప్పేటప్పుడు ఆ దేశ ప్రజల గుణగణాలను చూడాలి కాని జనాభా సంఖ్య ముఖ్యం కాదు’’. మరి ఈ దృష్టితో చూస్తే లాల్ బహదూర్ శాస్ర్తీ ఎంత గొప్పవారు. 18 నెలల పాటు ప్రధానిగా చేసినా, కేంద్ర మంత్రిగా పనిచేసినా ఆయన అస్తుపాస్తులేవీ సంపాదించలేదు. పాపం అలహాబాద్‌లో ఒక ఇల్లు కొనుక్కోవాలని అనుకున్నారు గాని రేటు ఎక్కువ ఉండటంతో వదిలేశారు. ప్రధాని పదవిలో ఉండికూడా నిజాయతీకి నిలువుటద్దంగా నిలిచిన లాల్ బహదూర్ శాస్ర్తీ నిరాడంబరతత్వాన్ని, నిజాయతీని పొగడకుండా ఉండగలమా!
‘‘ఇతరుల కోసం జీవించేవారే నిజంగా జీవిస్తున్నట్లు’’ అని స్వామి వివేకానంద చెప్పారు. కాని మనం పక్కవారి కోసమే ఆలోచించం. మనమూ, మన సౌకర్యాల గురించే నిరంతరం తపించిపోతుంటాం. పిల్లల్ని సైతం అలాగే పెంచుతున్నాం. ఇటీవల ఓ టాలీవుడ్ సినిమా హీరో ఇంటర్వ్యూ టీవీలో వచ్చింది. ఆయన చనిపోయాడనుకోండి. ఆయన జ్ఞాపకార్థం ఆ ఇంటర్వ్యూను మళ్లీ ప్రసారం చేశారు. తాను వాన కురిసే రేకుల షెడ్‌లో పెరిగినా.. తన పిల్లలను మాత్రం బెంజ్ కారులో పంపించాను అని చెప్పారు. కాని ఆ హీరో పేదల కోసం ఎన్నో సేవాకార్యక్రమాలు చేశారు. ఆలాంటి సేవా దృక్పథం మరి పిల్లలకు జీవితాంతం ఉంటుందా అని అంటే కాలమే చెప్పాల్సి ఉంటుంది. పిల్లలకు ఎక్కడ కష్టం అవుతుందోనని లక్షలు ఖర్చుపెట్టి ఎయిర్ కండీషన్డ్ స్కూళ్లలో చదివించే తల్లిదండ్రులు వారిని చిన్నతనం నుంచే సుఖాలకు, విలాసాలకు అలవాటు చేస్తున్నారు. సాధారణంగా జీవించటం, ఉన్నతంగా ఆలోచించడం అనే విషయాన్ని ఏనాడో మరిచిపోయాం. టీవీ, మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లతో కాలక్షేపం చేయిస్తున్నాం. చిన్నప్పటి నుంచి ఇలాంటి సుఖాలకు, విలాసాలకు అలవాటు పడినవారు ఇతరుల కష్టాలను ఎలా అర్థం చేసుకుంటారు. ఇతరుల కోసం చేన చిన్న పని అయినా మన అంతరంగంలో నిక్షిప్తమై ఉన్న సింహసదృశ్యమైన శక్తిని మేల్కోల్పుతుంది. ఇలాంటి శక్తి పుస్తక విజ్ఞానం వల్ల, సాంకేతిక పరిజ్ఞానం వల్ల కూడా రాదనే విషయం గ్రహించలేకపోతున్నాం. అందుకే స్వామి వివేకానంద మనం నిజంగా జీవించటల్లేదని ఆనాడే ఆయన నొక్కి వక్కాణించారు. ఇతరుల కోసం చిన్నపాటి సాయం చేసినా వారి మనసులో శాంతి నెలకొంటుంది. చిన్నప్పటి నుంచే పిల్లల్లో సేవాభావాన్ని అలవాటు చేస్తే జీవితంలో విజేతలుగా నిలుస్తారనటంలో ఎలాంటి సందేహం లేదు. జీవితంలో కష్టాలనే ఊహించలేని పిల్లలను తయారుచేస్తున్నాం. అందుకే పిల్లలు అపజయాలకు కుంగిపోతూ వివిధ మానసిక వ్యాధులకు, అశాంతికి గురవుతున్నారు.
ఓసారి ఓ యువకుడు స్వామి వివేకానంద వద్దకు వచ్చి మనశ్శాంతి కోసం ఇంటి తలుపులు, కిటికీలు మూసేసి ధ్యానం చేస్తున్నాను. కాని మనసుకు శాంతి కలుగటం లేదు అని అన్నాడు. దానికి స్వామిజీ సమాధానం ఇస్తూ..ఇపుడు నువ్వు చేస్తున్న పనికి వ్యతిరేకంగా చేయాలి అని అన్నారు. ఇంటి తలుపులు, కిటికీలు తెరిచి చూడు బయట ఎంతోమంది కష్టాలు పడుతున్నారు. సాయం కోసం ఎదురుచూసే వారు కనిపిస్తారు. వారి కోసం పనిచేయి. నీకు మనశ్శాంతి కలుగుతుంది అని అన్నారు. అమాయకమైన పిల్లల్లో తెలియని స్వార్థం ఉంటుంది. అలాంటి స్వార్థాన్ని ఉగ్గుపాలతో తొలగించాల్సిన తల్లిదండ్రులు నిస్వార్థాన్ని నేర్పకపోగా.. నేను, నా తల్లిదండ్రులు అనే సంకుచిత మసస్తత్వంతో ఆలోచించేలా చేస్తున్నాం. అందువల్లే నేడు పిల్లలు పెద్దయిన తరువాత ఎన్నో దురాగతాలకు పాల్పడుతున్నారు. తోటివారిని మాటలతోగానీ చేతలతో హింసిస్తున్నారు. మనం చిన్నప్పుడే తోటివారిని హింసించవద్దని చెబితే నేడు జరిగే ఎన్నో అకృత్యాలను అరికట్టగలం. కాబట్టి స్వామి వివేకానంద చెప్పినట్లు అంతా మనవారే అని నేర్పితే పిల్లల జీవితం శాంతిమయమే.

-హరిచందన