మెయిన్ ఫీచర్

పండుగ రోజు.. అదిరే పరికిణి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫ్యాషన్ ప్రపంచంలోకి ఎన్ని సరికొత్త సొబగులు వస్తున్నా.. ఓల్డ్ ఈజీ గోల్డ్ అన్నట్లు పరికిణీల్లో మెరిసిపోవాలని అనుకుంటారు. నట్టింట అమ్మాయిలు పరికిణీల్లో పుత్తడి బొమ్మల్లా తళుకులీనుతుంటే చూడముచ్చటగా ఉంటారు. సంక్రాంతి సరదాకు స్వాగతం పలుకుతూ.. మూడు రోజులు పాటు జరిగే ఈ వేడుకల్లో అందంగా కనిపించాలంటే లంగావోణీలే సరైనవి. ఒకే రంగు, ఒకే డిజైన్‌లతో కాకుండా విభిన్నమైన వెరైటీల్లో మార్కెట్లో సందడి చేస్తున్నాయి. సంప్రదాయాలకు విలువనిస్తున్న ఆధునిక యువతులు లంగావోణీల ఎంపికలో చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటే సరి.
లంగావోణీని ఎక్కడా మడతలేకుండా కుట్టుకుంటే నిండుగా, సన్నగా కనిపిస్తారు. ఓణీ కొంగును జాలువారేలా వదిలేసినట్లుగా కాకుండా.. పొందిగ్గా అమర్చుకుంటే చూడ్డానికి బాగుంటుంది.
ప్రింటూ, డిజైన్లు చిన్నగా ఉండేలా చూసుకోండి. లేతవి కాకుండా ముదురు రంగులు ఎంచుకోండి.
పరికిణీ, బ్లవుజ్ హెవీ డిజైన్ ఉండి ప్లెయిన్ వోణీ వేసుకున్నా నలుగురిలో ప్రత్యేకంగా కనిపిస్తారు.
కాస్త లావుగా ఉన్నవారు మెరిసే బ్లవుజూ, మెరిసే పరికిణీని ఎంచుకుంటే కొంచెం సన్నగా కనిపిస్తారు.
పరికిణీ మీద మోచేతి వరకు బ్లవుజ్ కుట్టించుకున్నా లేదా చేతుల్లేని బ్లవుజ్ వేసుకున్నా ఫరవాలేదు.
లంగావోణీతో పాటు నగల ఎంపిక కూడా ముఖ్యమే. మెడ నిండుగా కాకుండా సింపుల్‌గా ఒక నగ మాత్రమే వేసుకుంటే ఆకట్టుకునేలా కనిపిస్తారు. జడ బిగుతుగా కాకుండా లూజుగా వదిలేస్తే ఆహార్యానికి నిండుదనం వస్తుంది.
ప్రత్యేక వేడుకలకి, పెళ్లిళ్లకు, పార్టీలకే కాకుండా ఇలాంటి పండుగలకు లంగావోణీ వెరైటీని ఎంచుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.
ఒకప్పుడు పట్టు లంగాలు సింపుల్ డిజైన్లలో వచ్చేవి. నేడు కొత్త ఫ్యాషన్ ట్రెండ్స్‌తో మనసు దోచుకునే డిజైన్లు వస్తున్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం కుచ్చిళ్ల అందాలను సరికొత్త డిజైన్లలో ఆవిష్కరించండి.