మెయిన్ ఫీచర్

తెలుసుకొనవే యువతీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేడు ఎటు చూసినా ప్రేమ పేరుతో జరుగుతున్న దారుణాలకు అంతే లేకుండా పోతున్నది. యువత ప్రేమ పేరుతో జీవితాలను సర్వ నాశనం చేసుకొంటున్నారన్నది అక్షర సత్యం. అల్లారుముద్దుగా పెంచుకొంటున్న అమ్మనాన్న లకు తీరని వ్యధను మిగులుస్తున్నారు. నిజమైన ప్రేమ ఎదుటి వారి అంతం చూడదు. కాని యువత అదేమీ పట్టకుండా ప్రేమ పేరుతో చేస్తోన్న ఆరాచకాలు ఎన్నని చెప్పగలము.. మరికొంతమంది క్షణికమైన ఆకర్షణ కు గురై.. కేవలం శారీరక వాంఛలు తీర్చుకుని జీవితాలను నరక ప్రాయంగా మార్చుకొంటున్నారు. ఇది ఎంతవరకు సమంజసమో యువత ఒక్క క్షణం ఆలోచించాలి.
ప్రేమ ఓ అందమైన పదం కాని ఆ ప్రేమను ప్రేమ పేరుతో అంతాకలుషితం చేస్తున్నారు. ప్రేమ అందమైన దృశ్యంగా చిత్రీకరించవచ్చు. ఓ అందమైన కథలా వ్రాయవచ్చు.. కాని ప్రేమను నేడు సినిమాల్లో ఫ్యామిలీతో చూడలేని స్థితికి దిగజార్చారు. హీరోయిన్స్ అంగాంగ ప్రదర్శన చేస్తున్నారు.
యువతను కోరేది ఒకటీ ముందు చదువు ఆ తర్వాత కేరీర్ .. ఆ తర్వాత చక్కని భవిష్యత్ కు రూపకల్పన. పాతికేళ్ల మీ జీవితాన్ని అనుక్షణం అహర్నిశలు మీ మేలు కోరే మీ అమ్మనాన్నలకు మీరిచ్చే బహుమతి ప్రేమ పేరుతో మిమ్మల్ని మీరు వంచించుకోవడం కాదు సనాతన సాంప్రదాయాల ఈ కర్మ, వేద భూమిలో పుట్టిన మనం ఆచార సంప్రాదాయాలను ఏనాడూ వీడరాదు.
ప్రేమ పెళ్లిళ్లు మొదట్లో బాగున్నట్టు కనిపించినా రాను రాను డొల్ల తయారై ఒకరిమీద ఒకరు అనుమానంతో దాంపత్యజీవితానికి వారికై వారే తూట్లు పొడుచుకుంటారు.
ప్రేమ పేరుతో అమ్మాయిల వెంట తిరిగే అబ్బాయిలు ఉంటే అది ఒక చాపల్యం. ఒక ఆకర్షణ తప్ప వేరేమీ కాదు. చదువుకునే టైములో చదువుకోక ప్రేమ పేరుతో తిరుగుళ్లు ఆడ మగ ఎవరికైనా మంచివి కావు. చదువు, ఉద్యోగం లాంటివి లేకపోతే 30 రాబోయే కాలంలో నీవు మోయాల్సిన బరువులు మరింత భారమవుతాయి. అవి నిన్ను నీ ఆలోచనలను కుంగదీస్తాయి. ఆడపిల్లలకైనా మచ్చ తెస్తాయి కాని మంచి పేరును మాత్రం తీసుకొని రాలేవు. ప్రేమపేరుతో ఆకర్షణలకు లోనుకాకండి. నిజజీవితాన్ని బాగా తరిచి చూడండి. మీ తల్లిదండ్రులు మీపట్ల వ్యవహరిస్తున్న తీరును గమనించండి. వారు మీ కోరికలు ఎట్లా తీరుస్తున్నారో చూడండి. వారి ఆర్థికవ్యవస్థను గమనించండి. మీరు ఏ మెట్లు ఎక్కాలనుకొన్నారో ఇప్పుడు ఏ మెట్ల పైనిలబడి ఉన్నారో ఒక్కసారి చూడండి. ప్రేమ అనేది త్యాగాన్ని కోరుకుంటుంది. ప్రేమకు ఇది మొదటి లక్షణం. ఈ లక్షణం మీ ప్రేమలోనూ, మిమ్మల్ని ప్రేమించేవారిలోనూ ఉందాలేదా ముందు గమనించండి. కేవలం ప్రేమ రాక్షసంగానో, క్రూరంగానో ఉంటే వెంటనే వదిలెయ్యండి. ఎదుటి వారిని బాధించి ఈ ప్రేమను గెలిపించుకోవాలి అని అనుకోకండి. ప్రేమ ఎదుటివారి బాగునుకోరుకుంటుంది. అబ్బాయిల కన్నా సున్నితులు అమ్మాయిలు. ఒక్కసారి ఏదైనా అనుకోనిది జరిగినప్పుడు వాళ్లు మళ్లీ మామూలు స్థితికి రావడానికి ఎంతో కష్టపడుతారు. కనుక ముందే అన్నీ ఆలోచించుకోండి. ఎవరో ఏదో చేశారని మీరు వాళ్లలా చేయాలనుకోకండి. మీకున్న పరిస్థితులు వారికి లేకపోవచ్చు. వారికున్న అనుభవం మీకు లేకపోవచ్చు. ఏదైనా జరగవచ్చు. మిమ్మల్ను కని అల్లారుముద్దుగా పెంచుతున్న అమ్మనాన్నలు మీ అభివృద్ధి ని కోరుకుంటారే కాని మీకే దో కీడు జరగాలని అనుకోరు కదా. అందుకే నిర్ణయాలు తీసుకొనేముందువారితో మీ అభిప్రాయాలు పంచుకోండి. వారు చెప్పేది మీరు ప్రశాంతంగా వినండి. మీ కోరికలు వారికి వివరించండి. వాళ్లు ప్రశాంతంగా వినేలా చేయండి. అప్పుడే మీకు వారికి మధ్య ఉన్న బంధం బలపడుతుంది. ప్రేమతో ఇరుకుటుంబాల వారు సంతోష తరంగాలు కావాలి. దాన్ని మరవకండి.

-కురవ శ్రీనివాసులు