మెయిన్ ఫీచర్

నా దాహం తీరిని..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్యాడ్మింటన్, స్విమ్మింగ్, బాస్కెట్‌బాల్, సైక్లింగ్, స్కూబాడైవింగ్.. ఈ జాబితాకు అంతే లేదు.. అన్ని రకాల ఆటల్లోనూ సత్తా చాటుకుంటానని ఆమె సవాలు చేస్తోంది.. శారీరకంగా ఎలాంటి లోపం లేని వారు ఇలాంటి సవాలు చేస్తే ఎవరూ అంతగా విస్మయం చెందనక్కర్లేదు.. చక్రాల కుర్చీకే పరిమితమైనప్పటికీ ఆమెలోని ఆత్మవిశ్వాసం అనన్య సామాన్యం.. అసాధారణ ప్రతిభకు ఆమె ఓ నిదర్శనం.. దాదాపు పదేళ్ల క్రితం- ఆమె ఓ ఆస్పత్రి బెడ్‌పై నిద్ర లేచి చూసేసరికి.. తనలో ఏదో నిస్సత్తువ.. అందరిలా లేచి కూర్చోలేని దుర్భర స్థితి.. అప్పుడు అర్థమైంది ఆమెకు- రోడ్డు ప్రమాదంలో తన వెన్నుపూస దెబ్బతినడంతో లేచి నిలబడలేనని.. కుటుంబ సభ్యులతో కలసి కారులో గుజరాత్ వెళ్తుండగా అనుకోని దుర్ఘటన.. రోడ్డుపై వెళుతున్న కారు పల్టీకొట్టి ఎనిమిది అడుగుల ఓ గోతిలోకి జారిపడింది.. రోడ్డు ప్రమాదం కారణంగా నిలబడలేని దయనీయ పరిస్థితి ఏర్పడడంతో ఆమె డాక్టర్‌ను అడిగింది- ‘అందరిలా నేను ఎప్పుడు నిలబడగలనని.. ఎప్పుడు పరిగెత్తగలనని’.. వెన్నుపూస దెబ్బతినడంతో నిలబడే అవకాశం లేదని డాక్టర్ చెప్పినా ఆమె ఏ మాత్రం కుంగిపోలేదు.. డాక్టర్ చెప్పిన సమాధానంతో కొంతసేపు తన గుండె ఆగినంత పనైందని, అయినా తనకు ఇష్టమైన ఆటల్లో రాణించాలని నిర్ణయించుకున్నట్లు ఆమె తన మనోగతాన్ని బయటపెట్టింది..
ముంబైకి చెందిన కార్తికి పటేల్ కాలేజీలో చదువుతుండగా బాస్కెట్‌బాల్ క్రీడలో అద్భుత నైపుణ్యం ప్రదర్శించింది. చదువుపై దృష్టి పెడుతూనే మరోవైపు ఆమె రోజుకు ఎనిమిది గంటల సేపు బాస్కెట్‌బాల్ ఆడేది. చిన్నప్పటి నుంచి కష్టాలు వెన్నంటి ఉన్నా ఆమె మనోనిబ్బరం కోల్పోలేదు. పనె్నండవ తరగతి చదువుతుండగా తల్లిని, డిగ్రీ ఆఖరి సంవత్సరంలో ఉండగా తండ్రిని కోల్పోయింది. విషాద ఘటనలు ఎదురైనా తనను తాను సముదాయించుకుని పీజీ పూర్తిచేసింది. చదువు ముగిశాక ఐటీ సంబంధిత రంగంలో ఆమెకు ఉద్యోగం వచ్చింది. ఉద్యోగంలో చేరిన ఏడాదికి- రోడ్డు ప్రమాదంలో ఆమెకు మరో విపత్కర పరిస్థితి ఎదురైంది. అప్పుడు ఆమెకు 25 ఏళ్లు.
రోడ్డు ప్రమాదం కారణంగా నిలబడలేని పరిస్థితి ఏర్పడడంతో కార్తికి కొన్నాళ్లు మంచానికే పరిమితమైంది. ఆ సమయంలో ఓ స్నేహితురాలు చెప్పిన మాటలతో ఆమె తన భావి జీవితానికి తానే దిశానిర్దేశం చేసుకుంది. ఎప్పుడూ మంచంపైనే పడుకుని విషాదాన్ని తలచుకుంటే జీవితం ముందుకు సాగదని, ఏదో ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలని స్నేహితురాలు ఇచ్చిన సూచనలు ఆమెలో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. ఉద్యోగానికి పరిమితమై పోవడంతో ఏదో తెలియని వెలితి తనలో ఏర్పడిందని కార్తికి భావించి, ఆటలపై దృష్టి సారించాలని సంకల్పించింది. సంపాదనతో నిజమైన సంతృప్తి లేదని గ్రహించి, ఏదో ఒక ఆటలో కృషి చేయాలని నిర్ణయించుకుంది. స్విమ్మింగ్‌పై దృష్టి సారించాలని తన సమీప బంధువు ఇచ్చిన సలహాను ఆమె పాటించింది. అనేక ఈతపోటీల్లో బహుమతులు సాధించడంతో మిగతా ఆటలపైనా పట్టు సాధించాలన్న తపన పెరిగింది. ఓసారి ఈతపోటీలకు హాజరైనపుడు ‘వీల్‌చైర్ బాస్కెట్‌బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యుబీఎఫ్‌ఐ) ప్రతినిధులను ఆమె కలుసుకుంది. చెన్నైలో ‘వీల్‌చైర్ బాస్కెట్‌బాల్’ పోటీలు జరుగుతున్నాయని తెలిసి అక్కడికి కార్తికి వెళ్లింది. అయితే, ఆ పోటీలకు మహిళలెవరూ హాజరుకాలేదని తెలుసుకుని కొంత నిరుత్సాహ పడింది.
పూణెకి చెందిన కొందరు ఆర్మీ క్రీడాకారులు ఆమె గురించి తెలుసుకుని, వీల్‌చైర్‌లో కూర్చుని బాస్కెట్‌బాల్ ఆడేలా శిక్షణ ఇచ్చారు. ఆ తర్వాత ఆమె జాతీయ స్థాయి బాస్కెట్‌బాల్ పోటీల్లో మూడుసార్లు తన జట్టును గెలిపించింది. విదేశాల్లో జరిగిన పలు టోర్నీల్లోనూ సత్తా చాటింది. స్పానిష్ ఓపెన్ టోర్నమెంటులో కాంస్య పతకాన్ని సాధించింది. పరిగెడుతూ బాస్కెట్‌బాల్ ఆడడం కన్నా, వీల్‌చైర్‌లో మెరుపువేగంతో కదులుతూ ఆ ఆటను ఆడడం కష్టసాధ్యమని కార్తికి చెబుతోంది. చేతులతో చక్రాల కుర్చీని కదుపుతూ మరోవైపు బంతిని బాస్కెట్‌లో వేయడం అంత సులువుకాదంటోంది. శరీరాన్ని అదుపులో ఉంచుకుంటూ వీల్‌చైర్‌లో కదులుతూ బాస్కెట్‌బాల్ ఆడాలంటే కఠోర శ్రమ, నిరంతర శిక్షణ అవసరమని చెబుతోంది. 2015లో ఉద్యోగానికి స్వస్తి చెప్పాక, ‘సామాజిక వ్యవస్థాపకత’ అనే అంశంలో పీజీ చేయాలని సంకల్పించిన కార్తికి- ‘నడవలేనివారి కోసం’ ఫిట్‌నెస్ తరగతులు నిర్వహించాలని భావించింది. మరోవైపు సైక్లింగ్, స్కూబాడైవింగ్‌లోనూ మెళకువలు నేర్చుకుంది. ‘మనాలి ఖర్దుంగ్ లా’ పేరిట దివ్యాంగుల కోసం జరిగే సైక్లింగ్ పోటీలకు హాజరయ్యేందుకు ఓ ట్రైస్కిల్‌ను కొని తర్ఫీదు పొందింది. వంద కిలోమీటర్ల సైక్లింగ్ పోటీలో పాల్గొనాలన్నదే తన ధ్యేయమని ఆమె ఎంతో ఆత్మవిశ్వాసంతో చెబుతోంది.
తొలిసారి ఉద్యోగంలో చేరినపుడు అక్కడ పరిచయమైన హెర్మన్‌ను ఆమె గత ఏడాది డిసెంబర్‌లో వివాహం చేసుకుంది. రోడ్డు ప్రమాదానికి గురైన తర్వాత తన గురించి అన్ని జాగ్రత్తలు తీసుకున్న హెర్మన్‌తో సాన్నిహిత్యం పెరిగి, చివరికి అది దాంపత్య బంధానికి దారితీసిందని కార్తికి వివరిస్తోంది. జీవితంలో స్థిరపడ్డాక పిల్లల్ని కనే విషయం ఆలోచిస్తానని అంటోంది. కుటుంబ జీవితం అన్నింటి కన్నా విలువైనదని చెబుతున్న ఆమె- తాను ఇంకా ఆడాల్సిన క్రీడలు ఎన్నో ఉన్నాయని చెబుతోంది. ఒక్కో ఆటలో సంతృప్తి చెందాకే తాను వాటికి ‘గుడ్ బై’ అంటానని తెలిపింది. ఈ ఏడాది మార్చిలో బ్యాంకాక్‌లో జరిగే ‘ఆసియన్ పారా గేమ్స్’లో భారత మహిళా వీల్‌చైర్ బాస్కెట్‌బాల్ జట్టుకు కెప్టెన్‌గా కార్తికి ఎంపికైంది. 2020లో జరిగే పారా ఒలింపిక్స్‌కు హాజరవ్వాలన్నదే తన ఆకాంక్ష అంటోంది.

-ఎస్.ఆర్