మెయిన్ ఫీచర్

ఆ పల్లెకు పట్టు‘కొమ్మ’లు వీరే..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అన్ని రంగాల్లో పురుషులతోపాటు సమానంగా రాణిస్తున్నారు మహిళలు. ఇది నిజమే..కేవలం ఉద్యోగాలే కాదండోయ్... వ్యవసాయంలోనూ మేము పురుషులతోపాటు ఏమాత్రం తీసిపోము అంటారు ఓ పల్లెలోని మహిళలు. పట్టుచీరలు కట్టుకుంటే పుత్తడి బొమ్మల్లా కనిపిస్తారు మహిళలు. ఆ పట్టు తయారీకి మూలం మల్బరీ. అనంతపురం జిల్లాలో మల్బరీ గ్రామంగా పేరొందిన నల్లమాడ మండలంలోని కుటాలపల్లిలో వ్యవసాయం చేయడంలో మహిళలదే పైచేయి. మల్బరీ, వరి, వేరుశనగ, టమోట, మిర్చి, వంగ, మొక్కజొన్న, రాగి ఇలా ఏ పంటనైనా నాట్ల సమయం నుంచీ పంట దిగుబడి వచ్చేంత వరకూ నిరంతరంగా శ్రమించే మహిళా మణులున్న గ్రామం కుటాలపల్లి. ఇళ్ళల్లో మా ఆడంగులే లేకపోతే మేము వ్యవసాయంలో రాణించలేమని ఆ పల్లెలోని మగాళ్ళే చెప్పుకుంటారు.
నీటి ఎద్దడి లేకుండా వుంటే ఎప్పుడూ పచ్చగా వుండే ఈ పల్లెకు వెళ్తే ఏ గుమ్మాన్ని తొక్కినా రాప్పా బువ్వ తిందువు... కాపీ తాగుతావా.. అయ్యో కాసిన్ని మజ్జిగైనా తాగు సామీ అనే ఆప్యాయత నిండిన పలకరింపే వస్తుంది. 500ల గడపలున్న ఈ పచ్చని పల్లె వాసులు పూర్తీగా వ్యవసాయానే్న నమ్ముకుని జీవనం కొనసాగిస్తున్నారు. మల్బరీ అత్యధికంగా సాగులో వున్నప్పుటికీ అన్ని రకాల పంటలూ ఈ పల్లెవాసులు సాగుచేస్తుంటారు. పల్లెలోని పురుషులు కేవలం ఒకటి రెండు గంటలపాటు వ్యవసాయ పనులు చేస్తే నిరంతరంగా ఏదో ఒక వ్యవసాయ పనులలో నిమగ్నమై వుండే మహిళలే ఈ పల్లెలో కనిపిస్తారు.

ఈ పల్లెలోని ప్రతి ఇంటిలోని మహిళా ఉదయం లేచినప్పటి నుంచి నిద్రకుపక్రమించేవరకు ఏదో ఓ పనిలో నిమగ్నమై వుండటం కనిపిస్తుంది. సాధారణంగా ఏమహిళ అరచేయిని పరిశీలించినా ఎంతో సున్నితంగా కనిపిస్తుంది. అయితే ఈ పల్లెలోని మహిళల చేతులను పరిశీలిస్తే వారు పడే కష్టం ఆ చేతుల్లోనే కనిపిస్తుంది. ఏ కుటుంబం అయినా అభివృద్ధి చెందాలంటే ఆకుటుంబంలో ఆడా మగా అనే తారతమ్యాలు లేకుండా శ్రమిస్తే ఆకుటుం అభివృద్ధి చాలా సులువనే చెప్పొచ్చు. మగాళ్ల కంటే ఎక్కువగా వ్యవసాయ పనుల్లో శ్రమిస్తూ కుటుంబ అభివృద్ధిలో మహిళలే మూల స్థంభాలుగా నిలుస్తున్నారనడానికి నిలువెత్తు సాక్ష్యం కుటాలపల్లి.
ఉదయానే్న 5గంటలకే నిద్రలేచి ఇంటిముందు, పశువుల దొడ్డిలో చెత్తాచెదారాలను శుభ్రం చేసి ఇంటిల్లిపాదికీ అవసరమయ్యే బువ్వ వండిపెట్టి సద్ది కట్టుకుని పొలానికి వెళ్ళే మహిళలు కొందరు. ఇంటి దగ్గరున్న పాడి పశువులపై కడిగి పొలానికెళ్ళి వాటికి మేత కోసుకొచ్చి ముక్కలు చేసి పశువులకేసే మహిళలు మరికొందరు. ఇంటిలో దగ్గరే షెడ్‌లలో వున్న మల్బరీ తట్టలు శుభ్రపరచడం, పట్టుపరుగులకు మేత వేస్తూ అధిక దిగుబడికి అవసరమయ్యే పనులన్నీ చేసే మహిళలు ఇంకొందరు. ఇలా ఈ పల్లెలోని ప్రతి ఇంటిలోని మహిళా ఉదయం లేచినప్పటి నుంచి నిద్రకుపక్రమించేవరకు ఏదో ఓ పనిలో నిమగ్నమై వుండటం కనిపిస్తుంది. సాధారణంగా ఏమహిళ అరచేయిని పరిశీలించినా ఎంతో సున్నితంగా కనిపిస్తుంది. అయితే ఈ పల్లెలోని మహిళల చేతులను పరిశీలిస్తే వారు పడే కష్టం ఆ చేతుల్లోనే కనిపిస్తుంది. ఏ కుటుంబం అయినా అభివృద్ధి చెందాలంటే ఆకుటుంబంలో ఆడా మగా అనే తారతమ్యాలు లేకుండా శ్రమిస్తే ఆకుటుం అభివృద్ధి చాలా సులువనే చెప్పొచ్చు. మగాళ్ల కంటే ఎక్కువగా వ్యవసాయ పనుల్లో శ్రమిస్తూ కుటుంబ అభివృద్ధిలో మహిళలే మూల స్థంభాలుగా నిలుస్తున్నారనడానికి నిలువెత్తు సాక్ష్యం కుటాలపల్లి. ఇదే విధంగా వ్యవసాయ రంగంలో అనునిత్యం శ్రమిస్తూ పదిమందికీ అన్నం పెట్టే అన్నదాత విజయానికి వెనకుండే మహిళా రైతులందరికీ వందనం.. అభివందనం..

-ఎస్.బాబ్‌జాన్ 9492722595