మెయిన్ ఫీచర్

అగ్రస్థానం అమ్మకే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాతృదేవోభవ.. పితృదేవోభవ.. ఆచార్యదేవోభవ అన్నమాట మనం నిత్యం స్మరించే మహోన్నత వేదమంత్రం. ‘అమ్మ’ అన్న రెండక్షరాల మాట గురించి చెప్పాలంటే మనకు సాధ్యంకాదు. నవమాసాలు మోసి మనకు జన్మనిచ్చి తను పునర్జన్మ ఎత్తుతుంది. ఉగ్గుపాలతో పెంచి పోషించి.. ఉన్నతమైన సన్మార్గంలో మనల్ని నడిపించేది అమ్మ మాత్రమే. మంచైనా.. చెడైనా నేర్పేది అమ్మ. ఈ సృష్టిలో ప్రతి మనిషికి తొలి గురువు అమ్మ. కంటికి రెప్పలా కాపాడుతూ. ఏ కష్టం వచ్చినా ముందు నిలబడి ధైర్యం చెప్పేది అమ్మ. ఏ చరిత్ర చూసినా.. ఏ పురాణం చదివినా అన్నింటా అమ్మదే అగ్రస్థానం. మహాభారతంలో కుంతీదేవి చరిత్ర మనకు విదితమే. తన సంతానం కోసం అహర్నిశలు తపించి సాక్షాత్ శ్రీకృష్ణ భగవానుని చెంత చేర్చిన మహనీయురాలు. మాద్రి సంతానం నకుల సహదేవులను తన బిడ్డలుగా చేరదీసిన మాతృమూర్తి, తన బిడ్డ కర్ణుని సైతం ఒప్పించి అర్జునుని తప్ప మిగతా వారిని వధించకుండా చూసిన ధీరవనిత.
రామాయణం యందు మహాసాధ్వి సీతమ్మ పాత్ర అద్వితీయం.. అమోఘం. సాక్షాత్ శ్రీ మహాలక్ష్మీ రూపం అయిన ఓ సామాన్య సాధ్విలా శ్రీరాముని వెంట అడవులకేగింది. ఆకులు, అలములు తిని నారచీరలు ధరించి కుటీరం నందు సామాన్య స్ర్తిలా జీవించింది. అరణ్యవాసం తర్వాత రాణిగా గద్దెనెక్కి... రాముని మాట కోసం నిండు గర్భిణీ అయిన సీతమ్మ తిరిగి అడవులకెళ్లి వాల్మీకి ఆశ్రమం నందు జీవించింది. అశోకవనమైనా.. ఆశ్రమం అయినా ఆ తల్లి ఏనాడూ కలత చెందలేదు. ఆమె జగమెరిగిన మాతృమూర్తి. లవకుశులకు జన్మమిచ్చి.. ఆ బిడ్డలను శ్రీరాముని చెంతకు చేర్చి భూపుత్రికగా చివరకు తన మాతృమూర్తి చెంతకు చేరిన ధన్యురాలు.
ఎక్కడ స్ర్తి పూజింపబడుతుందో అక్కడ లక్ష్మీదేవి కొలువై వుంటుందని మహనీయుల మాట. ఎక్కడైనా చెడ్డవారు వుండవచ్చు. కానీ చెడ్డ అమ్మ వుండదుగాక ఉండదు. ఒక వేళ వున్నా ఆమె మహాపాపిష్ఠి అయి వుండవచ్చు. ఈ జగాన అమ్మ పాత్ర ఎంతని చెప్పగలను. ప్రతి ఇంట స్ర్తి పాత్ర అంతా ఇంతా కాదు. ఇరవై ఏళ్ళు అమ్మ ఇంట గారాబంగా పెరిగిన అత్తారింట అడుగుపెట్టగానే ఆమె సేవలు అనన్యం. అత్తమామలు, ఆడపడుచులు, మరదులు, వచ్చి వెళ్ళే బంధుజనం అందరినీ మెప్పించాలి. అనేక సేవలు అందించాలి. ఆపై తన సంతానం బాధ్యత కూడా తనదే. ఎవరు తప్పు చేసినా అన్ని తానై భరిస్తుంది. భార్యగా.. కోడలుగా.. వదినగా, తల్లిగా సేవకురాలిగా.. దశావతారాలు తానై పాలించి పోషించి కుటుంబాన్ని నిలబెడుతుంది. అదే స్ర్తిమూర్తి గొప్పదనం. అన్నీ జన్మలకెల్లా మానవ జన్మ మహోన్నతము. ఈ జన్మనిచ్చిన మాతాపితరులను కంటికి రెప్పలా చూసుకొంటూ మనకు ఈ జన్మనిచ్చిన ఆ భగవంతునికి హృదయ నివేదనలు అర్పించుకొందాం. మానవ సేవయే మాధవసేవ అన్న సూక్తిని అక్షరాలా పాటిస్తూ మానవ జన్మను చరితార్థం చేసుకొందాము. ఎందరో మహనీయులకు ఆలవాలమైన ఈ కర్మ వేదభూమిలో జన్మమెత్తిన మనమెంతో అదృష్టవంతులం. సదా ఈ భారతావనికి హృదయపూర్వక అక్షర నమస్సుమంజలులు.

-కురువ శ్రీనివాసులు