మనలో - మనం

మనలో మనం (ఎడిటర్‌తో ముఖాముఖి)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పు సత్యనారాయణ, తెనాలి
ట్యాంక్‌బండ్‌పై తెలుగు జాతి గర్వించతగ్గ మహనీయుల విగ్రహాలు స్థాపించిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ట్యాంక్‌బండ్‌పై తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ స్థాపించి తన రాజకీయ గురుభక్తిని చాటుకోవచ్చు కదా!
ఎన్టీఆర్ తన గురువని కెసిఆర్ ఎప్పుడు చెప్పాడు?

నేటి చిత్రాలలో ‘కళాత్మక విలువలు’ దిగజారి వ్యాపార ధోరణి పెరిగిపోతుందని ప్రేక్షకులు విమర్శిస్తుంటే, ప్రేక్షకులలో ‘కళాదృష్టి’ లోపించిందని కొందరు దర్శక నిర్మాతల వాదన. వీటిలో ఏది సరైనదో వివరించండి?
ముసలి నటులను కుర్ర హీరోలుగా చూడాల్సిన బాధ లేకుండా హాయిగా చూడగల మామూలు సినిమా తీయగలిగితే కళాత్మక చిత్రాలు తీసినంత పుణ్యం.

కోవూరు వేంకటేశ్వర ప్రసాదరావు, కందుకూరు
‘ఓటు యజ్ఞం’ ఇక నుంచి నీతి మార్గాన నడుస్తుందా?
ఆ అనుమానం ఎందుకొచ్చింది?

నోట్ల రద్దు విషయం నవంబర్ 8వ తేదీన ప్రజలకు తెలిస్తే అంతకు ముందే కొంతమంది భారీ మొత్తాల్లో నల్లధనాన్ని సర్దుబాటు చేసుకొన్నారట. నిజమేనా?
తెలియదు.

సీరపు మల్లేశ్వరరావు, కాశీబుగ్గ
కాంగీ యువరాజు భూకంపం, తుఫాన్ ప్రకటనలతో స్వయం పరపతి పెంచుకొన్నందుకేనా కాంగీ రాజుగా ఎన్నుకొంటున్నారు?
కాదు. వంశ పారంపర్య హక్కుదారు కాబట్టి.

కొటికలపూడి మధుసూదనరావు, నాగారం
తెలుగువారు తెలంగాణా, ఆంధ్రా అంటూ విడిపోవడం భావ్యమేనా? ఇందులో నాయకుల కుతంత్రం ఎంత?
ఆ చర్చ ఇప్పుడు అనవసరం. గత జలసేతు బంధనం.

సిహెచ్.సాయి ఋత్త్విక్, నల్గొండ
ముంబైలోని మెరీనా డ్రైవ్ వద్ద సముద్ర తీరంలో 3500 కోట్ల ఖర్చుతో శివాజీ స్మారక విగ్రహం ప్రతిష్టించడం సబబేనా? విదేశీ పాలకుల నుండి, పరమత దాడుల నుండి దేశాన్ని, హిందూ మతాన్ని కాపాడిన మహనీయుడే కావచ్చు. అంతమాత్రాన ప్రజాసంక్షేమం, నిరక్షరాస్యత, రైతుల ఆత్మహత్యలు వంటి ముఖ్యాంశాలను పక్కనపెట్టి అన్ని వందల కోట్లతో విగ్రహాలు స్థాపించడం సమర్థనీయమేనా?
నూటికి నూరుపాళ్లు సమర్థనీయం.

డి.ఎస్.శంకర్, వక్కలంక
2017 మార్చి 31 తర్వాత రద్దయిన నోట్లు కలిగి ఉంటే జరిమానా విధిస్తారట. ఇది హాస్యాస్పదం కాదా?
ఔను. చెల్లని నోట్లను దగ్గరుంచుకుంటే ఎలా అపరాధమవుతుందో, దానివల్ల దేశానికి నష్టమేమిటో మనబోంట్లకు అంతుపట్టదు.

ఎల్.ప్రఫుల్లచంద్ర, ధర్మవరం
పట్టపగలు.. జరిగే పెళ్ళిళ్ళలో వధూవరులకు ఆకాశం చూపిస్తూ.. అరుంధతి నక్షత్రం చూడండి అంటూ పురోహితుడు చూపిస్తాడు కదా? ఇదెలా సాధ్యమండీ?
కాదు. పూర్వం ఐదు రోజుల పెళ్లిళ్లలో రాత్రివేళ ఈ కార్యక్రమం ఉండేది. ఇప్పటికీ సంప్రదాయం తెలిసిన వారు పగలు పెళ్లి అయినా వధూవరులకు చీకటి పడ్డాకే అరుంధతిని చూపటం, అనంతర క్రియ జరిపిస్తున్నారు. 8 గంటల కాలానికి కల్యాణ మంటపాన్ని షిఫ్టు పద్ధతిన అద్దెకు తీసుకునే ఈ రోజుల్లో అలాంటివి కుదరవు. కాబట్టి ఇలాంటి ప్రశ్నలు మనం అడగకూడదు. వారు చూడకపోయినా అరుంధతి వారిని చూసే ఉంటుందని అనుకుంటే సరి!

ఎం.కనకదుర్గ, తెనాలి
మతం పేరిట రిజర్వేషన్లు కల్పించడం, లౌకిక వాదానికి తూట్లు పొడుస్తూ మైనారిటీ వర్గాలకు తాయిలాలు చూపి ఆకట్టుకోవడం, ప్రార్థనా మందిరాలకు విరివిగా నిధులు ప్రకటించడం, మతపరమైన యాత్రలకు ప్యాకేజీలు, రాయితీలు కల్పించడం రాజ్యాంగబద్ధమేనా? సెక్యులరిజం పేరిట ఒక వర్గం వారిని ఆకట్టుకోవడం అనైతికం కాదా?
ముమ్మాటికీ.

సి.ప్రతాప్, శ్రీకాకుళం
అమెరికాలో నిషేధింపబడిన మందులు యధేచ్ఛగా మన దేశంలో చెలామణీ అవుతున్నాయని, కమీషన్లకు కక్కుర్తిపడి కార్పొరేట్ ఆసుపత్రులు, డాక్టర్లు అవే మందులను రోగులచే బలవంతంగా మింగించి వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని పలు కథనాలు వెలువడుతున్నాయి. ఇటువంటి అనైతిక చర్యలను ఆపేందుకు నియంత్రణా వ్యవస్థలు మన దేశంలో లేవా?
ఉన్నాయి. కాని బరితెగించిన మెడికల్ మాఫియా ముందు అవి బలాదూరు.

సుజాత నాగరాజరావు, చెన్నై
రాంగోపాల్‌వర్మ గారు తమిళనాడు రాజకీయ సంఘటనల నేపథ్యంలో అమ్మ-చిన్నమ్మ సినిమా తీయగలరా?
తీసినా తీయగలడు.
**

ప్రశ్నలు పంపాల్సిన చిరునామా :
మనలో మనం,
ఆదివారం అనుబంధం,
ఆంధ్రభూమి దినపత్రిక, 36 సరోజినీదేవీ రోడ్,
సికిందరాబాద్-500003.

: email :
sundaymag@andhrabhoomi.net