మనలో - మనం

మనలో-మనం (ఎడిటర్‌తో ముఖాముఖి)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మామెడ రాజేంద్రప్రసాద్, వౌలాలి, హైదరాబాద్
వైకుంఠ ఏకాదశి రోజున వైష్ణవాలయాల్లో ఇసుకవేస్తే రాలనంత జనం.. మరుసటి రోజు ఒక్కరు కనిపిస్తే ఒట్టు.. దీని భావమేమి ఎడిటర్‌గారూ..?
ఏడాది కొకసారి లభించే ప్రత్యేక దర్శనానికి భక్తులు విరగబడటంలో వింత లేదు. మిగతా రోజుల్లోనూ గుళ్లు మరీ ఖాళీగా ఏమీ ఉండవు.

వాండ్రంగి కొండలరావు, పొందూరు
‘మంచి మాట’ శీర్షిక ఆసక్తికరంగా ఉంది. అయితే ఆ అంశానికి సంబంధించి ఓ చిత్రాన్ని వేస్తే మరింత బాగుంటుంది.
స్థలం చాలదు. ప్రతి అంశానికీ బొమ్మ దొరకడమూ కష్టం.

సిహెచ్.ప్రతాప్, శ్రీకాకుళం
ఈ మధ్య న్యూమరాలజీ, గ్రాఫాలజీ, పిగ్నేచరాలజీ పేరిట అనేక సంస్థలు పేరులోని అక్షరాలు, సంతకాలు, చేతిరాత మార్చుకుంటే జీవితంలో అన్ని సమస్యలు తొలగిపోయి విజయం సిద్ధిస్తుందని ప్రకటనలు చేస్తూ కన్సల్టేషన్ కోసం వేలాది రూపాయలు వసూలు చేస్తున్నారు. ఈ అక్షరాలు, రాతలు మార్చుకుంటే తలరాత నిజంగా మారుతుందంటారా? ఎవరు చేసుకున్న కర్మను వారు విధిగా అనుభవించాలన్న మన హైందవ కర్మ సిద్ధాంతానికి ఈ విధానాలు వ్యతిరేకం కాదా?
ఎవరి వెర్రి వారికి ఆనందం. ఆ ఆనందంతో వీరిది వ్యాపారం.

ఎం.కనకదుర్గ, తెనాలి
ఒకప్పుడు మానవుడు తన కొద్దిపాటి ఆదాయంతో తనపై ఆధారపడిన కుటుంబ మంతటినీ సమర్థవంతంగా పోషించేవాడు. అయినా ఎంతో ఆనందంగా నిండు నూరేళ్లు జీవించే వాడు. నేడు నాలుగు తరాలకు సరిపోయే ఆస్తిని కూడబెట్టుకునే ప్రయత్నంలో రోబోలా జీవిస్తూ అన్ని ఆనందాలనూ కోల్పోతున్నాడు. నీటిబుడగ లాంటి ఈ చిన్న జీవితంలో ఇంత హైరానా, ఉరుకులు పరుగులు అవసరమా?
ఆ వెంపర్లాట, ఈ వేదాంతం అన్ని కాలాల్లోనూ ఉన్నవే.

నలుగురం కలిసి హాయిగా కబుర్లు చెప్పుకొని చాలా కాలమైంది. జీవితంలో ఒకటే టెన్షన్, అన్ని ఆనందాలకు దూరమై పోతున్నాం. జీవితంలో ఒక్క ముద్దూ ముచ్చట లేదు లాంటి మాటలు ఈ మధ్య తరచుగా వింటున్నాం. జీవితాన్ని అస్తవ్యస్తం చేసుకోవడం మన స్వయంకృతాపరాధమే అంటాను. మీరేమంటారు?
ఔను.

కళాపూర్ణారావు, అమలాపురం
మేక్ ఇన్ ఇండియా పేరున విదేశీ సంస్థలన్నీ మన దేశంలో విచ్చలవిడిగా వస్తున్నాయి. ఉదా: చైనా, జపాన్, సింగపూర్ కంపెనీలు అమరావతిలో ఇళ్ల నిర్మాణాలు, బొమ్మల తయారీ, సౌర విద్యుత్తు వగైరాలు. కూలీలు మనవారు. లాభాలు వారివి. ప్రధాని నిజాయితీని శంకించడం లేదు. కాని ప్రపంచీకరణ పేరుతో మనం విదేశాలకు దాసోహం అవడం లేదా? ఈ విధానంలో ప్రపంచానికి ఇండియా చోదకశక్తి ఎట్లా అవుతుంది?
సందేహం సమంజసమే. ముందే వ్యతిరేకించడం కంటే ఆచరణలో ఏమయ్యేదీ కొంతకాలం వేచి చూడటం మంచిది.

ఎ.వి.సోమయాజులు, కాకినాడ
రోజాగారు మన బాబుగార్ని ఏమని దూషించారు? ఎంత చెడ్డగా దూషించకపోతే పూర్తి సంవత్సరం సస్పెండ్ చేస్తారు? ఆ దూషణ భూషణాలను వివరిస్తారా సార్?
సస్పెండు చేయాలనుకున్నారు. చేశారు. అంతే. అసభ్య వ్యాఖ్యలు, దుర్భాషలు చట్టసభల్లో సర్వసాధారణమై పోయినందున ఆమె మాటలకు మరీ అంత శిక్ష వేయటం ఆలోచించాల్సిన విషయమే.

బొడ్డపాటి రాజేశ్వరమూర్తి, చిలకలపూడి
మన సమస్యలు అసెంబ్లీలలోనూ, లోక్‌సభ, రాజ్యసభలోనూ చర్చించమని ప్రజా ప్రతినిధులను ఎన్నుకుంటే వారు సదరు సభల్ని అడ్డుకోవటం, బూతులు మాట్లాడే మహిళా సభ్యులు.. సంవత్సరం తరబడి సస్పెన్షన్లు, పార్లమెంటరీ శాఖ మంత్రి వెంకయ్య - కాంగ్రెస్ దయాదాక్షిణ్యాలపై రాజ్యసభ’ అని అంటుంటే.. ఈ నిస్సహాయత ఎన్నాళ్లు? ఎనే్నళ్లు?
మన సహనం నశించేదాకా. మనకు మనం చేసుకున్న అన్యాయాన్ని, అనర్థాన్ని గ్రహించి, మనకు కావలసిన వ్యవస్థను మనమే తయారుచేసుకోవాలన్న వివేకం మనందరికీ కలిగే వరకూ.

యామా జనార్దన్, సూర్యాపేట
అగ్నిహోత్రములో బట్టలను ఆహుతిగా ఇవ్వవచ్చునా? బట్టలను ఆహుతిగా ఇచ్చినచో వాయు పరిశుభ్రమగుటకు బదులు వాయు కాలుష్యమేర్పడదా?
మనం విచ్చలవిడిగా చేస్తున్న కాలుష్యంతో పోలిస్తే అదెంత? పెద్దలు పెట్టిన పద్ధతులను తెలిసీ తెలియకుండా తప్పులెన్నడం తప్పు.

వేదుల జనార్దనరావు, వంకావారిగూడెం, ప.గో.జిల్లా
‘కాల్‌మనీ’ చర్చించు సమయంలో అసెంబ్లీలో జరిగిన గలాటాలు, సస్పెన్షన్లు వెనుక ఆంతర్యమేమిటి?
గోల్‌మాల్‌ని గోలతో కప్పెయ్యాలనేమో!

కొలుసు శోభనాచలం, గరికపర్రు, కృష్ణాజిల్లా
చట్టాలు అమలుపర్చుటలో నిర్లక్ష్యం అవినీతికి పాల్పడుట వలననే కదా నేటి అనేక సాంఘిక రుగ్మతలకు కారణం? పటిష్ఠంగా చట్టాల అమలుకు ఏమి చర్యలు తీసుకోవాలి?
ముందు న్యాయవ్యవస్థను, న్యాయ విధానాన్ని బాగుచేయాలి.

పి.రామకృష్ణ, రాజమండ్రి
తెలుగు సినిమా పరిశ్రమలో కొంతమంది మాత్రమే తరతరాలకు తరగని ఆస్తులు సంపాదించుకున్నారు. మరి కొంతమంది సినిమా మోజుతో ఉద్యోగాలు వదిలి వెనక్కి రాలేక ఇక్కడ సంపాదన లేక తనువు చాలిస్తున్నారు. రంగనాథ్, ఉదయ్‌కిరణ్ ఆత్మహత్యల నేపథ్యంలో. ఇంకా కొంతమంది వ్యసనాల పాలై ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటున్నారు. వారికి ఉన్నది, వీరికి లేనిదీ ఏమిటి?
అదృష్టం. కొంచెం క్రమశిక్షణ.

చండీయాగం ఆహ్వాన పత్రిక ఇవ్వటానికి వచ్చి నాటుకోడి కూర, చేపల పులుసు ఆరగించటం ఎంతవరకూ సమంజసం?
మాంసం వేరు.. యాగం వేరు.

ఎన్.ఆర్.లక్ష్మి, సికిందరాబాద్
గోవధను నిషేధించినా, గోమాంస భక్షణను చట్టం నిషేధించలేదని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. నిషేధించినప్పుడు భక్షణ ఎలా? ఇది కూడా చట్టవిరుద్ధమే అవుతుందిగా.
మన చట్టానికి లౌక్యం ఎక్కువ.

ఆయుత చండీయాగానికి మీరు వెళ్లారా?
లేదు. *
====================
ప్రశ్నలు పంపాల్సిన చిరునామా : మనలో మనం, ఆదివారం అనుబంధం, ఆంధ్రభూమి దినపత్రిక, 36 సరోజినీదేవీ రోడ్, సికిందరాబాద్-500003
e.mail : bhoomisunday@deccanmail.com
====================