మనలో - మనం

మనలో మనం (ఎడిటర్‌తో ముఖాముఖి)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎ.డి. సోమయాజులు, కాకినాడ
తెలంగాణ అసెంబ్లీని డిప్యూటీ స్పీకర్‌గారు (మహిళ) కూడా అప్పుడప్పుడు నిర్వహిస్తున్నారు. ఏ.పి. అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌గారు అనుభవజ్ఞుడు, విజ్ఞుడు. అయనా మండలి బుద్దప్రసాద్‌గారికి ఎప్పుడో అరుదుగా తప్ప అవకాశం ఇవ్వరేమిటి? బుద్ధప్రసాద్‌గారు సభ నిర్వహిస్తే అసెంబ్లీ బుద్ధిగా నడుస్తుందేమో?
అదే భయం!

జి. శ్రీనివాసులు, అనంతపురం
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ముస్లింలకు, క్రిస్టియన్లకు రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రకటించుకున్నాయ. రాజ్యాంగరీత్యా మత రిజర్వేషన్లు చెల్లవని హైకోర్టులు, సుప్రీంకోర్టు తెలిపే వున్నాయ. రాజ్యాంగాన్ని, కోర్టు తీర్పులను ధిక్కరించి రిజర్వేషన్లు కల్పిస్తే రాష్టప్రతి ప్రభుత్వాలను రద్దుచేయరా?
ఆ భయం లేదు. ఎలాగూ కోర్టులో నిలవవని తెలిసే... మైనారిటీల మెహర్బానీకి పోటీపడి వరాలు. దీనివల్ల వారి ప్రాపకం పొందే మాట ఎలా వున్నా హిందువులకు ఒళ్లు మండితే మొదటికే మోసం.

కె.హెచ్. శివాజీరావు, హైదరాబాద్
ఆంధ్రరాష్ట్రం ఏర్పడినప్పుడు ప్రకాశంగారు, ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడు సంజీవరెడ్డిగారు, తెలుగుదేశం అధికారంలోకి వచ్చినప్పుడు ఎన్.టి.రామారావుగారు దేవతలకు బంగారు ఆభరణాలు చేయస్తామని మొక్కుకున్నట్లు గాని, అవి తీర్చినట్లు గాని ఆధారాలు లేవు. కాని కెసిఆర్‌గారు తెలంగాణ ఏర్పడినప్పుడు వివిధ దేవతలకు బంగారు ఆభరణాలు చేయస్తానని మొక్కుకొని అవి క్రమేణా తీర్చుకుంటున్నారు. అయతే వాటి తయారీకి కావలసిన ధనం ఎక్కడనుంచి ఇచ్చారు? సర్వ శ్రేయోనిధి నుంచి ఇచ్చారనుకుంటే అది రాజ్యాంగ విరుద్ధం కాదా?
ఎండోమెంట్సు చట్టంలో సర్వ శ్రేయోనిధికి నిర్దేశించిన నిబంధనకు విరుద్ధం. ఆ సంగతి పట్టించుకున్నవాడు లేడు.

చావలి శేషాద్రి సోమయాజులు, సాలూరు
కాశ్మీర్‌లో జరిగిన ఉపఎన్నికలలో మరీ బొత్తిగా రెండు శాతం పోలింగ్ జరిగింది. అంటే అక్కడి ప్రజలకి భారత్‌లో ఉండటం ఇష్టం లేదనా? లేక టెర్రరిస్టులకు భయపడి పోలింగ్‌లో పాల్గొనలేదా? ఇంతకీ ఆ ఎన్నిక చెల్లుతుందా? అసలు కాశ్మీర్ జ్వరం భారత్‌కు ఎప్పుడు వదులుతుంది?
చిరకాలంగా జాతి వ్యతిరేకుల ఇష్టారాజ్యం కారణంగా కాశ్మీర్ మానసికంగా పరాయదైపోయంది. దానికి పట్టిన విద్రోహపు చీడను వదిలించడానికి పెద్ద ఆపరేషనే చేయాల్సి ఉంది.

వృషభవాహనుడు, పుల్లేటికుర్రు
ఎయర్ ఇండియా అధికారిపై పాదరక్షలతో దాడిచేసిన ఎంపి గురించి పార్లమెంటులో నోరు మెదపకపోవడం, మోదీగారైనా స్పందించకపోవడం ప్రజలకు ఎలాంటి సంకేతాలను ఇస్తున్నది?
ఎంపీలను ఎన్నుకున్నది చెప్పుతో కొట్టించుకుంటానికని!

కోవూరు వెంకటేశ్వర ప్రసాదరావు, కందుకూరు
మంత్రానికి చింతకాయలు రాలుతాయా’ అని విమర్శిస్తూ ఏ కార్యానికైనా ఆ మంత్రం కోసం వైదిక వ్యవస్థపై ఆధారపడటం....?
హిపోక్రసీ! దానికి మనం పెట్టింది పేరు.
ఎన్. రామలక్ష్మి, సికిందరాబాద్
రాష్టప్రతిగా ప్రస్తుతమున్న ఉపరాష్టప్రతి హమీద్ అన్సారీని చేస్తే ఇబ్బందులేమైనా ఉన్నాయంటారా?
పూర్వపు కాంగ్రెసు జమానా అవశేషాలను ఎందుకు కొనసాగించాలి? యోగ్యుడైన అభ్యర్థి ఇంకెవరూ దొరకకనా?

పాన్, ఆధార్ నెంబర్లు బహిర్గతం చేస్తే అన్ని రకాల సేవలు పొందడం మాట అటుంచండి. మనం ఇతరత్రా మోసపోతామేమో?
ఔను.

పొట్టి వెంకట శివప్రసాదరావు, అద్దంకి
అయదు రాష్ట్రాలలో నాలుగింటిని కైవసం చేసుకున్న బిజెపి రాబోయే తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో రెండంకెల స్థానాన్ని సాధిస్తారా?
తెలుగుదేశం గుదిబండను వదిలించుకోగలిగితే తప్పుటడుగులు వేయకుండా జాగ్రత్తపడితే ఏకంగా అధికారానే్న అందుకోగలరు.

సీరపు మల్లేశ్వరరావు, కాశీబుగ్గ
అన్నింటికి ప్రపంచ జాతీయ దినోత్సవాలు జరుపుకొంటున్నారు. కాని వెలయాళ్ల కోసం దినోత్సవం ప్రకటించరేం?
సంవత్సరంలో 365 రోజులూ ఇప్పటికే బుక్ అయనందువల్లనేమో! వాళ్లూ దినం పెట్టదగ్గవాళ్లే.
*

ప్రశ్నలు పంపాల్సిన చిరునామా

మనలో మనం,
ఆదివారం అనుబంధం, ఆంధ్రభూమి దినపత్రిక,
36 సరోజినీదేవీ రోడ్, సికిందరాబాద్ - 500003.
: email :
sundaymag@andhrabhoomi.net