మంచి మాట

స్థాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుట్టుకరీత్యా పెద్దగా తేడాలు కనిపించకపోయినా, స్వభావరీత్యా స్ర్తి, పురుషుల మధ్యగాని ఆ మాటకొస్తే మనిషికీ, మరో మనిషికి మధ్య తేడాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తుంటాయి. తేడాలు మనిషికీ మరో మనిషికి మధ్య అడ్డుగోడలుగా వుండిపోతుంటాయి. అందుకు ప్రధాన కారణం మనిషి తనను తాను అర్థం చేసుకోలేకపోవడమే! తనలోని మేలైన ఆలోచనలతో, మెరుగైన సమన్వయ ధోరణితో దైవత్వాన్ని ఆవిష్కరించుకోలేకపోవడమే! కనిపించే అంత అమాయకత్వం ఎదుటివారిలో లేకపోయినా వినిపించే అంత పరోపకారం, మరొకటి వారి చేతల్లో కనిపించకపోయినా ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఇంటా బయటా ప్రతి ఒక్కరూ మరొకరితో ఆత్మీయంగా మసలుకునే తీరు మాత్రమే మరెందరినో చేరువ చేసేందుకు, మరెందరికో చేరువయ్యేందుకు ఉపకరిస్తుంది తప్ప ఏదో ఒక కారణంతో దూరంగా వుండే తీరు బ్రతుకు భారమయ్యేందుకే దారితీస్తుంది. అనవసర విషయాలపట్ల ఎవరికైనా ఆందోళన అవసరం. దైవప్రార్థనలు, దైవపూజలు మానవ ప్రయత్నాలకు ఊతంగా నిలుస్తాయి తప్ప గాలిలో మేడలు నిర్మించేందుకు ఉపయోగపడవన్న స్పృహ నిత్య జీవితంలో అత్యవసరమే! మనిషి స్థాయిని దిగజారిపోకుండటం మరింత అవసరం. ప్రయత్న లోపం లేకపోవడమే ఒక పని తాలూకు ఫలితానికి మొదటి అడుగుగా గుర్తించగలగాలి.
వచ్చీరాని అడుగులతో పాపాయి కిందపడి దెబ్బ తగిలినా తల్లిదండ్రులకు, ఆ ఇంట్లోని ఇతర పెద్దలకు పాపాయి నడిచేందుకు చేసే ప్రయత్నంవల్ల ఆనందం పౌందుతారే తప్ప దెబ్బ తగులుతుందన్న బాధ అంతగా వుండదు. పడుతూ లేస్తూ, లేవబోతూ పడిపోతూ క్రమంగా నడకను అలవరచుకుంటూ, వయసుతో పాటు నడకలో వేగం పెంచుకుంటూ, తోటి మిత్రులతో పరుగులో పోటీ పడుతూ మెరుపు వేగంతో పరుగెత్తడం ప్రతినిత్యం మనం చూస్తున్నదే. నడకలో వేగం పెరిగితే దానే్న పరుగులాంటి నడక అని కూడా అంటూ వుంటాం. పరుగులో వేగం పెరిగితే పెట్టేందుకు ప్రత్యేకమైన పేరు లేకపోవచ్చు గాని పరుగు కొనసాగించే వారికి మాత్రం అలసట ఆయాసం అనివార్యం! మనిషి పుట్టుక గురించి కాని, మనిషి నడక గురించి కాని, పరుగు గురించి గాని ఎవరికి తోచినట్లు వారు సవివరంగా వినిపించవచ్చు. పుట్టుకకు కారణమైన విషయాలను, నడకకు కారణమనదగిన విషయాలను పరుగెందుకన్నది కళ్లకు కట్టేలా కారణాలను వివరించవచ్చును. అంత మాత్రాన ఎదుటివారు వాటిని పట్టించుకుంటారన్నది సందేహాస్పదమే. జీవితంలో పడటం తప్పుకాదు. ఎందుకు పడిపోవలసి వచ్చిందో కారణం తెలుసుకుని అందులోంచి పాఠం నేర్చుకోలేకపోవడం తప్పు. పడిపోతున్న స్థితిలో వున్న కొందరికైనా ఆసరాగా వుండలేకపోవడం తప్పు. పెదవి విప్పితే ప్రతి చిన్న విషయానికి సవాలక్ష సాకులు చూపించగలగడం కన్నా కొన్నింటికైనా పరిష్కార మార్గాలు చూపగలిగే తీరు పదిమందికి మేలు చేస్తుంది. మరెందరికో స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. సచ్చీలతను పెంపుజేసుకోలేక, ఎదుటివారిలోని సుగుణాలను అభినందించలేక వంచనతో మంచిని పడగొట్టేందుకు విడగొట్టేందుకే పుట్టామన్నట్లు విర్రవీగేవారైనా, ఆ తరహా ధోరణులకు వంత పాడే వారైనా దురాలోచనలకు దుర్మార్గాలకు చిరునామాగా మారుతారు తప్ప జీవన మాధుర్యానికి సుదూరంగానే వుండిపోతుంటారు. ఎందరి మధ్యన వున్నా పోతపోసిన వంచనకు రూపమొచ్చినట్లు కనిపిస్తుంటారు.
చుట్టూ సమస్యలు చుట్టుముట్టినా, ఎందరు కావాలని కష్టనష్టాలు కలిగిస్తున్నా, పనిగట్టుకొని హేళన చేస్తున్నా పుట్టెడు దుఃఖం ఉబికి వస్తున్నా, వారి ఆలోచనలన్నీ పరపీడన తప్ప మరొకటి కాదని సుస్పష్టంగా తెలిసినపుడు బాధపడటం అటుంచి చేతనైనంతలో సాయమర్థించిన వారికి సాయపడటం దైవలక్షణం. రణాలు, కారణాలు స్వీయ లోపాలను తొలగించుకునేందుకు కానపుడు ఎన్ని అర్చనలు చేసినా ఎన్ని అభిషేకాలు చేసినా ఏ దైవమైనా ఎవరికైనా ఎందుకు మేలు చేస్తుంది? ఆలస్యంగానైనా ఆలోచన మొదలైతే అదే పదివేలు! లేనిది వున్నట్లు భ్రమించే వారెవరైనా ఒక స్వచ్ఛమైన చిరునవ్వు ముందు సదాశయంతో కూడిన సంకల్పం ముందు, భక్తిపూర్వకమైన భావనముందు ఏ స్థాయి గురించి ఎంతగా విర్రవీగినప్పటికి ప్రయోజనం శూన్యమని గ్రహించగలగాలి.