ఆంధ్రప్రదేశ్‌

విశాఖ మన్యాన్ని వణికిస్తోన్న చలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాడేరు, డిసెంబర్ 10: విశాఖ మన్యాన్ని చలి వణికిస్తోంది. చలిగాలుల తీవ్రతతో మన్యం వాసులు అల్లాడిపోతున్నారు. చలి ప్రభావం అధికం కావడంతో ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు నానాటికి పడిపోతున్నాయి. లంబసింగిలో గురువారం అత్యల్పంగా 6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. సముద్ర మట్టానికి 3 వేల 600 అడుగుల ఎత్తున ఉన్న మోదకొండమ్మ అమ్మవారి పాదాల వద్ద కూడా ఆరు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా పాడేరులో ఎనిమిది డిగ్రీలకు ఉష్ణోగ్రత పడిపోయింది. గత కొద్ది రోజులుగా ఈ ప్రాంతంలో 15 నుంచి 17 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా ఒకేసారి గణనీయంగా పడిపోతున్నాయి. దీని ప్రభావంతో ఏజెన్సీ అంతటా చలిగాలులు వీస్తూ ఈ ప్రాంత వాసులను హడలెత్తిస్తున్నాయి. చలిగాలులకు తోడు దట్టమైన మంచు కురుస్తుండడంతో ఉదయం పది గంటల వరకు ఎండ అనేది కానరావడం లేదు. పది గంటల తరువాత సూర్యుడు ఉదయిస్తున్నా చలి మాత్రం వీడడం లేదు. మధ్యాహ్నం పనె్నండు నుంచి మూడు గంటల మధ్యలో మాత్రమే సూర్యుని వేడిమి కనిపిస్తుండగా సాయంత్రం నాలుగు గంటల తరువాత మళ్లీ చలి ప్రారంభవౌతూ రాత్రయ్యే సరికి తీవ్రరూపం దాల్చుతోంది. దీంతో సాయంత్రమయ్యేసరికి చలి వణికిస్తుండడంతో ఈ ప్రాంత వాసులు బైటకు రావాలంటేనే భయపడాల్సి వస్తోంది. చలి ప్రభావం అధికం కావడంతో వృద్ధులు, చిన్నారుల పరిస్థితి ఆందోళనకరంగా మారుతోంది. శీతాకాలంలో డిసెంబర్, జనవరి నెలలు ఏజెన్సీ వాసులకు గడ్డు పరిస్థితిని కలిగిస్తుండడం మామూలే అయినప్పటికీ ఈ సారి వీస్తున్న చలిగాలులు మాత్రం ఈ ప్రాంతవాసులను భయపెడుతుందనే చెప్పాలి. (చిత్రం) ఉదయం తొమ్మిది గంటలకు కూడా ఇంకా మంచు తెరల్లోనే ఉన్న విశాఖ మన్యం