అవీ .. ఇవీ..

మార్గదర్శి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పిల్లలకు నడక, నడత నేర్పేది తల్లే అంటారు. ఆ నిజం పక్షులకూ వర్తిస్తుందని ఈ దృశ్యం చూసి చెప్పొచ్చు. లాంక్‌షైర్‌లోని క్వీన్స్‌పార్క్ సరస్సులో ఓ బాతు ఈదుతూ వెళుతూంటే దానివెంట క్రమశిక్షణతో వరుసగా 16 పిల్లబాతులు ఎంచక్కా అనుసరిస్తున్నాయో చూడండి. ఈ దృశ్యాన్ని కేటర్‌న్యూస్ ఫొటోగ్రాఫర్ మార్క్ క్రైమ్స్ తన కెమెరాలో బంధించాడు.
ఇదోరకం అందం
ఫ్యాషన్ ప్రపంచంలో వింతలు అన్నీఇన్నీ కావు. కొత్తకొత్త డిజైన్లతో, కొత్తతరహా దుస్తులు, అలంకరణలతో ఆకట్టుకోవడమే ఆ మోడల్స్ లక్ష్యం. ఈమధ్య జపాన్‌లో నిర్వహించిన మిస్ ఇంటర్నేషనల్ బ్యూటీ పీజెంట్‌కు 70 దేశాలనుంచి అందగత్తెలు హాజరయ్యారు. ఇదిగో ఇక్కడకు వచ్చిన అమెరికా, ఇండోనేషియా ప్రతినిధులు లిండ్స బెకర్, చింత్యా పబ్యోల వేషాలు చూడండి.
గుడ్లగూబ..గుమ్మడిపండు
ఔను...ఈ గుమ్మడిపండును చూడండి...అచ్చం గుడ్లగూబలా ఉందికదూ..నిజానికి అది పండినప్పుడు అలా లేదు. దానిని అలా మలిచాడు ఓ కళాకారుడు. అమెరికాలో ఏటా నిర్వహించే హలోవిన్ వేడుక సందర్భంగా విభిన్న ఆకృతులతో గుమ్మడికాయలను మలచడం సంప్రదాయం. న్యూయార్క్ బొటానికల్ గార్డెన్‌లో ప్రఖ్యాత పంపకిన్ కార్వర్ స్టీన్ కెల్లి ఈ గుమ్మడికాయను ఇలా తీర్చిదిద్దాడు.
వరాహమే వాహనం
సాధారణంగా పందుల్ని పెంచి తరువాత వాటిని మాంసంకోసం వధిస్తారంతా. కోళ్లు, మేకలు, గొర్రెల మాదిరిగానే వాటిని అమ్మేస్తూంటారు. చైనాలోని హెబీ ప్రావిన్స్‌కు చెందిన ఝంగ్ క్జియాన్సింగ్‌కూడా పందులపెంపకంపైనే ఆధారపడి జీవిస్తున్నాడు. కానీ ఓ పందిని మాత్రం అతడు అమ్మకానికి పెట్టలేదు. అదంటే అతగాడికి చాలా ఇష్టం. దానికి ‘బిగ్ ప్రెషియస్’ అని ముద్దుపేరుకూడా పెట్టాడు. దాదాపు 600 కిలోల బరువు పెరిగిన ఈ వరాహంపై తిరుగుతూ ముచ్చటపడుతూంటాడు. ఓ ప్రతికకు ఇంటర్వ్యూ ఇస్తూ ఇలా ఫోజుకూడా ఇచ్చాడు.

-భారతి