'క్లాప్' కొట్టు గురూ!

మరోసారి...!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు, తమిళ చిత్రాల్లో అగ్ర హీరోలందరితో ఆడిపాడిన తమన్నా మరోసారి ప్రభాస్‌తో నటించబోతోందిట. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘రెబల్’, ‘బాహుబలి’ ప్రేక్షకులకు కనువిందు చేసిన విషయం తెలిసిందే. వీరిద్దరు తాజాగా నటించిన ‘బాహుబలి’ ఎంతటి విజయాన్ని నమోదు చేసుకుందో తెలిసిందే. ప్రభాస్ తాజాగా నటిస్తున్న చిత్రం ‘సాహూ’. యువి క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సుజిత్ దర్శకుడు. ఈ మధ్యనే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదలయింది. ‘బాహుబలి-2’ చిత్రం థియేటర్లలో ఈ టీజర్‌ని ప్రత్యేకంగా ప్రదర్శిస్తున్నారు. ప్రభాస్ న్యూలుక్, స్టైలిష్ మేకింగ్, డైలాగ్ అన్నీ అభిమానులకే కాదు, ప్రేక్షకులకూ తెగ నచ్చేశాయి. 2018 ప్రథమార్థంలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఇప్పటి వరకూ ఈ చిత్రంలో నటించబోయే హీరోయిన్ ఎవరన్నది సస్పెన్స్‌గానే ఉంచారు. ఈ పాత్ర కోసం బాలీవుడ్ నటిని ఎంపిక చేయనున్నట్లు మొదట్లో వార్తలొచ్చాయి. చివరకు ఆ పాత్రకు దక్షిణాది నటితోనే సరిపెట్టుకున్నారట. ఆ అవకాశం తమన్నాకే దక్కడం వల్ల ఈ సినిమాపై మరింత క్రేజ్ ఏర్పడుతుందని సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఈ చిత్రం గనక విజయం సాధిస్తే వీరి కాంబినేషన్ హ్యాట్రిక్ కొట్టినట్టే అని చెప్పుకుంటున్నారు. మరోసారి ఈ జంట ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతినిస్తుందో చూడాల్సిందే మరి!!

-సమీర్