సబ్ ఫీచర్

పండుగల్లో పడతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనిషి మరో మనిషి గురించి తెలుసుకోవడం ఆసక్తిదాయకం. ఇది మానవనైజం. మనిషి సంఘజీవి. అయినా విలక్షణజీవి. నలుగురిలో ఉంటూనే తనదైన ప్రత్యేకత కలిగి ఉండడమనేది మనిషి సహజ లక్షణం. ఇందులో మహిళలు మరింత ముందుంటారు. ప్రతి మహిళ ఒక ప్రత్యేకమైన అరుదైన భావాలు కలిగిన మహిళగా ఉండాలనే కోరుకుంటుంది.
పండుగైనా పబ్బమైనా స్ర్తి ఉంటేనే అది ఆనందకేళివిలాసాలకు చిహ్నంగా మారుతుంది. అందుకే మన పెద్దలు ప్రకృతిని కూడా స్ర్తిగానే భావించారు. ఇది వసంత మాసం. పచ్చని చీరకట్టి ఎరుపుకలసిన పచ్చల జాకెట్టు శృంగారించుకొంటుంది ప్రకృతి రమణి. చెట్లన్నీ పచ్చని ఆకులతో కళకళలాడుతుంటాయి.
మామిడే కాదు ప్రతి మొక్క కొత్తచిగుళ్లు వేస్తుంది. మల్లెల గుబాళింపులు ఇపుడే ఆరంభమవుతాయి. వసంతుడు తన చెరకు విల్లును సవరించుకొనేంతలోనే కోయిలమ్మలు మృదుమధరగానాలు చేస్తుంటాయి. వేపపూవు కమ్మని వాసనతో వసంతుని ఆహ్వానగీతిక పలుకుతుంది. వేప, మామిడి రుచుల మేళవింపుకు మల్లెల సౌరభం తాకి మరింత రసభూయిష్టవౌతుంది.
ఈ రసాస్వాదన మునుముందుగా స్ర్తినే చేస్తుంది. ఆమె పొద్దుపొద్దునే్న ఇల్లువాకిళ్లు శుభ్రంచేసి మామిడితోరణాలను, బంతిచామంతుల తోరణాలను గుమ్మాలకు కట్టి , గుమ్మాలకు పసుపురాసి బొట్టు పెట్టి పూజచేసి తాను అభ్యంగన స్నానమాచరించి ఇంటిల్లిపాది కి స్నానసంధ్యల కోసం శ్రమిస్తుంది. ‘ఉ’ అంటే ఉత్తమమైన ‘గం’ అంటే జ్ఞానం. ‘ఉగం’ అంటే ఉత్తమమైన జ్ఞానం. ‘ఉగము’ ఆదిగా గలది ‘ఉగాది’. ఉగాది అంటే జన్మాది. ‘జననో జన జన్మాదిః భీమో భీమ పరాక్రమః’ అన్నది విష్ణు సహస్రనామం. కనుక జన్మాది శ్రీ మహావిష్ణువు. కనుక ఉగాది అంటే పరమాత్మ. ఆ పరమాత్మను పూజిస్తుంది. కాలస్వరూపుడైన సూర్యుని నమస్కారం చేస్తుంది. షడ్రుచుల సమ్మేళనంతో ఉగాది పచ్చడిని చేసి దేవునికి నివేదన చేసి అందరికీ పంచుతుంది. అపుడు ఆ స్ర్తి ఉగాదికి ప్రతీకగా నిలుస్తుంది.
మాసములలో మొదటిది చైత్రము. పక్షములలో మొదటిది శుక్లపక్షం. తిథులలో మొదటిది పాడ్యమి, వసంత ఋతువులో చైత్రమాసంలో శుక్లపక్షంలో సూర్యోదయానికి పాడ్యమి వున్న తిథి రోజున, సంవత్సరం ఆరంభం అవుతుంది అని పండితులు నిర్ణయించారు. ఆ రోజు ‘ఉగాది’ పండుగలోని విశేషార్థమును సూచించే పంచాంగ శ్రవణానికి అందరినీ సమాయత్తం చేస్తుంది. పంచాంగ శ్రవణం సంవత్సరఫలాలను చూపెడుతుంది. స్ర్తి తన కుటుంబ చిత్రాన్ని అందంగాను, ఆనందంగా మార్చడానికి తన వ్యయాలను లాభాలను ఈరోజు అంచనావేసుకొంటుంది. ఆ అంచనాల అంచుల్లో నడుస్తూ విజయకేతనాన్ని ఎగురవేస్తుంది. ఈ విలంబి నామ సంవత్సరం ఏ విలంబం లేకుండా సాఫీగా సాగాలని కోరుతూ

-గౌరి