మహబూబ్‌నగర్

కలెక్టరేట్ కోసం తెరపైకి కొత్త భవనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వనపర్తి,అక్టోబర్4: కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా వనపర్తిలో ఏర్పాటు చేయనున్న కలెక్టరేట్‌కు రోజుకో కొత్త భవనం పేరు వినిపిస్తున్నది. తాజాగా మంగళవారం వనపర్తి ఆర్‌అండ్‌బి ఇఇ కార్యాలయాన్ని కలెక్టరేట్ కోసం అప్పగించాలని కలెక్టర్ శ్రీదేవి నుండి ఆదేశాలు వచ్చినట్లు ఆర్‌అండ్‌బి అధికారులు తెలిపారు. గత శనివారం రాజాభవనాన్ని కలెక్టర్ కార్యాలయం కోసం అప్పగించాలని పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్‌కు ఆదేశాలు వచ్చాయి. తాజాగా ఆర్‌అండ్‌బి అధికారులకు ఆదేశాలు రావడంతో తేర పైకి ఆర్‌అండ్‌బి ఇఇ కార్యాలయం వచ్చింది. ముహుర్తం ముంచుకోస్తుండగా దసరా నుండే కొత్త జిల్లాలో కార్యకాలపాలు మొదలు పెట్టాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికి ఇప్పటి ఆనేక భవనాలు సందిగ్ధంలోనే ఉన్నాయి.
జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని మున్సిపల్ భవనంలో ఏర్పాటు చేయాలని, ఎస్పి క్యాంపు ఆఫీస్ ఐబి అతిథి గృహంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. ప్రధాన కార్యాలయమైన కలెక్టరేట్ కార్యాలయం మొదటి నుండి రాజాభవనంలో ఏర్పాటు చేస్తారని ప్రచారం జరిగినప్పటికి ఇటీవలే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ విద్యాలయాలను ప్రభుత్వ కార్యాలయాలకు తీసుకోరాదని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయడంతో కార్యాలయం కోసం ఇతర భవనాలను అధికారులు ఆనే్వషిస్తున్నారు. కొన్ని రోజులు మిషన్ కంపౌండ్‌లో ఏర్పాటు చేస్తారని, ఆర్డీఓ కార్యాలయంలోనే ఏర్పాటు చేస్తారని ప్రచారం జరిగినప్పటికి ఇటీవల పాలిటెక్నిక్ కళాశాలను అప్పగించాలని కలెక్టర్ నుండి ఆదేశాలు రావడంతో రాజాభవనంలోనే ఏర్పాటు చేస్తారని అందరూ భావించారు. కొత్తగా ఆర్‌అండ్‌బి ఇఇ కార్యాలయాన్ని అప్పగించాలని ఆదేశాలు వచ్చాయ.