మహబూబ్‌నగర్

చోరీ కేసులో ముగ్గురు దొంగల అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్‌టౌన్, అక్టోబర్ 9: మహబూబ్‌నగర్ పట్టణంలో ఈ నెల 3వ తేదీ రోజు రాత్రి జరిగిన దొంగతనం కేసుకు సంబందించి దోపిడికి పాల్పడిన దొంగలను ఆదివారం రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా రూరల్‌పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిఐ రామకృష్ణ మాట్లాడుతూ పట్టణంలోని పాన్ చౌరస్తాలోని బాసిద్ జ్యూవేలరీ షాపులో ప్రవిణ్ అగర్వాల్ అనే యువకుడు పనిముగింపుకుని ఆటోలో పాన్ చౌరస్తా నుండి ఎనుగొండ వరకు బయలుదేరారు. ఆటో డ్రైవర్ మల్లేష్ అతని అనుచరులు రామకృష్ణ, స్వామిలు సూర్యలక్ష్మి కాటన్‌మిల్లు దగ్గర ఆటోను దారిమళ్లించి పొదల్లోకి తీసుకెళ్లి ప్రవిణ్ అగర్వాల్‌ను చితకబాదారు. అతని వద్ద ఉన్న రూ.35 వేల నగదు. బంగారు గొలుసుతో పాటు సెల్‌పోన్‌ను లాక్కుని పరారయ్యారు. బాధితుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని ధర్యాప్తు జరిపిన పోలీసులు పట్టణంలో సంచరిస్తున్న పాత నేరస్తులపై నిఘా ఉంచి వారిని అదుపులోకి తీసుకుని ఆరా తీయగా తామే ఈ దొంగతనానికి పాల్పడినట్లు తెలిపారని సిఐ పెర్కొన్నారు. పట్టుకున్న దొంగల నుండి ఐదు వేల నగదు, బంగాఱు గొలుసు, సెల్‌పోన్ స్వాదీనం చేసుకున్నామని పట్టుకున్న ముగ్గురిని కోర్టులో హాజరుపరుస్తున్నామని తెలిపారు. విలేకరుల సమావేశంలో ఎస్సై గడ్డం కాశి తదితరులు పాల్గొన్నారు.