మహబూబ్‌నగర్

క్రీడలకు చేయూతనిస్తున్న ప్రభుత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, అక్టోబర్ 29: క్రీడాకారులను మరింత ప్రొత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం చేయూతనందిస్తుందని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. శనివారం టెబుల్ టెన్సిస్ రాష్ట్ర స్థాయి చాంపియన్ షిప్ పోటీలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఈ ప్రాంతంలోని విద్యార్థులు, యువతలో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికితీసేందుకు క్రీడలకు ప్రభుత్వం సహకారం అందిస్తుందన్నారు. ప్రతి జిల్లా కేంద్రంలో క్రీడా మైదానంను ఏర్పాటు చేయడంతో పాటు మండల కేంద్రాల్లో సైతం మినీ స్టేడియాలు నిర్మిస్తున్నామని దింతో గ్రామీణ స్థాయిలో కూడా క్రీడాకారులను వెలికితీస్తున్నామన్నారు. గతంలో తెలంగాణలో గ్రామీణ స్థాయి నుం డి వచ్చే క్రీడాకారులు తక్కువగా ఉండేవారని కానీ స్వరాష్ట్రం ఏర్పడ్డాక ఈ రెండున్నర సంవత్సరాల్లో ప్రతిజిల్లాలో పదుల సంఖ్యలో క్రీడాకారుల ప్రతిభను గుర్తించడం జరిగిందన్నారు. మహబూబ్‌నగర్ పట్టణంలో క్రీడాభివృద్ది కోసం మరో స్టేడియంను తయారు చేస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లలను క్రీడలవైపు మళ్లించాలని చదువుతో పాటు క్రీడలు కూడా ఎంతో అవసరమని తెలిపారు. క్రికెట్ ఒక్కటే క్రీడ కాదని అన్ని క్రీడలపై విద్యార్థులు దృష్టి పెట్టి ఎదో ఒకటి రెండు వాటిల్లో రాణించేలా కృషి చేస్తే మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. టెబుల్ టెన్సిస్ ఆడాలంటే ఎంతో నైపుణ్యం అవసరమని శ్రద్దతో కూడిన ఆట అని అన్నారు. హైదరాబాద్‌కు చెందిన 16 ఏళ్ల నైనాజస్వాల్ ప్రస్తుతం ఇక్కడ జరుగుతున్న టెబుల్ టెన్సిస్‌లో పాల్గొంటున్నారని ఈ క్రీడాకారిణి విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఎనిమిదేళ్ల వయస్సులోనే పదో తరగతి పూర్తి చేసి పదేళ్ల వయస్సులో ఇంటర్ పూర్తి చేసి పదమూడేళ్ల వయస్సులో జర్నలిజం పూర్తి చేసి ప్రస్తుతం పిహెచ్‌డి కోసం ప్రయత్నిస్తుందన్నారు. పదేళ్ల వయస్సు నుండే టెబుల్ టెన్సిస్‌పై దృష్టి పెట్టి దాదాపు 17 దేశాల్లో భారతదేశం తరపున ఆడి 15 గోల్డ్ మెడల్స్, 17 సిల్వర్ మెడల్స్ సాధించిందన్నారు. ముఖ్యంగా అమ్మాయిలు క్రీడలపై దృష్టి పెడితే ప్రపంచ స్థాయిలో ఎదిగే అవకాశం ఉంటుందన్నారు. ఈ సందర్భంగా సమావేశంలో టెబుల్ టెన్సిస్ అంతర్జాతీయ క్రీడాకారిణి నైనాజస్వాల్ మాట్లాడుతూ చైనాలో టెబుల్ టెన్సిస్ క్రీడకు అత్యంత ప్రాముఖ్యత ఉందని అయితే తాను ఒలంపిక్‌లో రాణించి భారతదేశం తరపున టెబుల్ టెన్సిస్‌లో గెలుపొంది దేశానికి పేరు తీసుకురావాలన్నదే తమ తాపత్రయమని వెల్లడించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు టెబుల్ టెన్సిస్‌ను ఇంకా ప్రొత్సహిస్తే తనలాంటి క్రీడాకారులు దేశం తరపున ఆడి మరిన్ని బంగారు పథకాలు సాధించి భారతదేశ గౌరవాన్ని పతకా స్థాయికి తీసుకెళ్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్ నటరాజ్, నగేష్, నరసింహరెడ్డి, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

పెండింగ్ వద్దు త్వరితగతిన పూర్తిచేయాలి
పాన్‌గల్, అక్టోబర్29: కెఎల్‌ఐ, భీమా పెండింగ్ కాల్వలను ఎండింగ్‌చేసి త్వరితగతిన పూర్తి చేసి రైతాంగానికి సాగునీరు అందించాలని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతి రాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శనివారం మండ ల పరిధిలోని కల్వరాల, పుల్గర్‌చర్ల గ్రామాలలో కె ఎల్ ఐ, భీమా ఫెస్-1,2 కాల్వలను వనపర్తి జిల్లా కలెక్టర్ శే్వతా మహంతితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కెఎల్‌ఐ కాల్వను భీమా ఫెస్-1,2కు అనుసందానం చేయాలన్నారు. శ్రీరంగాపూర్ రిజర్వాయర్ నుండి గోపల్‌దినె్న రిజర్వాయర్‌కు కాల్వలను త్రవ్వి సాగునీరు అందించాలన్నారు. పెండింగ్ కాల్వలను ఫిబ్రవరి వరకు పూర్తి చేసి రైతాంగానికి సాగునీరు అందించాలని అన్నా రు. సకాలంలో కాల్వలు పూర్తి చేయకపోవడంతో చివరి అయకట్టు వరకు సాగునీరు పారడం లేదన్నారు. ఆర్డీఓ రాంచందర్, మార్కెట్ కమిటి ఛైర్మన్ రాంచంద్రారెడ్డి, ఎంపిపి వెంకటేష్ నాయుడు, జడ్పిటిసి రవి, విండో ఛైర్మన్, వైస్ ఛైర్మన్ బాల్‌రెడ్డి, భాస్కర్ యాదవ్, సుదర్శన్ రెడ్డి, నారాయణ రెడ్డి, కృష్ణాప్రసాద్, రవిందర్ రెడ్డి, ఉమాపతి, తదితరులు ఉన్నారు.

నిర్లక్ష్యం దెబ్బ
చిన్నచింతకుంట, అక్టోబర్29: పురిటి నొప్పులతో ప్రభుత్వ దవఖానకు వచ్చి సుఖ ప్రసవం అవుతుందని ఆశించిన ఓ గర్భీణీ మహిళా ఆశయాన్ని వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా 9 మాసాలు మోసిన మగ శిశువు కాన్పు తరువాత మృతి చెందడంపై బిజెపి నేతలు, బంధువులు ఆగ్రహించి ప్రభుత్వ దవఖానకు తాళం వేసి ఆసుపత్రిలోనే ధర్నా చేపట్టిన సమాచారాన్ని తెలుసుకున్న జిల్లా వైద్యాధికారి శ్రీనివాసులు హుటాహుటిన చిన్నచింతకుంటలోని ప్రభుత్వ దవఖానకు చేరుకొని ధర్నా చేపడుతున్న ఆందోళనకారుల వద్దకు వచ్చి పలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బిజెపి నేతలు, స్థానిక మహిళలు డిఎం అండ్ హెచ్ ఓ దృష్టికి పలు సమస్యలను తీసుకొచ్చారు. రెగ్యూలర్ వైద్యులు లేకపోవడంతో సుదుర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు మెరుగైన వైద్య సేవలు అందక ప్రయివేట్ దవఖానలను ఆశ్రయించి జేబులను ఖాళీ చేసుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా గర్భీణీ మహిళలకు సరైన వైద్యం అందక తమ శిశువులు మృతి చెందిన సంఘటనలు ఎన్నో ఉన్నాయని దవఖానకు వచ్చిన రోగులకు సరైన వైద్యం అందించడంలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఇట్టి సిబ్బంది వ్యవహర శైలిపై జిల్లా వైద్యాధికారులకు పిర్యాదు చేసిన పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత మధర్స్‌డే రోజున ప్రభుత్వ ఆసుపత్రి మెట్లపైనే గర్భీణీ మహిళా ప్రసవించిన పట్టించుకున్న నాథుడే కరువయ్యారని ఇంత జరుగుతున్నా వైద్య సిబ్బందిలో మార్పు రాలేదని డిఎం అండ్ హెచ్ ఓ ముందు గోడును వెలబోసుకున్నారు. ఇది స్పందిస్తూ వారం రోజులలో డిప్యూటేషన్‌ను రద్దు చేసి రెగ్యూలర్ వైద్యులను నియమిస్తామని హామి ఇచ్చిన ఆందోళనకారులు ససెమిరా అనడంతో ఎంత నచ్చజెప్పిన వినకపోవడంతో అక్కడికక్కడే రెగ్యూలర్ వైద్యుల నియామకంపై ఉత్తర్వులు జారీ చేస్తున్నట్లు గతంలో డిప్యూటేషన్‌పై వెళ్లిన వైద్యురాలు సంధ్యరాణి, దేవరకరద్ర మండలం పెరూరు పిహెచ్‌సిలో వైద్యులుగా పని చేస్తున్న తిలక్‌ను రెగ్యూలర్ వైద్యులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అదే విధంగా డిప్యూటేషన్‌పై నలుగురు ఏఎన్‌ఎంలు వెళ్లడంతో వారి డిప్యూటేషన్‌ను రద్దు చేసి త్వరలో విధుల్లో చేరేటట్లు ఉత్తర్వులను జారీ చేశారు. శుక్రవారం మగ శిశువు మృతి కారణమైన స్టాప్ నర్సును సుమిత్రను ఇక్కడి నుండి బదిలీ చేస్తున్నట్లు ఆందోళనకారులు తెలిపారు. దీంతో ఆందోళనకారులు తమ ఆందోళనను విరమించారు. అనంతరం వైద్య సిబ్బందితో జిల్లా వైద్యాధికారి మాట్లాడుతూ రోగులపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవని, ఎవ్వరైన విధుల పట్ల అలసత్వంగా వ్యవహరించి విధులకు డుమ్మా కొడితే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వ దవఖానలో కాన్పుల సంఖ్యను పెంచేందుకు ఆపరేషన్ థియోటర్‌ను ప్రారంభిస్తున్నామని ఇక నుంచి ప్రభుత్వ దవఖానలోనే ఆపరేషన్లు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం డాక్టర్ సంధ్యరాణి, తిలక్‌లు విధుల్లో చేరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఫోగ్రామ్ ఆఫీసర్లు డాక్టర్లు రజిని, శ్రీ్ధర్‌రెడ్డి, రవిచందర్, కృష్ణయ్య, తహశీల్ధార్ సిందూజ, ఎస్ ఐ సతీష్, బిజెపి నేతలు, మహిళలు పాల్గొన్నారు.

అజాగ్రత్త వద్దు
వనపర్తి, అక్టోబర్29: జిల్లాల పునర్ విభజన అనంతరం వనపర్తి జిల్లాలో తొలిసారిగా జరుపుకుంటున్న దీపావళి పండుగను ప్రతి ఒక్కరు కులమతాలకు అతీతంగా ఆనందంగా జరుపుకోవాలని ఎస్పీ రోహిణి ప్రియదర్శిని అన్నారు. శనివారం ఆమె విలేఖరులతో మాట్లాడుతూ జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలను తెలిపారు. దీపావళి పండుగను ప్రధానంగా టాపాసులు పేల్చే క్రమంలో ఏమాత్రం ఆజాగ్రతగా వ్యవహరించిన ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. బాణాసంచా కాల్చే వేళల్లో అందరూ కాటన్ దుస్తులు ధరించాలని, చిన్నారుల వద్ద పెద్దలు తప్పనిసరిగా ఉండి ప్రహారీ లోపలి భాగంలో టాపాసులు కాల్చకుండా పోగ, వాసన లాంటివి పీల్చకుండా మాస్కులు ధరించి జాగ్రతలు పాటించాలని సూచించారు. ప్రమాదకర వస్తువులను, పేలుడు పదార్థలను, టాపాసులను పిల్లలకు దూరంగా ఉంచాలని, సగం కాలిన టపాసులను చేతితో పట్టుకోరాదని అవి పేలే ప్రమాదం ఉందని అలాంటి వాటిని తక్షణమే నీళ్లు చల్లి ఆర్పాలని ఆమె సూచించారు. బాణాసంచా పేల్చే సమయంలో పిల్లలపై పెద్దలు ప్రత్యేక దృష్టి సారించి ప్రమాద సంఘటనలు జరగకుండా జాగ్రత వహించి సంతోషంగా పండుగను జరుపుకోవాలని ఆమె కోరారు.

...ఏమైందమ్మా
బొంరాస్‌పేట, అక్టోబర్ 29: దీపావళి వారి జీవితాల్లో చీకట్లను నింపింది... పండుగ పూట వారి కుటుంబాల్లో కారుచీకట్లు కమ్ముకున్నాయి... అల్లారుముద్దుగా పెంచుకున్న చిన్నారులు విగత జీవులుగా పడివున్న దృశ్యాన్ని చూసి తల్లిదండ్రుల గుండెపగిలింది...అదే విధంగా పెళ్లయిన కొన్నాళ్లకే ముద్దూముచ్చట తీరకుండానే ఏడాది పాపను వదిలేసి అనంతలోకాలకు వెళ్లిపోయిన ఆ తల్లిని చూసి అభం శుభం తెలియని ఆ పాప గుక్కపట్టి ఏడ్వడం చూసిన చూపరుల కళ్లు చెమగిల్లాయి... మహబూ బ్‌నగర్ జిల్లా బొంరాస్‌పేట మండలం లగచెర్లలో జరిగిన ఈ సంఘటన దీపావళి వెలుగుల స్థానంలో కారు చీకట్లను మిగిల్చింది. బొంరాస్‌పేట ఎస్సై హన్మప్ప కథనం ప్రకారం సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. లగచెర్ల గ్రామానికి చెందిన వాగడ్డ భార్గవి (28) శనివారం చెరువు వద్దకు బట్టలు ఉతికేందుకు వెళ్లింది. శనివారం పాఠశాలకు సెలవుకావడంతో ఆమె బావ కొడుకు వాగడ్డ సంపత్‌కుమార్ (11)తో పాటు సంపత్ స్నేహితుడు సందీప్‌గౌడ్ (11) చెరువు దగ్గరకు వెళ్లారు. భార్గవి బట్టలు ఉతికే పనిలో నిమగ్నం కాగా సంపత్, సందీప్ చెరువులోకి దిగి ఆడుకోసాగారు. అలా ఆడుకుంటూనే లోపలికి వెళ్లి ఈత రాక నీట మునుగుతూ కేకలు వేయడాన్ని గమనించిన భార్గవి పక్కనే ఉన్న చెట్టుకు చీర కట్టి దాని సాయంతో పిల్లలను కాపాడేందుకు చెరువులోకి దిగింది. పిల్లలు ఇద్దరూ చనిపోతామన్న భయంతో భార్గవిని ఒక్కసారిగా గట్టిగా పట్టుకోవడంతో పిల్లలను బయటకు తీసుకురాకపోగా ఈత రాని భార్గవి కూడా నీట మునిగింది. చెరువు అవతలి ఒడ్డున ఉన్న ఆంగోత్ సుశీల అనే మహిళ ముగ్గురు వ్యక్తులు నీట మునగడాన్ని గమనించి పరుగెత్తుకుంటూ వెళ్లి గ్రామస్థులకు సమాచారం ఇవ్వడంతో గ్రామ ప్రజలు అంతా చెరువు దగ్గరకు చేరుకునేలోగా ముగ్గురూ మృతిచెందారు. కాగా భార్గవికి ఏడాది క్రితమే పాప పుట్టింది.
ఒక్కడే సంతానం...
చెరువులో పడి మృతి చెందిన వాగడ్డ సంపత్‌కూమార్, సందీప్‌గౌడ్ తల్లిదండ్రులకు ఒక్కరే సంతా నం... ఉన్న ఒక్కగానొక్క సంతానమైన తమ పిల్లలు చనిపోవడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. ఒక్కడే కొడుకు అయినందున ఎంతో ప్రేమగా పెంచామని, ఇలా తమను మధ్యలోనే వదిలేసి వెళ్లిపోతారని అనుకోలేదంటూ కన్నీరు మున్నీరుగా విలపించడం చూపరులకు కంటతడి పెట్టించింది.
మరణంలోను నీవెంటే...
సంపత్‌కూమార్, సందీప్‌గౌడ్ ఇద్దరూ ప్రాణ స్నేహితులు... వారిద్దరూ మండల పరిధిలోని దుద్యాల ప్రభుత్వ పాఠశాలలో ఆరవ తరగతి చదువుతున్నారు. ప్రతిరోజు లగచెర్ల నుండి దుద్యాలకు కలిసే వెళ్లేవారు... పాఠశాల అయిపోగానే రాత్రి దాకా కలిసి చదువుకోవడం, ఆట పాటల్లో కలిసి ఉండేవారు చివరికి చనిపోయే సమయంలోనూ మరణంలోనూ నీవేంటే అన్నట్లుగా కలిసే చనిపోయారని, తమను మాత్రం ఒంటరి వాళ్లను చేసి వెళ్లిపోయారంటూ తల్లిదండ్రులు గుండెలు అవిసేలా రోదిస్తున్నారు. ఒకేరోజు గ్రామానికి చెందిన ముగ్గురు చనిపోవడంతో లగచెర్ల గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సంఘటన స్థలాన్ని కొడంగల్ సిఐ శ్రీనివాస్‌రెడ్డి పరిశీలించారు. గ్రామ రెవెన్యూ అధికారి రవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై హన్మప్ప తెలిపారు.

బిసిల సంక్షేమానికి నిధులు కేటాయించాలి
షాద్‌నగర్ రూరల్, అక్టోబర్ 29: బిసిల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులను కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని దక్షణ రంగారెడ్డి జిల్లా బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు మద్దూరి అశోక్‌గౌడ్ అన్నారు. శనివారం పట్టణంలోని ఆర్ ఆండ్ బి అతిధి గృహంలో విలేఖరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ బిసి సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయించేందు కు కృషి చేయాలని అన్నారు. కల్యాణ లక్ష్మీ పథకం బిసిలకు అమలు కావ డం లేదని, అది అమలయ్యే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. అర్హులైన బిసిలందరికి మూడు ఎకరాల ప్రభుత్వ భూమి ఇచ్చేందుకు కృషి చేయాలని అన్నారు. ఉపకార వేతనాలు చెల్లించకపోతే ప్రభు త్వ కార్యాలయాలు ముట్టడించేందుకు బిసి సంఘం నేతలు సిద్దంగా ఉన్నారని హెచ్చరించారు. వసతి గృహాల్లో కాస్మోటిక్ చార్జీలు వెయ్యి రూపాయల నుండి మూడు వేలకు పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తే నేటి వరకు సరైన సమాదానం చెప్పకపోవడం విడ్డూరంగా ఉందని అన్నా రు. బిసి కార్పోరేషన్ నిధులు మంజూరు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. జైళ్లలో ఉన్న నేరగాళ్లకు సైతం నెలకు 1800రూపాయలు ఖర్చు చేస్తున్నారు..కానీ విద్యార్థులకు నెలకు మూడు వేల రూపాయలు ఖర్చు చేసేందుకు ప్రభుత్వం ముందుకు రాలేని పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యారంగ సమస్యలపై ప్రభుత్వ కార్యాలయాలు ముట్టడించేందుకు బిసి సంఘం అన్ని విధాల సిద్దంగా ఉందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో బిసి సంఘం నాయకులు రాములుగౌడ్, ఆంజనేయులు, పాండు, నరేష్, శివ తదితరులు పాల్గొన్నారు.

కస్తూర్బా పాఠశాలలకై దరఖాస్తుల ఆహ్వానం
దామరగిద్ద, అక్టోబర్ 29: కస్ధూర్భా గాంధీ గురుకుల పాఠశాలలో తాత్కాలిక ఉద్యోగాల నియామకాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఎంఇఓ ప్రభాకర్, కెజిబివి ప్రిన్సిపల్ స్వాతి శనివారం విలేఖరుల సమాశేశంలో తెలిపారు. ఈ పాఠశాలలో కంప్యూటర్ ఇన్స్‌ట్రక్టర్, భౌతికశాస్త్ర గేస్ టీచర్, క్రాఫ్ట్ పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని అన్నారు. కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్‌కు డిగ్రీతో పాటు పిజిడిసిఏ, ఐటిఐ, బిఎస్సీ, బికాం కంప్యూటర్స్ వారికి ప్రాధాన్యత ఉంటుందని అన్నా రు. భౌతికశాస్త్ర గేస్ టీచర్ కోరకు బిఈడి పూర్తి చేసి ఉండాలని అన్నారు. క్రాప్ట్ టీచింగ్‌కు కనీసం ఎస్ ఎస్‌సితో పాటు ఐటిఐ, ఇతర డిప్లామాలు ఉన్న వారు అర్హులని తెలిపారు. ఈ ఫోస్టులకు 18 నుండి 39 సంవత్సరాలలోపు వారు దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. నవంబర్ 1 వరకు దరఖాస్తులు చేసుకోవాలని వారు తెలిపారు. ఎంపిక అయిన వారికి 10 నెలల పాటు రూ.5వేల వేతనంతో పని చేయాలని వారు తెలిపారు.

పూడ్చిన శవానికి శవ పంచనామ
బొంరాస్‌పేట, అక్టోబర్ 29: మహిళ మృతి చెందిన విషయంలో కుటుం బ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తూ శనివారం పోలిసులకు ఫిర్యాదు చేయడంతో నాలుగు రోజుల క్రితం చనిపోయిన పుల్లమ్మ (25) శవానికి శవ పంచనామ నిర్వహించారు. ఎస్సై హన్మప్ప కథనం ప్రకారం మెట్లకుంట గ్రామానికి చెందిన పుల్లమ్మను కుల్కచెర్ల గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహం జరిపించారు. కాగా నాలుగేళ్ల క్రితం భర్త మృతి చెందడంతో పుల్లమ్మ మెట్లకుంటకు తిరిగివచ్చి తన అక్క దగ్గర ఉంటోంది. అదే గ్రామానికి చెందిన కొడిగంటి శేఖర్‌తో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఈ నెల 26న శేఖర్ పుల్లమ్మను చెరువు దగ్గరకు తీసుకువెళ్లి తనతో ఉండకుండా మరోకరితో సంబంధం పెట్టుకుంటావా అంటూ పుల్లమ్మను కోట్టడంతో పుల్లమ్మ మృతి చెందినట్లు పోలిసులకు ఇచ్చిన ఫిర్యాదులో కుటుం బ సభ్యులు పేర్కోన్నారు. కొడంగల్ సిఐ శ్రీనివాస్‌రెడ్డి, తహశీల్దార్ వెంకటయ్యలు శవ పంచనామను పర్యవేక్షించారు. డాక్టర్ ఇచ్చిన నివేధిక ఆధారంగా కేసు నమోదు చేయనున్నట్లు ఎస్సై హన్నప్ప తెలిపారు.

ప్రతి ఎకరాకు సాగునీరు పారిస్తాం
వీపనగండ్ల, అక్టోబర్29: భీమా, కెఎల్‌ఐ, జూరాల కాల్వల నుండి చెరువులు, కుంటలు నింపి రైతాంగానికి ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని రాష్ట్ర పంచాయతి రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శనివారం మండల కేం ద్రంతో పాటు వివిధ గ్రామాల్లో కాల్వలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ ప్రతి ఎకరాకు రైతాంగానికి సాగునీరు అందించేందుకు సిఎం కెసిఆర్ కృషి చేస్తున్నారన్నారు. తెలంగాణ ప్రాంతంలోని రైతులకు పుష్కలంగా సాగునీరు అందించడమే ప్రభుత్వ ద్యేయమని, వచ్చే ఖరీఫ్ నాటికి చివరి అయకట్టు వరకు సాగునీరు అందిస్తామని ఆయన తెలిపారు. ప్రజా, రైతు సంక్షేమం కోసం టిఆర్‌ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందని, ప్రతిపక్ష పార్టీ ల నేతలు ఉనికి కాపాడుకోవడం కోసం టిఆర్‌ఎస్ నేతలపై, ప్రభుత్వంపై అనవసర ఆరోపణలు చేస్తున్నారన్నారు. సకాలంలో పెండింగ్ కాల్వలను పూర్తి చేసి రైతాంగానికి సాగునీరు అందిస్తామన్నారు. మం త్రి వెంట వనపర్తి జిల్లా కలెక్టర్ శే్వతా మహంతి, మార్కెట్ కమిటి ఛైర్మన్ రాంచంద్రారెడ్డి, పాన్‌గల్ ఎంపిపి వెంకటేష్, జడ్పిటిసి రవికుమార్, విండో ఛైర్మన్ బాల్‌రెడ్డి, వైస్ ఛైర్మన్ భాస్కర్ యాదవ్, మాజీ జడ్పిటిసి కృష్ణా ప్రసాద్, నాయకులు సుదర్శన్ రెడ్డి, రవిందర్‌రెడ్డి, నారాయణ రెడ్డి, ఎత్తం కృష్ణయ్య పాల్గొన్నారు.

ఎన్ని అడ్డంకులు ఎదురైనా రిజర్వాయర్ నిర్మిస్తాం
హన్వాడ, అక్టోబర్ 29: ఎన్ని అడ్డంకులు ఎదురైన హేమసముద్రం రిజర్వాయర్‌ను నిర్మించి తీరుతామని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. శనివారం హన్వాడ మండల సర్వసభ్య సమావేశం ఎంపిపి విజయలక్ష్మీ అధ్యక్షతన కొనసాగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హజరైన ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ హేమసముద్రం నిర్మిస్తేనే ఈ ప్రాంత ప్రజలకు, రైతాంగానికి కృష్ణాజలాలు వస్తాయని అప్పుడే రైతుల పొలాలు పచ్చని పంటలతో కలకలలాడుతాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యతను ఇస్తుందని వ్యవసాయం బాగుండాలంటే సాగునీరు ఎంతో అవసరమని తెలిపారు. అందుకే ప్రభుత్వం పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందని తెలంగాణ రాష్ట్రం వచ్చాక ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ఈ ప్రాజెక్టుపై దృష్టి కేంద్రికరించారన్నారు. అందులో భాగంగానే హేమసముద్రం రిజర్వాయర్ నిర్మించబోతున్నామని వెల్లడించారు. అభివృద్దే ధ్యేయంగా పని చేస్తున్నామని తెలిపారు. హన్వాడ మండలానికి జిల్లాలోనే అత్యధిక నిధులు తీసుకువచ్చానని ముఖ్యంగా రైతులకు లో ఓల్టేజి సమస్య తీర్చేందుకు ప్రతి గ్రామానికి ఐదారు ట్రాన్స్‌ఫార్మర్లు ఇచ్చామని తెలిపారు. అంతేకాకుండా మండలంలో అధికారులు చిత్తశుద్దితో పని చేయాలని అప్పుడే ప్రజల మన్ననలు పొందుతారన్నారు. మంచి పని చేసిన అధికారి బదిలీ అయితే ఆయా మండలాల ప్రజలు బాధపడుతారని తెలిపా రు. ప్రతి చెరువులో చేపపిల్లలను వదలాలని దళారుల దందాకు స్వస్తి పలికి నిజమైన మత్స్యకారులకు ప్రభుత్వం చేయూతనందించడానికి రాష్ట్ర ప్రభుత్వం వందశాతం సబ్సిడీతో చేపపిల్లలను పం పిణీ చేస్తుందన్నారు. ఎంపిడిఓ, తహశీల్దార్, వివిధ మండల శాఖ అధికారులతో పాటు సర్పంచులు, ఎంపిటిసిలు నిరంతరం ప్రజాసేవలో నిమగ్నమై ఉంటే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందన్నారు. రూ.20కోట్లతో వేపూర్ నుండి హన్వాడకు బిటిరోడ్డు నిర్మాణం త్వరలోనే ప్రారంభిస్తామని ఎమ్మెల్యే వెల్లడించారు. నియోజకవర్గంలో బిసి రేసిడెన్షియల్ పాఠశాలను హన్వాడ మండల కేంద్రంలోనే ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కాగా మండల సమావేశంలో వివిధ శాఖల పనితీరు, వివిధ సమస్యల పట్ల సుదీర్ఘంగా చర్చ జరిగింది. ఈ సమావేశంలో మండల పరిషత్ ఉపాధ్యక్షుడు దస్తయ్య, ఎంపిడి, తహశీల్దార్ విజయలక్ష్మీ, సర్పంచులు కృష్ణయ్యగౌడ్ పాల్గొన్నారు.

యువత అభివృద్ధికి ప్రభుత్వం కృషి
దేవరకద్ర, అక్టోబర్ 29: తెలంగాణ ప్రాంతంలోని యువత అభివృద్దికి ప్రభుత్వం లబ్దిపొందేవిధంగా ఎస్సీ కార్పోరేషన్ కృషి చేస్తుందని రాష్ట్ర ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ పిడమర్తి రవి అన్నారు. శనివారం దేవరకద్ర పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అర్‌అండ్‌బి అతిథి గృహానికి ర్యాలీగా వెళ్లారు. అక్కడ ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హజరయ్యారు. గతంలో ఏ ప్రభు త్వం చేయని విధంగా తెలంగాణ ప్రభుత్వం దళితుల కు కోట్లాది రుపాయల నిధులు మంజూరు చేసి ఆదుకుంటుందని అన్నారు. 9వేల ఎకరాలకు రూ.382 కోట్లు ఖర్చుపెట్టి భూపంపిణీ చేసిందని అన్నారు. 17వేల మంది యువతకు రూ.127కోట్లతో రుణాలు మంజూరు చేయడం జరిగిందన్నారు. రుణాల పంపిణీలో 60శాతం నుండి 80శాతం 2016-17లో 90 శాతం సబ్సిడికి ముఖ్యమంత్రి కెసి ఆర్ సుముఖంగా ఉన్నారన్నారు. ఇప్పటి వరకు రూ.150కోట్ల రుణాలు ఇవ్వడం జరిగిందన్నారు. 20 వేల మందికి యువతకు రూ.200కోట్లు వచ్చే నెలలో పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఈ విలేఖరుల సమావేశంలో నాయకులు రాయకంట రాందాస్, విజయ్‌మోహన్, అశోక్, వెంకటరాములు, శ్రీనివాసులు పాల్గొన్నారు.

తెలంగాణను భ్రష్టుపట్టిస్తున్న కేసిఆర్
షాద్‌నగర్, అక్టోబర్ 29: రాష్ట్రాన్ని అన్ని విధాల భ్రష్టుపట్టించిన ఘనత ముఖ్యమంత్రి కెసిఆర్‌కే దక్కిందని రంగారెడ్డి జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బొక్క నర్సింహ్మరెడ్డి ఆరోపించారు. శనివారం షాద్‌నగర్ బిజెపి కార్యాలయంలో విలేఖరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈసంధర్భంగా ఆయ న మాట్లాడుతూ బంగారు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పా టు చేస్తానని చెప్పి భ్రష్టుపట్టించారని ఆరోపించారు. డబుల్‌బెడ్ రూం ఇళ్లను నిర్మించి ఇస్తామని చెప్పి రెం డున్నర ఏళ్లు గడుస్తున్నా నేటి వరకు ఎక్కడ ప్రారంభించిన దాఖలాలు లేవని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే లక్ష 30వేల ఉద్యోగులు ఇస్తామని చెప్పి నేడు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని ఆరోపించారు. కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేస్తామని చెప్పి నేటి వరకు వారి గురించి పట్టించుకునే నాధుడే లేకుండా పోయాడని ఆవేదన వ్యక్తం చేశారు. దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తామని చెప్పిన సిఎం కెసిఆర్ నేటి వరకు ఎక్కడ కూడా సక్రమంగా పంపిణీ చేసిన ఘనత లేదని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి 93వేల ఇళ్లకు కేంద్ర ప్రభుత్వం అడ్కో ద్వారా నిధులు మం జూరు చేస్తే వాటిని వినియోగించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తొందని పేర్కొన్నారు. వేలకోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి మంజూరు చేస్తుంటే వినియోగించడలో మాత్రం నిర్లక్ష్యిం వహిస్తొందని అన్నారు.