మహబూబ్‌నగర్

విద్యుదాఘాత బాధితులకు నేతల పరామర్శ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గద్వాల, నవంబర్ 4: జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండల పరిధిలోని ఆలూరు గ్రామంలో శుక్రవారం విద్యుదాఘాతానికి గురై కారం ఈరన్న (35), ఉరుకుందు (36), బుడ్డన్న (45) అనే రైతులు అక్కడికక్కడే మృతి చెందగా నలుగురు రైతులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పెద్దనర్సింహులు అనే రైతు పరిస్థితి తీవ్రంగా ఉందని తెలుసుకొని టిఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, గద్వాల ఎంపిపి సుభాన్‌లు ప్రభుత్వ ఆస్పత్రిలో వారిని పరామర్శించారు. మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా రూ.3లక్షల నష్టపరిహారం అందజేస్తుందని వారు తెలిపారు. రైతులు మృతి చెందిన సంఘటన రాష్ట్ర పంచాయితీరాజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుకు, విద్యుత్ అధికారులకు సమాచారం అందజేసినట్లు వారు తెలిపారు. విద్యుదాఘాతానికి గురైన కుటుంబాలను ప్రభుత్వం అన్నివిధాల ఆదుకుంటుందని వారన్నారు. సంఘటన స్థలాన్ని మాజీ ఎమ్మెల్యే భరతసింహారెడ్డి, నాయకులు గడ్డంకృష్ణారెడ్డిలు పరిశీలించి మృతుల కుటుంబాలను పరామర్శించారు.
రూ.10లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి: గద్వాల ఎమ్మెల్యే డికె అరుణ
విద్యుదాఘాతానికి గురైన ఆలూరు గ్రామ రైతులకు ప్రభుత్వం వెంటనే రూ.10లక్షల ఎక్స్‌గ్రేషియాను చెల్లించి వారి కుటుంబాలను ఆదుకోవాలని మాజీ మంత్రి, గద్వాల ఎమ్మెల్యే డికె అరుణ డిమాండ్ చేశారు. అలాగే విద్యుదాఘాతానికి గురై చికిత్స పొందుతున్న కుటుంబాలను కూడ ప్రభుత్వమే ఆదుకోవాలని ఆమె కోరారు. జరిగిన సంఘటనపై ఉన్నతాధికారులు ఆరా తీసి చర్యలు చేపట్టాలన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉన్నతాధికారులు తగు చర్యలు చేపట్టాలని ఆమె కోరారు. ట్రాన్స్‌ఫార్మర్‌ను అమర్చే ప్రాంతంలో విద్యుత్ అధికారులు లేకపోవడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకుందిన ఆమె అన్నారు.