మహబూబ్‌నగర్

కెసిఆర్ పెద్ద మోసకారి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, నవంబర్ 5: కెసిఆర్ పెద్దమోసకారి అని, ఆయన మాటలు నమ్మి అధికారాన్ని కట్టబెట్టిన ప్రజలను దగా చేశారంటూ పసిసి ఉపాధ్యక్షురాలు, గద్వాల కాంగ్రెస్ ఎమ్మెల్యే, డికె అరుణ ధ్వజమెత్తారు. శనివారం కొల్లాపూర్‌లో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యార్థి గర్జనకు ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బంగారు తెలంగాణలో విద్యార్థులు బాధపడుతున్నారని, ముఖ్యమంత్రి మాత్రం తన కుటుంబం హాయిగా ఉంటే చాలనుకుంటున్నారని విమర్శించారు. కెసిఆర్ అంటే మోసకారి అని, మోసాలు చేయాలనుకున్నవారు ఆయన చెంతకు చేరి రాజకీయాలు చేస్తే చాలని ముందుగా మోసం ఎలా చేయాలనే విధానాన్ని నేర్పుతారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు రాక ఇబ్బందులు పడుతుంటే ముఖ్యమంత్రి మాత్రం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడానికి ప్రభుత్వ కార్యాలయాలు కూల్చి తాను విలాసవంతమైన భవనాల్లో ఉండాలని చూస్తున్నారని మండిపడ్డారు. పిచ్చోడి చేతిలో రాయి ఉంటే ఎలా ఉంటుందో రాష్ట్రంలో సైతం కెసిఆర్ చేతిలో ఓ రాయి అనే అధికారం ఉందని, ఆ రాయి ఎటువిసురుతారో ప్రజలకు తెలియకుండా పోయిందని డికె అరుణ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఇస్తే నష్టం జరుగుతుందని తెలిసి కూడా సోనియాగాంధీ రాష్ట్రం ఇచ్చి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చారని కానీ కెసిఆర్ ముఖ్యమంత్రి అయ్యాక మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణను అప్పుల ఊబిలోకి నె డుతున్నారని ఆరోపించారు. విద్యార్థులు, రైతులు ముఖ్యమంత్రి కెసిఆర్‌కు వ్యతిరేకంగా రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తే తప్పా ఆయన దిగిరారని అన్నారు. విద్యార్థుల శక్తి ఏమిటో కెసిఆర్‌కు బాగా తెలుసని ఆశక్తిని కెసిఆర్‌పై ప్రదర్శిస్తే బకాయి ఉన్న పీజు రీయింబర్స్‌మెంట్ వస్తుందని అన్నారు. విద్యార్థుల కోసం కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఇంటిని కూడా ముట్టడించేందుకు సిద్ధంగా ఉన్నామని, సిఎం స్పందించకుంటే లక్షలాది మంది విద్యార్థులతో కలిసి సిఎం ఇంటిని ముట్టడిస్తామని ఆమె హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చిన్నారెడ్డి, ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ, కొల్లాపూర్ కాంగ్రెస్ ఇన్‌చార్జి హర్షవర్ధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

బహిర్భూమి మరవాలి
ఆంధ్రభూమి బ్యూరో
మహబూబ్‌నగర్, నవంబర్ 5: మరుగుదోడ్ల అవశ్యకత గురించి జిల్లా ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైన ఉందని, పాలమూరు జిల్లాను 2017 అక్టోబర్ 2 గాంధీజయంతి నాటికి బహిరంగ మలవిసర్జనరహిత జిల్లాగా చేయాలని మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్ సంబందిత అధికారులకు సూచించారు. శనివారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన బహిరంగ మలవిసర్జనపై తహశీల్దార్లు, ఎంపిడి ఓలు, స్పెషల్ ఆపీసర్లతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో కేవలం 11శాతం మాత్రమే మరుగుదోడ్లు ఉన్నందున, దానిని 100శాతానికి పెంచడానికి తహశీల్దార్లు, ఎంపిడి ఓలు, స్పెషల్ ఆఫీసర్లు ప్రణాళికలు సిద్దం చేసుకుని, ప్రతి గ్రామంలో క్షేత్రస్థాయిలో పర్యటించి మరుగుదొడ్లు లేని కుటుంబాలను గుర్తించి గ్రామంలోని ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. 2017 మార్చి నాటికి ప్రతి మండలంలో మూడు గ్రామ పంచాయతీలను ఎంపిక చేసి ఆ గ్రామ పంచాయతీలో 100శాతం మరుగుదోడ్లు నిర్మించి వారికి అవగాహన కల్పించి వాడే విధంగా చూడాలన్నారు. దేశంలోని చత్తీస్‌గడ్ రాష్ట్రంలో నూటికి నూరుశాతం బహిరంగ మలవిసర్జన రహిత రాష్ట్రంగా నమోదు అయ్యిందని, మన జిల్లా ఆర్థికంగా, అక్షరాస్యతలో ముందంజలో ఉందని మలవిసర్జన రహిత కార్యక్రమాన్ని సులభతరంగా నివారించడవచ్చని ఆయన అన్నారు. దేశంలోనే పాలమూరు జిల్లా 7.43శాతం మాత్రమే బహిరంగ మలవిసర్జన రహిత జిల్లాగా గుర్తింపు పొందిందని అన్నారు. అందికారులందరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని బహిరంగ మలవిసర్జన నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు తెలిపారు. గ్రామంలో నివసించే ప్రతి కుటుంబానికి ఒకటి నుండి రెండు మొబైళ్లు వినియోగిస్తున్నారు. అదేవిధంగా కెబుల్ కలెక్షన్ అధికంగా వాడుతున్నారని కానీ మరుగుదోడ్లను మాత్రం ఉపయోగించడం లేదని అన్నారు. ప్రతి గ్రామంలో ఆర్గనైజేషన్ కమిటీ ఏర్పాటు చేసుకుని దిని ద్వారా అన్ని పనులు జరిగే విధంగా చూడాలని టాయిలేట్లు కట్టుకున్న ప్రతి కుటుంబానికి వచ్చే డబ్బులు అర్గనైజింగ్ కమిటీ ద్వారా పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. ప్రజలకు మరింత అవగాహన కల్పించడానికి గ్రామాల్లో ప్రజలు ఎక్కడైతే బహిర్భుమికి వెళ్లే స్థలాలను గుర్తించి నేరుగా అక్కడికే వెళ్లి అవగాహన కల్పిస్తే మరి మంచిదని కలెక్టర్ అన్నారు. దింతో సమావేశానికి వచ్చిన అధికారులంతా గల్లున నవ్వారు. కలెక్టర్ సిరియస్ చేబుతున్నానని ఈ ప్రయోగం చేయాలంటూ సూచించారు. ప్రజల్లో తప్పకుండా మార్పు వస్తుందని ముఖ్యంగా మహిళల ఆత్మగౌరవానికి సంబందించిన అంశం కాబట్టి ఆయా కుటుంబాల్లో అవగాహన వచ్చి తక్షణమే ప్రభుత్వ సహయం లేకుండానే మరుగుదోడ్లు కట్టుకునే అవకాశం ఉంటుందన్నారు. గ్రామంలో పాఠశాలల విద్యార్థులతో ప్రతి ఇంటికి మరుగుదోడ్డి అనే నినాదంతో ఊరేగింపు నిర్వహించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో జెసి శివకుమార్‌నాయుడు, ట్రైనీ కలెక్టర్ గౌతమ్, స్వచ్చ్భారత్ డైరెక్టర్ రాంమోహన్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

చేతకాకపోతే మానుకోండి
కల్వకుర్తి,నవంబర్ 5: పేద విద్యార్థులకు,ప్రజలకు వైద్య సేవలు అందించడం చేతకాక పోతే మానుకోవాలని , తీరు మార్చుకోకపోతే చర్యలు తప్పవని వైద్య సిబ్బందిపై డిఎంహెచ్‌ఓ సుధాకర్‌లాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం పట్టణ ఏరియా ప్రభుత్వ అసుపత్రిని డిఎంహెచ్‌ఓ ఆకస్మీకంగా తనిఖీ చేసి రికార్డులు, పరికరాలను పరిశీలించి వైద్యులు తీరుమార్చుకోవాలని లేని యెడల సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు. అనంతరం పట్టణంలోని గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థులు అనారోగ్యంతో ప్రభుత్వ ఆసుపత్రికి విద్యార్థులు రావడంతో అశ్రమ పాఠశాలలోని విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులను తెలుసుకునేందుకు పాఠశాలకు వెళ్లి పాఠశాలలో ఎఎన్‌ఎం, వైద్యాధికారి పర్యవేక్షణ హజరు రిజిష్టర్‌లలో సంతకాలు లేక పోవడం, పాఠశాల విద్యార్థులకు వాతావరణం, వివిధ కారణాలతో వచ్చే రోగాల గుర్చి అవగాహన కల్పించాలని సిబ్బందిపై తీవ్ర స్థాయిలో మండిపడి,తీరు మార్చుకోవాలని క్లస్టర్ ఇన్‌చార్జి శ్రీను పై ప్రశ్నల వర్షం కురిపించారు. పాఠశాలకు వచ్చిపోతే సరిపోదూ పేద విద్యార్థులకు వైద్య సేవలందించాలి. జీతాలు తీసుకోవడం కాదు బాద్యతగా పనిచేసి ప్రజలకు నమ్మకం కల్గించాలని సూచించారు. అందుబాటులో ఉండటమే కాకుండా సిబ్బంది పని తీరుపై క్షేత్ర స్థాయిలో ఎప్పటికప్పుడు వెళ్లి పరిశీలించి వైద్యశాఖ పనితీరును మెరుగుపర్చాలన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యం చేసే సిబ్బందిపై సస్పెండ్ చేస్తానని మందలించారు.మరోసారి వచ్చే వరకు వైద్యుల తీరు మెరుగు పడాలని సూచించారు.ఈ కార్యక్రమంలో డాక్టర్లు శివరాం, రమ్య, సిబ్బంది, గిరిజన ఆశ్రమ పాఠశాల ప్రిన్సిపల్ తిరుపతయ్య తదితరులు ఉన్నారు.

జిల్లా సాధన కోసం గర్జించిన విద్యార్థులు
నారాయణపేటటౌన్, నవంబర్ 5: నారాయణపేట జిల్లా సాధన కోసం శనివారం విద్యార్థులు పెద్ద ఎత్తున గర్జించారు. ఉదయం డివిజన్ కేంద్రంలోని అన్నీ పాఠశాలలను బహిష్కరించిన విద్యార్థి సంఘాలు స్థానిక సిటిజన్స్‌క్లబ్ నుండి పట్టణ పురవీధుల గుండా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో జై నారాయణపేట జిల్లా, అన్నీ అర్హతలు ఉన్న నారాయణపేటను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసి తీరాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేస్తూ స్థానిక తెలంగాణ చౌరస్తాకు చేరుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా సాధన సమితి కన్వీనర్ డాక్టర్ మనోహర్‌గౌడ్, అఖిలపక్ష నేతలు నాగూరావు నామాజీ, రతంగ్‌పాండురెడ్డి, వామన్‌గారి కృష్ణ, కె.ఓంప్రకాశ్, కాశీనాథ్, విద్యార్థి సంఘాల నేతలు పళ్ల రఘు, గోపికృష్ణ తదితరులు మాట్లాడుతూ నారాయణపేట జిల్లా సాధన కోసం ఈ ప్రాంత ప్రజలు ఉద్యమాలు చేస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. నారాయణపేట జిల్లా కోసం సాగుతున్న ఉద్యమాన్ని అణచివేసేందుకు ప్రభు త్వం కుట్రలు పన్నడం తగదన్నారు. నారాయణపేట జిల్లా కోసం జిల్లా సాధన సమితి, అఖిలపక్ష నేతలతో చర్చించిన మంత్రి, ఎంపి, ఎమ్మెల్యేలు ముఖం చాటేసి జిల్లా కేంద్రంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి జిల్లాల పునర్విభజన ప్రక్రియ పూర్తయిందని ప్రకటించడం ఈ ప్రాంత ప్రజలను మోసం చేయడమేనన్నారు. నారాయణపేట జిల్లా సాధన కోసం తీవ్రమైన ఉద్యమాన్ని ప్రస్తుతం ఎవరూ అణచివేయలేరని, నారాయణపేట జిల్లాను సాధించే వరకు ఉద్యమం కొనసాగిస్తామన్నారు. నారాయణపేట జిల్లా కోసం ఆదివారం నుండి ఐదు రోజుల పాటు నిరవధికంగా తలపెట్టిన బంద్‌ను జయప్రదం చేసేందుకు ప్రతి ఒక్కరు స్వచ్చందంగా తరలిరావాలని కోరారు.
నేటి నుండి నిరవధిక బంద్
నారాయణపేట జిల్లా సాధన కోసం నేటి నుండి ఐదు రోజుల పాటు నిరవధిక బంద్ తలపెట్టినట్లు జిల్లాసాధన సమితి ప్రకటించింది. ఆదివారం నుండి తలపెట్టిన బంద్‌లో అన్నీ వర్గాలు స్వచ్చంధంగా పాల్గొనాలని, ఈ బంద్‌కు ఇప్పటికే అన్నీ రంగాల్లోని కార్మికులు మద్దతు తెలిపిన విషయాన్ని ప్రకటించారు. ఆర్టీసీ కార్మికులు శనివారం రాత్రికే డివిజన్ కేంద్రానికి చేరుకుని బస్సులను నిలిపివేయనుండగా సోమవారం నుండి ప్రభుత్వ కార్యాలయాలను సైతం బంద్ చేయించాలని ప్రణాళిక రూపొందించడం జరిగిందన్నారు. ఇందుకు సంబందించి ఇప్పటికే డివిజన్ కేంద్రంలోని అన్నీ ప్రభుత్వ కార్యాలయాలకు సమాచారం అందించి ఉద్యోగుల మద్దతు కూడగట్టుకోవడం జరిగిందన్నారు. నారాయణపేట డివిజన్ నిరవధిక బంద్‌ను జయప్రదం చేసి ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షను ప్రభుత్వానికి తెలియజేసి జిల్లాను సాధించుకుందామని జిల్లా సాధన సమితి సభ్యులు కోరారు.

స్వర్ణకాంతులతో కాంచనగుహ
చిన్నచింతకుంట, నవంబర్5: పల్లెప్రజల ఆరాధ్యదైవంగా విరాజిల్లుతూ భక్తుల కొంగుబంగారంగా కొలువ బడుతున్న శ్రీకురుమూర్తి స్వామి బ్రహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. బ్రహోత్సవాల్లో భాగంగా శనివారం అలంకరోత్సవం వైభవంగా కొనసాగింది. సంస్థానాదీశులైన ముక్కెరవంశీయులు చేయించిన బంగారు అభరణాలను ఆత్మకూరులోని ఎస్‌బిహెచ్ బ్యాంకులో ప్రత్యేక లాకర్‌లో భద్రపరిచారు. అక్కడ ప్రతి ఏటా అలంకరోత్సవం రోజున ప్రత్యేక పూజలు నిర్వహించి అభరణాలను తీసుకోస్తారు. ఈ ఏటా బ్యాంకులోని స్వామి వారి అభరణాలకు గాడివంశీయులు ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడి నుండి ఉరేగింపుగా కొత్తపల్లి గ్రామానికి రాగానే గ్రామంలోని మహిళలు, భక్తులు భారీగా ఘనస్వాగతం పలికారు. అక్కడి నుండి ఉరేగింపుగా దుప్పల్లి గ్రామానికి రాగానే భజాభజంత్రిలతో ఉరేగింపు కొనసాగింది. అక్కడ రామాలయంలో పూజలు నిర్వహించిన అనంతరం స్వామి వారి అభరణాలను సంస్థానాదీశులైన ముక్కెరవంశీయులు రాజాతోంభూపాల్ స్వగృహానికి అభరణాలను చేర్చారు. అనావాయితిలో భాగంగా అక్కడ ఆలయ ఆర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజలో ఎమ్మెల్యే అల వెంకటేశ్వర్ రెడ్డి, రాజారాంభూపాల్, మాజీ ఎమ్మెల్యే సీతమ్మ, దయాకర్‌రెడ్డి, స్వర్ణమ్మ, కాంగ్రెస్ పార్టీ నాయకులు పవన్‌కుమార్ రెడ్డి, డిసిసిడి ఛైర్మన్ వీరారెడ్డి, తహశీల్ధార్ సింధూజ, ఎంపిడి ఓ విరోజ, కొత్తకోట, చిన్నచింతకుంట, దేవరకరద్ర ఎంపిపిలు గుంత వౌనిక, క్రాంతి, గోపాల్, ఇఓ గురురాజా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడి నుండి ఆర్చకులు స్వామి అభరణాలను తలపై ఉంచుకొని కాలినడకన గ్రామంలో నడుచుకుంటూ భజాభజంత్రిలు, కోలాటాలతో అడుగడుగునా పూలవర్షంతో గోవింద నామస్మరణంతో ఉరేగింపు కొనసాగింది. అక్కడి నుండి ఉరేగింపుగా స్వామి వారి దిగువ కొండకు చేరుకోగానే అభరణాలను స్వామి వారి సన్నిధికి తీసుకెళ్లారు. అక్కడ ప్రధాన ఆలయంలో ఆలయ ఇ ఓ, తహశీల్ధార్, భక్తుల సమక్షంలో అభరణాలను ఒక్కొక్కటిగా లేక్కించి ఆలయ ఆర్చకులకు అప్పజెప్పారు. ఆర్చకులు ముక్కెరవంశీయులు చేయించిన అభరణాలు అయిన రత్నాలు పొదిగిన కిరీటాలు, వజ్రపు రాళ్లు, పట్టలు పొదిగిన మొలగజ్జెలు, హస్తాలు, శంఖు చక్రాలు, భుజకిరీటాలు, మకర కుండలాలు, కొరా మీసాలు, బంగారు అభరణాలను స్వామి వారికి అలంకరించడంతో కురుమూర్తి స్వామి సువర్ణ పుషితుడై భక్తులకు దర్శనమిచ్చారు. బంగారు అభరణాలను అలంకరించిన స్వామి కాంచన గుహ స్వర్ణకాంతులతో విరజిల్లుతుంది. అనంతరం స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా బారులు తీరి కురుమూర్తి స్వామిని దర్శించుకొని పుణితులయ్యారు.

రైతు సంక్షేమానికి పెద్దపీట
కల్వకుర్తి, నవంబర్ 5: రైతు సంక్షేమానికి పెద్దపీట వేయడంతోపాటు రైతు,మహిళ రైతులకు, వ్యాపారస్థులకు వౌళిక సదుపాయాలు కల్పించడమే పాలకమండలి లక్ష్యమని కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్ చైర్ పర్సన్ విజితారెడ్డి అన్నారు. శనివారం పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మార్కెట్ చైర్ పర్సన్ విజితారెడ్డి మాట్లాడుతూ దాన్యం కొనుగోలు,కమీషన్ ఎజెంట్లు,రైస్ మిల్లర్లు,తదితర వ్యాపారస్థులతో పలు అంశాలపై సమావేశాలు నిర్వహించుకొని వారి సమస్యలను, సూచనలు తెలుసుకోవడం జరిగిందన్నారు. వారు తెలిపిన పలు అంశాలను వ్యవసాయ మార్కెట్ పాలక మండలి జనరల్ బాడి సమావేశం ఏర్పాటు చేసుకొని పలు తీర్మాణాలను ఏక గ్రీవంగా అమోదించుకోవడం జరిగిందని అమె పేర్కొన్నారు. ఏకగ్రీవంగా అమోదించిన తీర్మాణాలు మార్కెట్ కార్యాలయానికి కంపౌడ్ వాల్,కమీషన్ కూరగాయాల విక్రయ కేంద్రం వద్ద మినీ వాటర్ ట్యాంక్ నిర్మాణంతో పాటు కమీషన్ ఎజెంట్ల,దాన్యం కొనుగోలు ఎజెంట్లకు నూతనంగా 16 నూతన దుకాణాల నిర్మాణం,కొత్త మార్కెట్ కార్యాలయ నిర్మాణంతో పాటు రైతులకు క్యాంటీన్ ఏర్పాటు,మహిళ రైతు విశ్రాంతి భవనం,తాగునీటి కోసం రెండు కొత్త బోర్లు, వ్యాపారస్థులు దాన్యాన్ని నిల్వ ఉంచేందుకు ప్లాంట్‌ఫాంలు, డ్రయల్ మిషన్లు దశాల వారిగా ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయడంతోపాటు వీటిని మంజూరు చేయించుకోవడం జరుగుతుందని అమె పేర్కొన్నారు. ఈ విలేఖరుల సమావేశంలో మార్కెట్ వైస్ చైర్మన్ జైపాల్, సిగింల్ విండో చైర్మన్ భూపాల్‌రెడ్డి,డైరెక్టర్లు నర్సింహ్మరెడ్డి, శ్రీనివాస్, రవీందర్‌యాదవ్,వీరారెడ్డి,సుధాకర్,సురేందర్‌రెడ్డి,బాలస్వామి,తదితరులు ఉన్నారు.

విద్యాప్రమాణాలను పెంచాలి
నాగర్‌కర్నూల్, నవంబర్ 5: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలకు ఆధునిక వౌళిక వసతులను కల్పిస్తున్నామని వాటిని సక్రమంగా వినియోగించుకొని విద్యా ప్రమాణాలను పెంపొందించాలని రాష్ట్ర డిగ్రీ కళాశాలల కమీషనర్ వాణి ప్రసాద్ పిలుపునిచ్చారు. శనివారం స్థానిక తహశీల్ కార్యాలయంలో డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాల్స్‌తో నిర్వహించిన వీడియో కాన్పరెన్స్‌లో ఆమె మాట్లాడగా, జిల్లా పరిధిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాల్స్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నా రు. వీరినుద్దేశించి వాణి ప్రసాద్ మాట్లాడుతూ జిల్లా వనరుల కేంద్రంను జిల్లాలనే పురాతనమైన కళాశాలైన పాలెం డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేస్తున్నామని, ఈ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డిఎస్‌ఆర్ రాజేందర్‌సింగ్ చైర్మన్‌గా, జిల్లా పరిధిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ల ప్రిన్సిపాల్స్ సభ్యులుగా వ్యవహరిస్తారని తెలిపారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలలో వౌళిక వసతు లు, సిబిసిఎస్ పరీక్షా విధానం, బడ్జెట్ వినియోగం, న్యాక్ గుర్తిం పు, నూతన భవనాలువంటి అం శాలపై చర్చించారు. జిల్లా పరిధిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాల్స్ పాల్గొన్నారు.

గ్రామగ్రామాన ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం
కొడంగల్, నవంబర్ 5: జిల్లాల పునర్విభజనలో భాగంగా కొడంగల్ మండలాన్ని వికారాబాద్ జిల్లాలో కలపడాన్ని నిరసిస్తూ ఆందోళనను కొనసాగిస్తామని అఖిలపక్షం నాయకులు అన్నారు. గత 20 రోజులుగా కొడంగల్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఆంధోళనలు, దీక్షలు చేపట్టిన ప్రభుత్వం కానీ, ప్రజాప్రతినిధులు కానీ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. దీక్ష శిబిరాన్ని పోలీసులు అడ్డుకుని అంతరాయం కల్పించ, దీక్ష చేయకుండా అడ్డుతగిలారన్నారు. శుక్రవారం రాత్రి దీక్షలను విరమించి శనివారం నుండి మండలంలోని గ్రామగ్రామానికి తిరిగి ఉద్యమాన్ని ఉదృతం చేసి ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. కొడంగల్ మండలాన్ని వికారాబాద్‌లో కలిపితే జరిగే లాభనష్టాలు, యదావిధిగా మండలాన్ని మహబూబ్‌నగర్ జిల్లాలో ఉంచితే జరిగే లాభనష్టాలను ప్రజలకు వివరించడం జరుగుతుందని తెలిపారు. ఉద్యమాలు ఇంతటితో ఆగక సమస్య పరిష్కారం అయ్యే వరకు ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు. అంతకుముందు కొడంగల్ పట్టణంలో అఖిలపక్షం ఆద్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్షం నాయకులు బషిర్, చంద్రప్ప, సురేష్‌కుమార్, శాంతకుమార్, కేశవులు తదితరులు పాల్గొన్నారు.

రాష్టస్థ్రాయి క్రీడల నిర్వహణకై ప్రయత్నిస్తా
మక్తల్, నవంబర్ 5: రాబోయే రోజుల్లో మక్తల్ ప్రజలు, ఈప్రాంత క్రీడాకారులు అన్ని విదాల పూర్తిస్థాయి సహాయ సహకారాలు అందిస్తే రాష్టస్థ్రాయి క్రీడల నిర్వాహణకై తనవంతు కృషి చేస్తానని, క్రీడాకారులకు శిక్షణ ఇచ్చే సమయంలో ముఖ్యంగా గుర్తింపు పొందిన క్రీడలపై వారికి సంబంధిత పిఇటిలు, కోచు లు శిక్షణ ఇవ్వాలని, గ్రామీణ ప్రాంత క్రీడాకారులలో ఆణిముత్యాలాంటి క్రీడాకారులు ఉన్నారని, అలాంటి వారిని గుర్తించి వెలికి తీయవలసిన బాధ్యత ఆయా పాఠశాలల ఉపాధ్యాయులపై, స్థానిక సీనియర్ క్రీడాకారుపై ఎంతో ఉందని జిల్లా క్రీడల అభివృద్ధి అధికారిణి సత్యవాణి అన్నారు. శనివారం మండల కేంద్రంలోని మక్తల్ పట్టణంలోగల మిని స్టేడియం మైదానం లో విజేత స్పోర్ట్స్ అసోషియేషన్ వారి ఆధ్వర్యంలో మండల స్థాయి బాల బాలికల కబడ్డి, వాలీబాల్ పోటీలను సత్యవాణి మేడమ్ క్రీడల పథకావిష్కరణ గావించి క్రీలను ప్రారంభించారు. గ్రామీణ ప్రాంత క్రీడాకారులలో ఎంతో క్రీడానైపుణ్యం దాగి ఉందని అలాంటి వారిని గుర్తించి వారికి క్రీడల్లో చక్కటి తర్పీదును ఇచ్చి మంచి క్రీడాకారులుగా తయారు చేయవలసిన బాధ్యత పిఇటిలపై ఎంతో ఉందని అన్నారు.

అధికారుల కళ్లు తెరిపించిన మక్తల్ యువత
మక్తల్, నవంబర్ 5: సంగంబండ గ్రామానికి వెళ్లే రహదారిపై విపరీతంగా దుమ్ముదూళితో విద్యార్థులు నరకయాతన అనుభవిస్తున్నా ఎవరు కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. గత వారం రోజుల క్రితం మక్తల్ పట్టణానికి చెందిన అఖిలపక్ష యువకులు ఒకటిగా కలసి వారి వాట్సప్ గ్రూపుతో సంబంధిత గ్రామపంచాయి సర్పంచ్‌ను, ఇఓను, సిబ్బందిని రోడ్డుపై ఉన్న మట్టిని తొలగించాలని వందల మెస్సేజ్‌లు పంపారు. స్పందించిన మండల వైస్ ఎంపిపి సునితా గోపాల్‌రెడ్డి అట్టి రోడ్డుపు ఉన్న మట్టి అణిగేందుకై ట్రాక్టర్లతో నీటిని పోయడం జరిగింది. అయినా గ్రామపంచాయతి వారు మాత్రం గోడకున్న సున్నంలా స్పందించకపోవడంతో శనివారం మక్తల్ యువ అభివృద్ధి కమిటి సర్పంచ్‌ను కలసి వినతి పత్రాన్ని ఇవ్వడంతో వారిలో కొంత చలనం వచ్చిందని ఆయువకులు తెలియచేస్తున్నారు. వెంటనే వారి సిబ్బందితో వచ్చి రోడ్డుపై ఉన్న మట్టిని పూర్తిగా తొలగిస్తుండటగా అఖిలపక్ష యువత సైతం అందుకు పూర్తిస్థాయి సహకారాన్ని అందించడం జరిగింది.

రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలకు శిరీష
దేవరకద్ర, నవంబర్ 5: దేవరకద్ర మండల పరిధిలోని కోయిల్‌సాగర్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న శిరీష రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రదానోపాద్యాయుడు ప్రసన్నకుమార్ తెలిపారు. గత నెలలో జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలు నారాయణపేటలో నిర్వహించగా శిరీష విజేతగా నిలిచి రాష్టస్థ్రాయికి ఎంపికైన్నట్లు ప్రదానోపాద్యాయుడు ప్రసన్నకుమార్ తెలిపారు.

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
ధన్వాడ, నవంబర్ 5: పంటలకోసం చేసిన అప్పులు తీర్చలేక క్రిమిసంహరక మందుసేవించి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా ధన్వాడ మండలంలోని గున్‌ముక్ల గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. మరికల్ సిఐ సోమనాథం కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ధన్వాడ మండలంలోని గున్‌ముక్ల గ్రామానికి చెందిన శ్రీరాములు (39) అనే రైతు తన పోలంలో కంది, ఆముధం పంటలను సాగుచేయడం జరిగింది. పంటలకోసం దాదాపు రూ.3లక్షలకుపైగా అప్పులు చేయడం జరిగిందన్నారు. పంటలు చేతీకిరాకపోవడంతో చేసిన అప్పులు తీర్చలేక, శుక్రవారం తన ఇంటిలో నిద్రిస్తున్న సమయంలో ఇంటిలో ఉన్న క్రీమిసంహరకమందును సేవించడంతో క్రీమిసంహరక మందు వాసనను కుటుంబసభ్యులు గమనించి శ్రీరాములును చికిత్సనిమిత్తం 108లో మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో శ్రీరాములు పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌కు తరలించారు. చికిత్స పోందుతూ శనివారం తెల్లవారుజామున రైతు శ్రీరాములు మృతి చెందిన్నట్లు మరికల్ సిఐ సోమనాథం తెలిపారు. కుటుంబసభ్యులు ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకోని దర్యాప్తుచేస్తున్నట్లు సిఐ తెలిపారు.

విద్యార్థుల ర్యాలీ, ధర్నా
ధన్వాడ, నవంబర్ 5: ధన్వాడ మండలంలోని కొండాపూర్ గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఆవరణంలో వాటర్ ట్యాంక్‌ను నిర్మాణం పనులు చేయకూడదని డిమాండ్ చేస్తు శనివారం బిజెపి ఆధ్వర్యంలో విద్యార్థులతో గ్రామంలో పలు వార్డులలో ర్యాలీ నిర్వహించారు. పాఠశాల అవరణంలో ట్యాంక్ నిర్మాణం వద్దు అంటూ నినాదాలు చేశారు. అనంతరం కొండాపూర్ గ్రామంలోని అంబేద్కర్ చౌరస్తాలో విద్యార్థులతో ధర్నా కార్యక్రమంను నిర్వహించారు. ఈ ధర్నాను ఉద్ధేశించి కోండాపూర్ గ్రామ బిజెపి అధ్యక్షులు అంజనేయులు యాదవ్ మాట్లాడుతూ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణంలో మంచినీటి ట్యాంక్ నిర్మాణం పను లు చేపడితే విద్యార్థులకు ప్రార్థన సమయంలో ఇబ్బందులకు గురికావడం జరుగుతుందని ఆయన తెలిపారు. నారాయణపేట ఎమ్మెల్యే రాజేంధర్‌రెడ్డి ట్యాంక్ నిర్మాణం పనులకై మరో స్థలంలో భూమిపూజాలు నిర్వహించడం జరిగిందని ఆయన తెలిపారు. అనంతరం పాఠశాల చైర్మన్ రాఘవేంద్ర మాట్లాడుతూ పాఠశాల ఆవరణంలో ట్యాంక్ నిర్మాణం పనులు నిర్వహిస్తే పాఠశాల విద్యార్థులతో ధన్వాడ మండల ఎంఇఓ కార్యాలయం ముందు ఆందోళన చేస్తామని హెచ్చరించారు.