మహబూబ్‌నగర్

రీ-డిజైన్‌తోనే తెలంగాణ సస్యశ్యామలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, ఏప్రిల్ 5: పాలమూరు ఎత్తిపోతల పథకం నిర్మాణానికి చేపడుతున్న భూమి కొనుగోలు దేశంలోనే ఆదర్శంగా నిలిచిందని 123 జి ఓ ప్రాజెక్టు నిర్మాణానికి మరింత వేగవంతంగా పెంచేందుకు దోహదపడిందని రాష్ట్ర భారి పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మంగళవారం మహబూబ్‌నగర్‌లోని ఆర్‌అండ్‌బి అతితి గృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ తెలంగాణలో కోటి ఎకరాలకు సాగునీరును అందించాలనే ధృక్పథంతోనే ముక్యమంత్రి కెసి ఆర్ భారీ ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి అసెంబ్లీలో చూపించిన జలదృశ్యం యావత్తు దేశ ప్రజలు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు సాక్షాత్తు దేశ ప్రధానే అభినందించారని తెలిపారు. కానీ ఇక్కడ కొందరు దుర్మార్గులు మాత్రం వారి తలకాయలో మెదడు లేని విధంగా ప్రభుత్వంపై, ముఖ్యమంత్రిపై విమర్శలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒర్వలేక, సహించలేక తమకు పుట్టగతులు ఉండవని భావించి ఎదోవిధంగా పేపర్లలో, టివిల్లో కనిపించేలా ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణకు నయా పైసా ఇవ్వనని నిండుసభలో ప్రకటిస్తే గుడ్లప్పగించుకుని కుక్కిన పేనులా పడి ఉండి ఏమీ చేయలేనివారు. ప్రస్తుతం గొప్పగొప్ప మాటలు మాట్లాడేందుకు ప్రయత్నిస్తూ అభాసుపాలు అవుతున్నారన్నారు. దోచుకునేవారు, దోపిడీదారులు ఎవరో తెలంగాణ ప్రజలందరికీ తెలుసన్నారు. ఇంకా ఒకరిద్దరు ఆంధ్రాబాబు జపం చేస్తూ ఆయన మోచేతి నీళ్లు తాగుతూ తెలంగాణకు ఇంకా ద్రోహం చేయాలని చూస్తున్నారని టిడిపి ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఉద్దేశించి మంత్రి ఈ వ్యాఖ్యాలు చేశారు. నాగం జనార్థన్‌రెడ్డి పాలమూరు ఎత్తిపోతల పథకం పూర్తి అయితే గుండు గీయించుకుంటానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఆయనకు ఇప్పటికే జనం గుండు గీయించి ఓటమిని తన నెత్తిమీద పెట్టారని ఇంకా బుద్ధిరాకుంటే ఎలా అంటూ ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి అసెంబ్లీలో పవర్ ప్రజెంటేషన్ చూయిస్తే మాయసభలా ఉందంటూ వ్యంగ్యాస్తల్రు చేసిన కాంగ్రెస్ నాయకులు సిగ్గుమాలిన రాజకీయలు మానుకోవాలని హితవు పలికారు. పాలమూరు ఎత్తిపోతల పథకానికి కృష్ణాజలాలు శ్రీశైలం జలాశయం నుండే తీసుకోవడం శ్రేయస్కారం కాబట్టే జూరాల ప్రాజెక్టు నుండి ఉన్న డిజైన్‌ను ముఖ్యమంత్రి ప్రత్యేక్షంగా పరిశీలించి మార్చారన్నారు. పదేళ్లు జిల్లాను దత్తత తీసుకుని దగా చేసిన మూర్ఖులు ఎవరో ప్రజలకు బాగా తెలుసన్నారు. ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు జలదృశ్యాన్ని చూపిస్తామని చెప్పడం విడ్డురంగా ఉందని వారు చూపించిన దృశ్యమే 60 ఏళ్లుగా తెలంగాణను నాశనం చేసిందని వారి పరిపాలన దృశ్యం తెలంగాణను ఏడారిగా చేసిందని ఎద్దేవా చేశారు. అందుకే 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు దృష్టి లేకుండా ప్రజలు చేశారని రాబోయే కాలంలో పూర్తిగా పుట్టి మునిగిపోక తప్పదని విమర్శించారు. అనంతపురం జిల్లాకు వెళ్లి దోచుకుని పోయిన నీటికి మంగళహారతి పట్టిన వారు ఎవరో యావత్తు తెలంగాణ ప్రజలకు తెలుసని శ్రీనివాస్‌గౌడ్ గద్వాల ఎమ్మెల్యే డికె అరుణను ఉద్దేశించి విమర్శించారు. విలేఖరుల సమావేశంలో జడ్పి చైర్మన్ బండారి భాస్కర్, టిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు శివకుమార్, నాయకులు రాజేశ్వర్‌గౌడ్, బెక్కెం జనార్థన్, వెంకటయ్య, ఇంతియాజ్, కోట్ల కిషోర్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి పాల్గొన్నారు.