మహబూబ్‌నగర్

బాల్య వివాహాలు నిర్మూలిద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, నవంబర్ 19: బాలల హక్కుల సంరక్షణలో భాగంగా 14 సంవత్సరాల వయస్సుగల పిల్లలను పని చేయించడం, బాల్య వివాహాల నిర్మూలన కోసం జిల్లా లిగల్ సర్విసెస్ అథారిటీ పని చేస్తుందని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రామసుబ్రమణియన్ అన్నారు. శనివారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన చిల్డ్రన్ ప్రెండ్లీ లిగల్ సర్విసెస్ ప్రొటెన్షన్ స్కీం 2015 కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి జిల్లాలో బాలల హక్కుల సంరక్షణ కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని అందులోని చైర్ పర్సన్, నలుగురు సభ్యురాళ్లు, ఒక మహిళ సభ్యురాలిని ఏర్పాటు చేసుకునే విధంగా చూడాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బేటి బచావో...బేటి పడావో పథకం జనవరి 22, 2015న ప్రారంభించడం జరిగిందని ఈ పథకాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన భాద్యత జిల్లా యంత్రాంగంపై ఉందని అన్నారు. సుకన్య సంవృద్ది యోజన పథకం కింద ఆరు సంవత్సరాల వయస్సు వారికి స్వేచ్చ బాల్య జీవితం కల్పించి భవిష్యత్తులో విద్యాను అందించి పెళ్లిడు వరకు తీర్చిదిద్దాలని అన్నారు. బంగారు తల్లి పథకం కింద ప్రతి కుటుంబంలో పుట్టిన ఆడ పిల్లలకు డిగ్రీపట్టా సాదించే వరకు విద్యాబుద్దులు నేర్పించాలని పుట్టిన ఆడశిశువుకు రూ.2500 ఆమె ఖాతాలో డిపాజిట్ చేస్తుందని మొదట రెండు సంవత్సరాల్లో తన ఖాతాలో రూ.1000 జమా చేస్తుందని ప్రతి సంవత్సరం చోప్పున రూ.1500లు ఐదు సంవత్సరాల వరకు ఇస్తుందని అన్నారు. అమ్మాయికి మొదటి అడ్మిషన్ పాఠశాలలో రూ.2000 ప్రతి సంవత్సరం ఐదవ తరగతి వరకు ఇస్తుందన్నారు. ఆరవ తరగతిలో రూ.2500లు, 8వ తరగతిలో రూ.3000లు, ఇంటర్మిడియట్ వచ్చే సరికి రూ.3500లు ప్రతి సంవత్సరం ఇవ్వనున్నామన్నారు. జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్ మాట్లాడుతూ పాలమూరు జిల్లాలో కష్టించి పని చేసే కూలీలు అనేక మంది ఉన్నారని కూలీపైనే ఆధారపడి వివిధ ప్రదేశాలకు వలసలు వెళ్లడం వల్ల వారి పిల్లల చదువు విషయంలో నిర్లక్ష్యం చేస్తున్నారనే విషయం తమ దృష్టికి వచ్చిందని ఈ విషయంపై సమగ్ర ప్రణాళికలు తయారు చేయడం ఎంతైన అవసరం ఉందని అన్నారు. జిల్లాలో అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారాన్ని బాలింతలకు, చిన్నపిల్లలకు, గర్భిణిలకు పంపిణీ చేయడంలో ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల పిల్లలకు సంక్షేమ హస్టళ్లు, గురుకుల పాఠశాలల్లో మెరుగైన వసతులతో పాటు ణాణ్యమైన విద్యను అందించడం జరుగుతుందని కార్పోరేట్ పాఠశాలలకు దీటుగా మెరుగైన విద్యను అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా జడ్జి వెంకటకిష్ణయ్య, జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి, లిగల్ సర్విసెస్ అథారిటీ సభ్యుడు రాంబాబు, జిల్లా న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.

ఇందిర సేవలు మరువలేనివి
ఆంధ్రభూమి బ్యూరో
మహబూబ్‌నగర్, నవంబర్ 19: దేశంలో పేదరిక నిర్మూలన కోసం దివంగత ప్రధాని ఇందిరాగాంధీ చేసిన సేవలు మరువలేనివని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉబెదుల్లా కొత్వాల్ కొనియాడారు. శనివారం దివంగత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఆమె చిత్రపటాలకు, విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రమైన మహబూబ్‌నగర్‌లోని క్లాక్‌టవర్‌లో గల పార్క్‌లో ఇందిరాగాంధీ విగ్రహానికి కాంగ్రెస్ నేతలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సైతం ఇందిరాగాంధీ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డిసిసి అధ్యక్షుడు ఉబెదుల్లా కొత్వాల్ మాట్లాడుతూ ఇందిరాగాంధీ దేశాభివృద్ది కోసం ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చారని, అందులో భాగంగా బ్యాంకులను జాతీయం చేసి ప్రతి వ్యక్తికి బ్యాంకులో తన డబ్బు ను దాచుకునే సౌకర్యంతోపాటు వ్యాపార లావాదేవీలను కల్పించిన ఘనత ఆమెకే దక్కిందన్నారు. బ్యాంకులను జాతీయం చేస్తున్న సమయంలో ఎన్నో సమస్యలు ఎదురైనా మొక్కవోని ధైర్యంతో నిర్ణయం తీసుకోవడంతో నేడు దేశవ్యాప్తంగా బ్యాంకుల సేవలు ప్రజలకు అందుతున్నాయ ని అన్నారు. అదేవిధంగా దేశంలో భూసంస్కరణలు తెచ్చి భూమిలేని పేదలకు భూపంపిణీకి నాంది పలికిన ఘనత కూడా ఇందిరాగాంధీకే దక్కిందన్నారు. భూ సంస్కరణలు చేస్తున్న సందర్భంలో పెత్తందారులు, బడాబాబుల నుండి ఎన్నో విమర్శలు ఎదురైనా పేదల కోసం దేశంలో భూసంస్కరణలను తేవడంతోనే నేడు దేశంలోని అన్ని రాష్ట్రాలలో ప్రభుత్వాలు భూపంపిణీ చేయడానికి వీలుపడిందన్నారు. రాజాభరణాల రద్దు కూడా సాహోపేతమైన నిర్ణయమని, ఈ నిర్ణయంతో ప్రపంచ దేశాలే ఇందిరాగాంధీ ధైర్యాన్ని మెచ్చుకున్నాయని అన్నారు. దేశంలో ఎన్నో ఒడిదుడుకులు ఉన్న సందర్భంలో ఇందిరాగాంధీ చూపిన తెగువ పేద ప్రజలకు ఎంతగానో ఉపయోగపడిందని అన్నా రు. ప్రతి కాంగ్రెస్ నాయకుడు, కార్యకర్త ఇందిరాగాంధీ ఆశయ సాధన కోసం కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఇందిరాగాంధీ దేశ ప్రజలకు ఎన్నో సేవలు చేసి ఎన్నో పథకాలను అమలు చేసి పేదల అభ్యున్నతి కోసం పాటుపడ్డ మహనీయురాలని అని కొనియాడారు. మాజీ డిసిసి అధ్యక్షుడు ముత్యాల ప్రకాష్, ప్రచార కార్యదర్శి వెంకటేష్, ఉపాధ్యక్షుడు సత్తూరు చంద్రకుమార్‌గౌడ్, మాజీ ప్రచార కార్యదర్శి బెనహర్, కౌన్సిలర్లు లక్ష్మణ్‌యాదవ్, రవికిషన్‌రెడ్డి, ఖాజాపాషా తదితరులు పాల్గొన్నారు.

మాతా శిశుమరణాలను తగ్గించాలి
బిజినేపల్లి, నవంబర్ 19: ప్రభుత్వ ఆస్పత్రులలో కాన్పులు నిర్వహించి మాతా శిశుమరణాలను తగ్గించాలని జిల్లా కలెక్టర్ ఇ.శ్రీ్ధర్ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని పిహెచ్‌సిని ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆపరేషన్ థియేటర్‌ను పరిశీలించి బాలింతలతో వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. గ్రామీణ ప్రాంత మహిళలు ఇప్పటికి కాన్పుల కోసం ఆర్‌ఎంపిలను, నాటు వైద్యులను ఆశ్రయిస్తున్నారని, దీనితో మాతా శిశు మరణాలను సంభవిస్తున్నాయని అన్నారు. వైద్య సిబ్బంది అవగాహన కల్పించి ప్రభుత్వం అందించే పారితోషికంపై, తల్లి బిడ్డల ఆరోగ్యంపై విస్తత్ర ప్రచారం నిర్వహించాలన్నారు. వైద్యులు, వైద్య సిబ్బంది వంతుకు విధులను నిర్వహించకుండా బాధ్యతతో కూడిన విధులను నిర్వహించాలన్నారు. గర్భ నిర్ధారణ పరీక్షలను నిర్వహించి బహిర్గతం చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఎంఅండ్ హెచ్‌వో సుధాకర్‌లాల్, ఎంపిపి ఎద్దుల రాములు, జడ్పీటిసి సుధా పరిమళ, సర్పంచ్ తిరుపత య్య, మార్కెట్ కమిటి వైస్ చైర్మన్ కుర్మ య్య, వైద్యులు సాయినాథ్‌రెడ్డి, దశరథం, నర్సింహ్మారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

చరిత్ర పుటల్లోకి లెక్కించదగ్గ నేత ఇందిర
వనపర్తి, నవంబర్19: మాజీ భారత ప్రధాని స్వరీ గయ ఇంధిరాగాంధీ దేశానికి చేసిన సేవ మరువలేనిదని ఎ ఐసిసి కార్యదర్శి, వనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ జి.చిన్నారెడ్డి అన్నారు. శనివారం ఇంధిరాగాంధీ నూరవ జయంతిని పురస్కరించుకొని ఇంధిరాగాంధీ చౌరస్తాలోని ఆమె నిలువెత్తు విగ్రహానికి పూలమాల లు వేసి నివాళు అర్పించిన అనంతరం వనపర్తి ఏరి యా ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రేడ్లు పంపిణీ చేసి రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఇంధిరాగాంధీ నూరవ జయంతి సందర్భంగా 100 మంది యువకులు, జూనియర్ డిగ్రీ కళాశాల విద్యార్థులచే రక్తదానాన్ని నిర్వహించారు. ఇంధిరాచౌరస్తాలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులతో పాటు కన్సోలేషన్ బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఎ ఐసిసి కార్యదర్శి చిన్నారెడ్డి మాట్లాడుతూ తొలి మహిళా ప్రధానిగా బాద్యతలు చేపట్టిన ఇంధిరాగాంధీ పాలనలో దైర్యసాహసలు ప్రదర్శించి చరిత్ర పుటల్లోకి ఎక్కారని అన్నారు. ఎన్నో సంస్కరణలు చేపట్టి దేశానికి మార్గదర్శకులు అయ్యారని, మహిళా లోకానికే వనె్న తెచ్చారని ఆయన కొనియాడారు. ఆమె దేశం కోసం తీసుకున్న నిర్ణయం వల్ల భద్రత బలగాలే ఆమెను మట్టుపెట్టాయని, చివరి వరకు అధికారంలోనే ఉండి దేశం కోసం ప్రాణాలర్పించారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్‌గౌడ్, తిరుపతయ్య, కిరణ్‌కుమార్, ధనలక్ష్మి, కోట్లరవి, చంద్రవౌలి, శ్యామ్‌కుమార్, భువనేశ్వరి, విజయలక్ష్మి, రాధాకృష్ణ, పాల్గొన్నారు.

తొలిరోజు ఎస్‌ఐ అభ్యర్థుల...
రాతపరీక్ష ప్రశాంతం

పర్యవేక్షణే ప్రధానం
నాగర్‌కర్నూల్, నవంబర్ 19: అంకితభావంతో పని చేసినప్పుడే పేదలు ఆర్థికంగా ఎదుగుతారని, పేద ప్రజలకు సేవలందించే శాఖల్లో గ్రామీణాభివృద్ది అన్నింటికంటే ప్రధానమైనదని జిల్లా కలెక్టర్ ఇ.శ్రీ్ధర్ అన్నారు. శనివారం స్థానిక సిఎన్‌రెడ్డి సేవా సదన్‌లో గ్రామీణాభివృద్ది, ఉపా ధి హామి అధికారులు, సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో ఆయా శాఖల పనితీరుపై సమీక్షించారు. ఈ సందర్భంగా వారినుద్దేశించి జిల్లా కలెక్టర్ శ్రీ్ధర్ మాట్లాడుతూ అన్నీ అభివృద్ది శాఖలకంటే గ్రామీణాభివృద్ది శాఖ ద్వారా గ్రామీణ ప్రజలకు ఎక్కువగా, మరింత దగ్గరగా సేవ లు అందించాలనే ఉద్దేశ్యంతో ప్రభు త్వం చిన్న జిల్లాలను ఏర్పాటు చేసిందన్నారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులపై సరైన పర్యవేక్షణ చేయడానికి జిల్లా స్థాయి అధికారులకు వీలుకలుగుతుందన్నారు. ఈ పరిస్థితు ల్లో గ్రామ స్థాయి అధికారులు తప్పనిసరిగా లక్ష్యాలకు అనుగుణంగా విధులను నిర్వహించాలని, అప్పుడే ప్రజల జీవితంలో మార్పు వస్తుందన్నారు. తదనుగుణంగా పేద ప్రజలు ఆర్థికంగా అభివృద్ది చెందుతారని అన్నారు. ప్రతిరోజు మన లక్ష్యాలను సరిచూసుకుంటూ తమ పనితీరుపై తామే ప్రశ్నించుకుంటూ లక్ష్యాలను సాధించేదిశగా ముందుకు సాగాలన్నారు. ప్రభుత్వ పథకాలపై ప్రజలకు సరైన అవగాహన ఉండదని, మీకు శిక్షణ ఇచ్చినట్లే మీ వద్దకు వచ్చిన వారికి ఓపికతో, సహనం తో, మర్యాదతో వారికి అర్థమయ్యేలా వివరించాలన్నారు. మనకు చెల్లిస్తున్న వేతనాలు ప్రజల నుంచి వసూలు చేస్తున్నవే అనే విషయాన్ని ప్రతి క్షణం గుర్తించుకొని విధులు నిర్వహించాలన్నారు. ఇది కాకుండా వేరేవిధంగా ఆలోచిస్తే మార్చుకోవాలని సూచించారు. మీ ఆత్మాభిమానానికి భంగం కలిగించే విధంగా ఎవరు ప్రవర్తించిన సహించేదిలేదని, అండగా ఉంటానన్నారు. ఇతర జిల్లాలతో పోలిస్తే చాలా విషయాలలో వెనుకబడి ఉన్నామన్నారు. ఇజిఎస్ ద్వారా పేదల జీవితాలలో మార్పులు వస్తాయని, మీ విధులనుబట్టి ఫలితాలు వస్తాయన్నారు. ప్రారంభించిన ప్రతిపని పూర్తయ్యే వరకు వెంటపడాల్సిన అవసరం ఉందని, ప్రతి నెల పనితీరుపై సమీక్షించి బాగా పని చేసిన వారికి అభినందించి అండగా ఉంటానని, పనితీరు బాగా లేకుంటే, పనులలో నిర్లక్ష్యం వహిస్తే ఎంత చర్యకైనా వెనుకాడనని హెచ్చరించారు. ఈ సమీక్షా సమావేశంలో రాష్ట్ర సంచాలకులు వెంకటేశం మాట్లాడుతూ జిల్లాలో ఈ సంవత్సరం రూ.147 కోట్లు లక్ష్యంకాగా, ఇప్పటికి 60 కోట్లు సాధించామని, స్ర్తి నిధి కింద 20 కోట్లు చెల్లించేందుకు లక్ష్యంగా ఉందన్నారు. ఈ సమావేశంలో డిఆర్‌డివో వెంకటయ్యగౌడ్‌తోపాటు ఎంపిడివోలు, ఎపివోలు తదితరులు పాల్గొన్నారు.

భక్తులతో పోటెత్తిన కురుమూర్తి
చిన్నచింతకుంట, నవంబర్19: కురుమూర్తి స్వామి బ్రహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. కార్తీకమాసం శనివారం కావడంతో జిల్లా నలుమూలాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు. ఉదయం నుంచే భక్తుల తాకిటి అధికమైంది. దిగువ కొండ నుంచి స్వామి వారి సన్నిధి వరకు వేలాధిగా భక్తులు క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉండి కాంచన గుహలో వెలసిన కురుమూర్తి స్వామిని దర్శించుకున్నారు. జాతర మైదానంలో స్వామి వారికి నైవేద్యాలు సమర్పించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు జాతరలో మండుటెండలోనే స్వామి వారికి మొక్కులు చెల్లించుకున్నారు. కోటి దాకా ఆధాయం వస్తున్న భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో దేవాదాయ శాఖ పూర్తిగా విఫలమైందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరిపడ షెడ్లు లేకపోవడంతో జాతర సమయాల్లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు గుట్ట ప్రాంతంలోనే విరిధి చేస్తున్నామని ఒక పక్క భద్రత లేక బిక్కుబికుమంటూ జాతరకు వస్తున్నామని ఇప్పటికైనా దేవాదాయ శాఖ ఏర్పాటు చేపట్టాలని కోరుతున్నారు. జాతరకు వచ్చేందుకు ఎద్దుల బండ్లు, ట్రాక్టర్లు, ఆటోలలో కురుమూర్తి సన్నిధికి చేరుకుంటున్నారు. శనివారం భక్తులు అధిక సంఖ్యలో రావడంతో శ్రీకురుమూర్తి స్వామి వెలసిన కాంచన గుహా భక్తుల గోవింద నామస్మరణంతో పులకరించింది. జాతరలోని వివిధ వ్యాపారాలలో భక్తుల కోలాహాలం కనిపించింది. రంగులరత్నాల వద్ద యువతి యువకులతో పాటు చిన్నారులు ఆహ్లాదకరంగా గడిపారు.