మహబూబ్‌నగర్

గిట్టుబాటు ధర కల్పించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మక్తల్, డిసెంబర్ 4: పత్తి విత్తనాలను ఉత్పత్తిచేస్తున్న రైతాంగానికి గిట్టుబాటు ధర కల్పించి ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేయాలని ఎఐకెఎంఎస్ జిల్లా నాయకుడు భగవంతు డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మక్తల్‌లో విలేఖరులతో మాట్లాడుతూ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 50 వేల ఎకరాల్లో 30 వేల మంది రైతులు దశాబ్ధాలుగా పత్తివిత్తనాలను ఉత్పత్తి చేస్తున్నారని తెలిపారు. ఇట్టి విత్తనాలను గద్వాల నూతన జిల్లాలో అత్యధికంగా పండించడం జరుగుతుందని అన్నారు. ఎంతో వ్యయప్రయాసాలకు ఓర్చి విత్తనాలను ఉత్పత్తి చేసినా ఆదాయం రాక రైతులు ఆవస్థలు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అంకూర్, నజువీడు, కావేరి సత్యసీడ్, నంది, పాలమూర్ తదితర విత్తన కంపెనీలు ప్రతిఏటా రైతులచే విత్తనాలు ఉత్పత్తి చేయిస్తున్న ఎలాంటి ఒప్పందాలు కుదుర్చుకోకపోవడం విడ్డూరమని అన్నారు. రైతుకు ఇచ్చ్ధేర కంపెనీల ఇస్ట ప్రకారమే నిర్ణయం జరుగుతన్నప్పటికి రైతులు కాస్తంత ఆదాయం వస్తుందన్న నమ్మకంతో కంపెనీల వారిని నమ్మి విత్తనసాగు చేస్తున్నారని అన్నారు. ఎకరాకు రూ.2లక్షలు పెట్టుబడి వస్తుందంటున్న రైతులు అంతటి డబ్బును పెట్టుబడిగా పెట్టుకోలేక, ప్రైవేట్ వడ్డీవ్యాపారులను ఆశ్రహించి అప్పులు చేసి విత్తనాలను పండిస్తున్నప్పటికి గిట్టుబాటు ధరలులేక గిలగిల తున్నుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఏప్రభుత్వాలు అధికారం చేపట్టినప్పటికి రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని ఎవరు ఆపలేక పోతున్నారని అన్నారు. పత్తిరైతుకు గిట్టుబాటు ధర చెల్లించాలన్న ప్రధాన డిమాండ్‌తో ఈనెల 7వ తేదీన గద్వాల జిల్లా కేంద్రంలో రైతాగం సదస్సు ఏర్పాటు చేయనుందని తెలిపారు. ఇట్టి సదస్సుకు ఉమ్మడి జిల్లాలోని రైతులు అధిక సంఖ్యలో హాజరై సదస్సును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

మరుగుదొడ్ల బిల్లులు చెల్లించండి
నర్వ, డిసెంబర్4: ఉపాధి హామీ పథకం కింద నిర్మించుకున్న వ్యక్తిగత మరుగుదొడ్ల బిల్లులను తక్షణ మే చెల్లించాలని నర్వ, లంకాల, యా ంకి గ్రామాల లబ్ధిదారులు ఆదివారం ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఉపాధి పథకం కింద మరుగుదొడ్లు నిర్మించుకొని ఏడాది గడుస్తున్నా నేటికి బిల్లులు రాక ఇబ్బందులకు గురవుతున్నామన్నారు. అధికారుల నిర్లక్ష్యంతోనే లబ్ధిదారులకు బిల్లులు అందడం లేదన్నారు.

మాలమహానాడు ధర్నా

మహబూబ్‌నగర్, డిసెంబర్ 4: ఎస్సీ వర్గీకరణకు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుతో పాటు పలువురు బిజెపి నాయకులు మద్దతు పలకడాన్ని నిరసిస్తూ తెలంగాణ మాలమహానాడు ఆద్వర్యంలో ఆదివారం బిజెపి కార్యాలయాన్ని మాలమహానాడు నాయకులు, కార్యకర్తలు ముట్టడించారు. ఎస్సీ వర్గీకరణకు బిజెపి మద్దతు ఇవ్వొద్దని వారు డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్దమ ంటూ అలాంటి వర్గీకరణకు బిజెపికి చెందిన కేంద్రమంత్రులు ఎందుకు మద్దతు ఇస్తున్నారని ప్రశ్నించారు. ఈ స ందర్భంగా బిజెపి కార్యాలయాన్ని ముట్టడించిన తెలంగాణ మాలమహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసింహ్మయ్య మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్దమని అందుకు కేంద్రమంత్రులు ప్రత్యేకంగా చొరవ తీసుకుని మాదిగలకు అండగా నిలవడం ఏమిటని ప్రశ్నించారు. కేం ద్రమంత్రులు వెంకటయ్యనాయుడు, బండారు దత్తాత్రేయలు ఎమ్మార్పిఎస్ ధర్మయుద్దం సభలో పాల్గొని మాలల మనోభావాలను దెబ్బతిసే విధంగా ఎస్సీ వర్గీకరణకు మ ద్దతు ఇచ్చి పార్లమెంట్‌లో వర్గీకరణకు బిల్లు పెట్టేవిధంగా కృషి చేస్తామని హామీ ఇవ్వడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని నరసింహ్మయ్య అన్నారు. ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ వ్యతిరేకమని భారతదేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టు, జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్, జా తీయ న్యాయశాఖ తెల్చిచెప్పినప్పటికిని రాజ్యాంగాన్ని అవహేలన చేస్తూ రాజ్యాంగబద్దంగా ఎంపిక అయిన మ ం త్రులు ఎమ్మార్పిఎస్‌కు అండగా ఉండడం ఏమిటని ప్రశ్నించారు. దళితుల మధ్య చిచ్చుపెట్టడానికి మందకృష్ణ మాదిగ చేస్తున్న కుట్రలో బిజెపి పడకూడదని హితవు పలికారు. ఎస్సీ వర్గీకరణకు మద్దతు ఇస్తున్న మంత్రులను పదవుల నుండి బర్తరప్ చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే ప్రైవేటు రంగాల్లో కూడా రిజర్వేషన్ ప్రక్రియకు శ్రీకారం చుట్టాలని ఎస్సీల మధ్య చిచ్చుపెట్టే కార్యక్రమాలకు స్వస్తి పలకాలని కోరారు. ఈ కార్యక్రమ ంలో నాయకులు చెన్నకేశవులు, శ్యాంసుందర్, వెంకటస్వా మి, ఆంజనేయులు, యాదగిరి, లక్ష్మయ్య, వెంకటయ్య, శ్రీశైలం, నరేందర్, మున్నయ్య పాల్గొన్నారు.

నష్టపోయిన మామిడికి బీమా!

గద్వాలరూరల్, డిసెంబర్ 4: జోగుళాంబ గద్వాల జిల్లా లో ప్రతి పంటకాలంలో ప్రకృతి వైఫరీత్యాల కారణంగా మామిడి పంటకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లుతూ వస్తోంది. మామిడికి వాతావరణ ఆధారిత పంటల బీమాను అమలు చేస్తుండగా ఈ నెల 14వ తేదీ వరకు ప్రీమియం చెల్లింపు గడువున్నట్టు జోగుళాంబ గద్వాల జిల్లా ఉద్యాన, పట్టుపరిశ్రమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ సోమిరెడ్డి తెలిపారు. జిల్లాలో 745 హెక్టార్లలో మామిడి తోటలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం జనవరి నుండి మే వరకు వీచే గాలివానలు, అధిక ఉష్ణోగ్రతల మార్పు, తెగుళ్ల కారణంగా పూత, పిందె, కాయదశల్లోని మామిడిని తీవ్రంగా నష్టపరుస్తున్నాయి. 2015 వేసవిలో జిల్లాలోని కొన్ని మండలాలలో ప్రకృతి వైఫరీత్యా ల కారణంగా 40-70 వరకు మామిడికి నష్టం వాటిల్లింది. జిల్లాలో పంటల బీమాను అమలు చేసే బాధ్యతలను చోళమండలం ఎంఎస్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీకి అప్పగించారు. జిల్లాలో 350 మంది రైతులు మామిడిని సాగు చేస్తున్నారు. అంతకు ముందు సంవత్సరాల్లో సీజన్లలో మామిడికి ప్రీమియం చెల్లించినా కూడా తగిన పరిహారం రాలేదు. దీంతో రైతులు ప్రీమియం చెల్లింపునకు అంతగా ము ందుకు రావడం లేదు. అంతకు ముందు రైతులు స్వచ్ఛందంగా ప్రీమియంను చెల్లించే అవకాశం ఉండగా.. ఈ సారి పంటరుణం తీసుకునే రైతుల ఖాతాల్లోంచి మినహాయించనున్నారు. రైతులు స్వచ్ఛందంగా తమ తోటలోని చెట్ల సంఖ్యను బట్టి ప్రీమియంను చెల్లించే వీలుంది. డిసెంబర్ 14 వరకు మామిడికి ప్రీమియం చెల్లింపు గడువు ఉండగా 5-15 ఏళ్ల చెట్టుకు రూ.22.50 చెల్లిస్తే పంట నష్టాన్ని బట్టి గరిష్టంగా రూ.450ని పరిహారంగా చెల్లిస్తారు. 15-50 సంవత్సరాల చెట్టుకు ఒక్కో దానికి రూ.42.50 చొప్పున చెల్లిస్తే గరిష్టంగా రూ.850 వరకు కవరేజీ ఉంటుంది. ఆయా మండలాల్లో ఆటోమెటిక్ వెదర్ స్టేషన్ల ద్వారా నమోదు చేసిన వాతావరణ వివరాల ఆధారంగా పంటకు వాటిల్లిన నష్టాన్ని అంచనా వేసి నష్టపోయిన మేరకు తపరిహారాన్ని మంజూరు చేస్తారిస్తారు. స్థానిక వాతావరణ నమోదు కేంద్రాలు అందుబాటులో లేకుంటే భారత వాతావరణ అధ్యయన కేంద్ర సమాచారాన్ని తీసుకొని డిసెంబర్ 15 నుంచి 2017 మే 31 వరకు కవరేజిని వర్తింపజేస్తారు. దరఖాస్తు ఫారాలు ఉద్యానశాఖ అధికారుల వద్ద అందుబాటులో ఉన్నాయి. రైతులు డీడీలు తీసి పాసుపుస్తకం, పాసుపోర్టు ఫొటో ఒకటి, ఆధార్‌కార్డు, బ్యాంకు ఖాతా జిరాక్స్ ప్రతులతో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. రైతులు దరఖాస్తు చేసిన తరువాత ఉద్యానశాఖ అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన జరిపి బీమాకు పరిగణలోకి తీసుకుంటున్నట్టు ధ్రువపరుస్తారు. సదరు బీమా కంపెనీకి చెందిన ప్రతినిధి జోగుళాంబ గద్వాల కార్యాలయంలో రైతులకు అందుబాటులో ఉంటారని, రైతులు ఇతర వివరాలకు కంపెనీ 18002005544 టోల్‌ఫ్రీ నెంబర్‌కు ఫోన్ చేసి సందేహాలను నివృత్తి చేసుకొని బీమాకు దరఖాస్తు చేయాలని జిల్లా ఉద్యానశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ సోమిరెడ్డి సూచిస్తున్నారు.

కమ్ముకున్న పొగమంచుతో హైరానా

షాద్‌నగర్ టౌన్, డిసెంబర్ 4: పొగమంచు కమ్ముకుపోవడంతో వాహనాల డ్రైవర్లు అనేక అవస్థలు ఎదుర్కొన్నారు. ఆదివారం ఉదయం పొగమంచుతో ఉండటంతో ఇటు ప్రజలు అటు వాహనదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముందువైపు నుండి వాహనాలు వస్తున్నాయా..లేదా అనే అనుమానాలతో వాహనాలను నడిపించారు.
ఉదయం ఎనిమిది గంటలు దాటిన పొంగమంచు విడకపోవడంతో ప్రజలు ఇళ్లల్లో నుండి బయటకు రాలేదు. షాద్‌నగర్ బైపాస్ రహదారిపై పూర్తి స్థాయిలో పొగమంచు కమ్ముకొని ఉండటంతో ఏమి చేయాలో తెలియక వాహనదారులు వాహనాలను పక్కకు నిలుపుకొని ఉండిపోయా రు. గత నాలుగు రోజుల నుండి ఒకమోస్తారు ఉండేది.. కానీ ఆదివా రం ఉదయం మాత్రం ఒక్కసారిగా పొగమంచు ఎక్కువగా రావడంతో ఎదురుగా వచ్చే వాహనాలు ఏమి కనిపించలేవు.
షాద్‌నగర్ పట్టణం పొగమంచుతో కమ్ముకొని పోవడంతో మరో ఊటిలా కనిపించంది. దీంతో ప్రజలు తమతమ ఫోన్లలో సెల్పీ ఫోటోలు ఎక్కువగా తీసుకున్నారు.

ట్రాలీ ఆటో డిసిఎం ఢీ : ఒకరు మృతి, నలుగురి పరిస్థితి విషమం

కొత్తూరు, డిసెంబర్ 4: ట్రాలీ ఆటోను వెనక నుండి డిసిఎం లారీ ఢీకొనడంతో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందడంతోపాటు నలుగురు వ్యక్తుల పరిస్థితి విషమంగా ఉంది. కొ త్తూరు ఎస్సై శ్రీశైలం యాదవ్ కథనం ప్రకారం వివరాలిలావున్నాయి. ఆదివారం సాయంత్రం నందిగామ మం డల కేంద్ర సమీపంలోని బైపాస్ జాతీయ రహదారిపై షాద్‌నగర్ నుం డి హైద్రాబాద్‌కు వెళ్తున్న ట్రాలీ ఆటోను ఓవర్‌టెక్ చేయబోయి వెనకవైపు నుండి డిసిఎం ఢీకొంది. దీంతో ట్రాలీ ఆటోలో ప్రయాణిస్తున్న నర్సి ంలు (30) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా మహాదేవమ్మ (35), బా లకృష్ణ (40), మల్లేష్ (30), లింగన్న (32) అనే నలుగురు వ్యక్తుల పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని హుటాహుటిన మరో వాహనంలో హైద్రాబాద్‌లోని ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. అంతేకాకుండా సాయి (23), నర్సింలు, అంజి, కుర్మయ్య, వెంకటేష్, శ్రీశైలం, నీలమ్మ, చెన్నమ్మ, ఈశ్వరమ్మ, చెన్నయ్య, మొగులమ్మ, అమృతమ్మ, మంజుల, సంతోష్, డ్రైవర్ మల్లేష్‌లు గాయపడగా వారిని షాద్‌నగర్ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వీరంతా మహబూబ్‌నగర్ జిల్లా హన్వడ మండలం గోండ్యాల్ గ్రామంలోని ఓ వివాహానికి వెళ్లి తిరిగి హైద్రాబాద్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని ఎస్సై వివరించారు.
బైపాస్ రహదారిపై ప్రమాదంలో జరగడంతో ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముందు జాగ్రత్తగా కొత్తూరు వైజంక్షన్ నుండే ట్రాఫిక్‌ను మళ్లీంచారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కొత్తూరు ఎస్సై శ్రీశైలం యాదవ్ వివరించారు.

రాష్ట్రంలోనే మహబూబ్‌నగర్‌ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతాం

మహబూబ్‌నగర్, డిసెంబర్ 4: రాష్ట్రంలోనే మహబూబ్‌నగర్ పట్టణాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని గత పాలకులు పేరుకు మాత్రమే జిల్లా కేంద్రంగా పరిపాలన చేసి విస్మరించారని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం మహబూబ్‌నగర్ పట్టణం లో రోడ్డు వెడల్పులో భాగంగా ప్ర భుత్వ కార్యాలయాల ప్రహారీ గొడల కూల్చీవేత నూతనంగా నిర్మించిన ప్రహారి గోడల ప్రారంభానికి శ్రీకారం చుట్టారు. ము ందుగా ప్రహారీ గొడలను నిర్మించిన తర్వాతే పాత గొడలను కూల్చీవేసే కార్యక్రమానికి శ్రీ కారం చుట్టడంతో ఎమ్మెల్యే నిర్ణయ ంపై అ ందరు చర్చించుకుంటున్నారు. ఎక్కడైన పనులు జరిగితే పాత ప్రహారి గొడలు ముందుగా కూలగొట్టి తర్వాత నిర్మాణాలు చేస్తారని అలా కాకుండా మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో నూతనంగా ప్రహారి గొడను నిర్మించి పాత గొడను కూల్చివేశారు. అదేవిధంగా బాలికల జూనియర్ కళాశాల, బెసిక్ ప్రాక్టిస్ హైస్కూల్, ఆర్‌అండ్‌బి అతిథిగృహం దగ్గర ముందుగా ప్రహారి గొడలను నూతనం గా నిర్మించి రోడ్డు వెడల్పుకు గాను పాత గొడలను కూల్చివేశారు. అందులో భాగంగా ఆదివారం ఈ కార్యక్రమాని కి ఎమ్మెల్యే శ్రీకారం చుట్టారు. ఈ స ందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మా ట్లాడుతూ మహబూబ్‌నగర్ పట్టణ ంలో గత 60 ఏళ్ల నుండి ఇరుకు రోడ్లతో జనం ఇబ్బంది పడుతున్నారని ముఖ్యంగా హైదరాబాద్ నుండి రాయిచూర్ వేళ్లె ప్రధాన రహదారి వెడల్పు ఎప్పుడో కావల్సి ఉందని గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఏళ్ల తరబడి జిల్లా ప్రజలు ఇబ్బందులకు గురయ్యారన్నారు. తాము ప్రజల ఆస్తులు నష్టపోకుండా ఓ ప్రణాళిక బద్దంగా ముం దుకెళ్తున్నామని మహబూబ్‌నగర్ పట్టణంలో ప్రభుత్వ కార్యాలయాలు రోడ్డుకు అనుకుని ఉన్నాయని వాటి ప్ర హారి గొడలను తొలగించి నూతనంగా రోడ్డు వెడల్పు అయ్యేలా నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. మహబూబ్‌నగర్ పట్టణంలో ప్రధాన రోడ్డును వెడల్పు చేయడానికి రూ. 33కోట్ల నిధులు రాబోతున్నాయని త్వరలోనే టెండర్ ప్రక్రియ పూర్తి అవుతుందన్నారు. దాంతో మహబూబ్‌నగర్‌లో ప్రధాన సమస్య రాకపోకలకు తీరుతుందన్నారు. అదేవిధంగా రూ. 90కోట్లతో బైపాస్ రోడ్డుకు నిధులు మంజూరు చేస్తూ ప్రభుత్వం జి ఓ విడుదల చేసిందని గత రెండు రోజుల నుండి బైపాస్ రోడ్డుకు సంబందించి సర్వే పనులు జరుగుతున్నాయని ఒకటి రెండు రోజుల్లో సర్వే పనులు పూర్తి అవుతాయన్నారు. ఈ నెల 22వ తేదిలోపు టెండర్ ప్రక్రియ కూడా పూర్తి అవుతుందన్నారు. ఇదే తేదిలో మరో రూ.10కోట్లకు సంబందించిన కొన్ని పనులు టెండర్లు అవుతాయని మరో రూ.163 కోట్లతో మీషన్ భగీరథ పనులకు కూడా టెండర్లు ఖరారు కానున్నాయన్నారు. దొడ్డలోనిపల్లిలోని మైనారిటీ కమ్యూనిటీ హల్‌కు రూ. 5లక్షల నిధులు మంజూరు అయ్యాయని, చిన్నదర్పల్లిలో యాదవ కమ్యూనిటీ భవనానికి శంకుస్థాపన చేస్తున్నామన్నారు.
పాలమూరు పెద్ద చెరువు పనులు కొనసాగుతున్నాయని నియోజకవర్గ ప్రజలు అభివృధ్దికి సహకరించాలని ఆయన కోరారు. జిల్లా ఆసుపత్రి సూ పరింటెండెంట్ మీనాక్షి, ఆర్‌ఎంఓ రాంబాబు, మాజీ జడ్పిటిసి రాజేశ్వర్‌గౌడ్, సింగిల్ విండో చైర్మన్ వెంకటయ్య, కౌన్సిలర్ గంజి వెంకన్న, యాదయ్య యాదవ్ పాల్గొన్నారు.

విద్యారంగ సమస్యలపై
టివివి పోరాటం
మక్తల్, డిసెంబ్ 4: విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ విద్యార్థి వదిక నిరంతరం పోరాడుతుందని టివివి డివిజన్ అధ్యక్షులు నరేందర్ అన్నారు. ఆదివారం మక్తల్ పట్టణంలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ విద్యారంగ సమస్యలు పరిష్కరించుటలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. సీఎం కెసి?ర్ విద్యా విధానంపై అనుసరిస్తున్న నియంతృత్వ పాలనను ఎండగడతామని ఆయన హెచ్చరించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను విడుదల చే యాలని డిమాండ్ చేశారు. తెలంగాణ విద్యార్థి వేదిక నిరంతరం పోరాడుతుందన్నారు. టివివి దశాబ్ధి ఉత్సవాలలో భాగంగా ఈనెల 9న హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో బహిరంగ సభ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇట్టి సభకు ముఖ్యవక్తలుగా ప్రొ.జగ్‌మోహన్‌సింగ్, ప్రొ. హరగోపాల్, డాక్టర సి.కాశీం, వరవరరావు, ప్రొ.సోరేపల్లి సుజాత, మద్దిలేటి, నజీర్ పాల్గొననున్నారు.

పెట్రోల్ బంకులు, కిరాణషాపుల్లో డిజిటల్ పేమెంట్లు

షాద్‌నగర్, డిసెంబర్ 4: నగదు రహిత లావాదేవీలు పూర్తి స్థాయిలో కొనసాగించాలనే ఉద్దేశ్యంతోనే పెట్రోల్‌బంకుల్లో, కిరాణాషాపుల్లో, బట్టణ దుకాణాల్లో, సూపర్‌మార్కెట్‌లలో డిజిటల్ పేమెంట్లకు శ్రీకారం చుట్టారు. నవంబర్ 8వ తేది కేంద్ర ప్రభుత్వం 500,1000రూపాయల నోట్లను రద్దు చేసిన నేపధ్యంలో డబ్బుల కోసం జనం అనేక ఇక్కట్లు పడుతున్నారు. పెద్దనోట్ల రద్దు చేయడంతో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఉద్యోగులు, ప్రజలు మారాల్సిన అవసరం ఉంది. ఏ వస్తువు కొనుగోలు చేసేందుకు వెళ్లాలన్న అందుకు డబ్బులు లేకపోవడంతో ఏమి చేయాలో తెలిక ప్రజలు నగదు రహిత లావాదేవీలపై దృష్టి పెడుతున్నారు. బ్యాంక్ ఖాతాలో ఉన్న డబ్బులు తీసుకునేందుకు బ్యాంకుల వద్దకు వెళ్లితే డబ్బులు లేవని బోర్డులు పెట్టడం..రెండు వేల నుండి ఆరువేల రూపాయల వరకు ఇవ్వడం..దీంతో జనం విసుగుచెంది నగదు రహిత లావాదేవీలపై దృష్టి కేంద్రీకరిస్తున్నారు. కిరాణషాపుల్లో వంటసామాగ్రి కొనగోలు చేసినా. .పెట్రోల్ బంకుల్లో పెట్రోల్, డిజీల్ వేసుకున్న ఎటిఏం కార్డులను వాడుతున్నారు. దీంతో పని సులువుగా అయిపోతుందని ప్రజలు ఎక్కువగా అటువైపు దృష్టి కేంద్రీకరిస్తున్నారు. అలాగే ఈ-బ్యాంకింగ్ వ్యవస్ధను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముమ్మరంగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.
చేతిలో మొబైల్ ఫోన్ ఉంటే చాలు ఈ- బ్యాంకింగ్ ద్వారా డబ్బులు బదులాయించే అవకాశాలు ఉన్నాయి. ఈ-బ్యాంకింగ్ విధానంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పలు స్వచ్చంద సంస్థలు సైతం ముందుకొస్తున్నాయి. ఆ దిశగా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తొంది. స్వైపింగ్ మిషన్లు వ్యాపార సంస్థలు తీసుకునేందుకు బ్యాంక్ అధికారులకు దరఖాస్తులు పెట్టుకున్నప్పటికి సరఫరా చేయడంలో మాత్రం కొంత ఆలస్యం జరుగుతుందని వ్యాపారస్తులు వాపోతున్నారు. త్వరగా స్వైపింగ్ మిషన్లు అందుబాటులోకి తీసుకువస్తే డబ్బుల కొరత కొంతమేరకు తీరే అవకాశాలు ఉంటాయి. బ్యాంకుల వద్ద జనం తాకిడిని తగ్గించాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం స్వై పింగ్, ఈ-బ్యాంకింగ్ వ్యవస్థలను అందుబాటులోకి ముమ్మరంగా తీసుకువస్తొంది.