మహబూబ్‌నగర్

తీరని కరెన్సీ కష్టాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్‌టౌన్, డిసెంబర్ 11: కేంద్ర ప్రభుత్వం రూ.500, 1000 లకు చెందిన పెద్దనోట్ల రద్దుతో దాదాపు 14 రోజులు కావస్తున్నా ఇంకా ప్రజల కస్టాలు పెరుగుతూనే ఉన్నాయి తప్పా తగ్గడం లేదని చెప్పవచ్చు. పెద్దనోట్లను రద్దు చేసిన నేపథ్యంలో పాతనోట్ల మార్పిడి, బ్యాంకుల్లో రీజిపాజిట్‌ల కోసం జనం బ్యాంకుల ముందు బారులు తీరుతూనే ఉన్నారు. వారిని క్యూ లైన్‌లో నిలిపేందుకై పోలీసు సిబ్బంది ఎంతో సహసోపేతంగా ఎలాంటి గొడవలకు తావులేకుండా విధులు నిర్వహిస్తున్నారు. గతంలో ఏబ్యాంకులోనైనా ఆధార్ జిరాక్స్‌కాఫీని నోట్లు మార్పిడి చేసుకునే ప్రొఫార్మకు జతచేసి పెడితే రూ.400, 4500 ఇచ్చారు. వాటిని రెండు వేలకు కుదించారు. ఇప్పుడు ఎవరి బ్యాంకులో ఖాతాలు ఉంటే ఆబ్యాంకులోనే నగదు మార్పిడి చెల్లిస్తామంటున్నారు. అది డిసెంబర్ 30 వరకు ఒకేసారీ నోట్ల మార్పిడి ఉంటుందని తెలిపారు. తీరా ఇప్పుడు చూస్తే ఏబ్యాంకులో కూడా సరైనా కొత్తనోట్లతో కూడిన డబ్బు రాలేక పోతుండటంతో చేసేదిలేక ప్రజలు తీవ్ర నిరుత్సాహానికి గురవుతున్నారు. తమ దగ్గరున్న పాతనోట్లను డిపాజిట్ చేయడం జరిగిందని, విత్‌డ్రా చేసుకుందామంటే సవాలక్ష నిబంధలను పెట్టడంతో సామాన్య జనం తల్లడిల్లుతుంది. మరోవైపు చేతిలో చిల్లిగవ్వలేదు, ఉన్న డబ్బు బ్యాంకులో వేశాము, వేసిన డబ్బును తీసుకుందామనుకుంటే ఎటిఎంలోగానీ, బ్యాంకుల్లోగానీ నోమని అంటూ నోటీసు బోర్డులు కనిపిస్తున్నాయని తెలిపారు. మ రోపక్క బ్యాంకు నుండి డ్రాచేసుకున్న డబ్బుతో రూ.2000 నోట్లు ఇవ్వడంతో వాటిని చిల్లర చేసుకుందామని తిరగరాని చోటు తిరిగినప్పటికి ఎక్కడ కూడా చిల్లర దొరకకా, దినసరి వస్తువులు తెచ్చుకోకా నానా ఇబ్బందుల పాలు కావలసి వస్తుందని ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈతంతూ ఇంకా ఎన్నాళ్లు ఉంటుందోనని కలసిన ప్రతివారిని అడిగి తెలుసుకుంటున్నారు.
ఆసరా పించన్‌దారులకు తప్పని నోట్ల తిప్పలు
దేవరకద్ర, డిసెంబర్ 11: ఆసరా పించన్‌దారులకు పెద్దనోట్లు చెల్లకపోవడంతో చిల్లర కష్టాలు మొదలయ్యాయి. ప్రతినెల పించన్ కోసం పోస్ట్ఫాసుకు వచ్చి తీసుకెళ్తున్న వారికి ఈ నెల పించన్ డబ్బులలో రూ.500, 1000 నోట్లు చెల్లకపోవడంతో ఇబ్బందులు మొదలయ్యాయి.
దేవరకద్ర మండలంలోని పోస్ట్ఫాసుకు పించన్ తీసుకునేందుకు వచ్చిన వారు చిల్లర కోసం నానా ఇబ్బందులు పడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఆసరా పించన్ దారులకు కష్టాలు మొదలయ్యాయి. వృద్దాప్య, వితంతువు పించన్ రూ.1000, వికలాంగ పించన్ రూ.1500 కావడంతో నానా తిప్పలు పడుతున్నారు. వృద్దులకు, వితంతువులకు కలిపి రూ.2000నోటును అధికారులు ఇస్తున్నారు.

అన్ని వర్గాలు అభివృద్ధి చెందాలంటే
విద్య ఎంతో అవసరం
* ఎంపి జితేందర్‌రెడ్డి
మహబూబ్‌నగర్‌టౌన్, డిసెంబర్ 11: అన్ని వర్గాలు అభివృద్ధి చెందాలంటే విద్యావిధానం ఎంతో అవసరమని ఎంపి జితేందర్‌రెడ్డి అన్నారు. ఆదివారం యుటి ఎఫ్ రాష్ట్ర ద్వితీయ మహాసభలో ఆయన ముఖ్యఅతిథిగా హజరై మాట్లాడారు. విద్య వ్యవస్థ బాగుపడాలంటే తల్లిదండ్రులు, స్థానిక ప్రజాప్రతినిధులను బాగస్వాములను చేయాలని అప్పుడే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల పట్ల ప్రజల్లో నమ్మకం సన్నగిల్లుతుందని ఈ పరిస్థితిని అదిగమించి పేద ప్రజలకు ప్రభుత్వ పాఠశాలల పట్ల నమ్మకం కలిగేలా చర్యలు తీసుకోవల్సిన భాద్యత ఉపాధ్యాయులపైనే ఉందని అన్నారు. ఉపాధ్యాయులు వ్యక్తిగత సమస్యల పరిష్కారానికే కాకుండా విద్య తదితర సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగం పట్ల చిత్తశుద్దితో ఉందని పేద ప్రజలకు మెరుగైన విద్యను అందించేందుకు కార్పోరేట్‌కు దిటుగా మెరుగైన విద్యను అందిస్తుందని తెలిపారు. ప్రస్తుతం కొన్ని పాఠశాలల్లో ఆంగ్ల మద్యామాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని అలాగే డిజిటల్ క్లాసులను కూడా ప్రారంభించడం జరిగిందని అన్నారు. పో రాడి సాదించుకున్న తెలంగాణ రాష్ట్రంలో అందరు బాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. మంత్రి జూపల్లి కృష్ణారావు, టిఎస్‌యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నర్సిరెడ్డి, రాష్ట్ర ఉపాద్యక్షుడు మాణిక్‌రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావ రవి, వెంకటేష్, ఉపాద్యాయులు పాల్గొన్నారు.