మహబూబ్‌నగర్

కేంద్రియ విద్యాలయంలో క్రీడలకు ప్రాధాన్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, డిసెంబర్ 19: కేంద్రియ విద్యాలయంలో విద్య తో పాటు క్రీడలకు ప్రాధాన్యతను ఇవ్వాలని మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్ అన్నారు. సోమవారం మహబూబ్‌నగర్ పట్టణ సమీపంలోగల ఎనుగొండ శివారులో గల కేంద్రియ విద్యాలయంలో వార్షిక క్రీడోత్సవాలను జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్ క్రీడల జెండాను అవిష్కరించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ విద్యాలయంలో మంచివాతావరణం కలిగి ఉందని, నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందించాలని, విద్యతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా బాల, బాలికలు విధిగా పాల్గొనే ఉత్సాహం కలిగించే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని ఆయన అన్నారు. కలెక్టర్ చేతుల మీదుగా శాంతి కపోతాలను ఎగురవేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. క్రీడలలో గెలుపొందిన విద్యార్థిని, విద్యార్థులకు బహుమతి ప్రధానం కలెక్టర్ చేతుల మీదుగా అందజేశారు. ఓరల్‌హౌస్ ట్రోఫీ మొదటి స్థానం రమన్ గెలుచుకోగా, ద్వితీయ స్థానం అశోక్ గెలుపొందాడు. క్రీడల వల్ల మానసిక ఉల్లాసంతో పాటు చదువులో కూడా చురుకుదనం చేకూరుతుందని తెలిపారు. సంస్కృతిక కార్యక్రమాలు స్వాగత గీతంతో తో మొదలై విద్యార్ధుల వందన స్వీకా రం స్వీకరించారు. కేంద్ర ప్రభుత్వం ఎంతో ఉన్నతమైన ఆశయాలతో కేంద్రియ విద్యాలయాలను జిల్లాలకు మంజూరు చేయడం జరిగిందని, విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లల విషయంలో తగిన శ్రద్ద వహించి ఉన్నతమైన దిశగా ప్రయాణించేటట్లు చూడాల్సిన భాద్యత ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులపై ఉందని అప్పుడే ప్రభుత్వం ఆశించిన ప్రయోజనం పొందినవారిమి అవుతామని వారు అన్నారు. కేంద్రియ విద్యాలయంలో సెంట్రల్ సిలబస్ ద్వారా విద్యాభోధనలు నిర్వహించడం వల్ల విద్యార్థులకు జాతీయ స్థాయి పోటీల్లో అవలీలగా పోటీలను ఎదుర్కోనేందుకు బాటలు వేసినవారిమి అవుతామని దానిని అనుగుణంగా మనమందరం తగిన ప్రణిళికతో ముందుకు పోవల్సి ఉంటుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్రియ విద్యాలయ ప్రిన్సిపల్ మృదుల తదితరులు పాల్గొన్నారు.

కరెన్సీ కోసం క్యూ
ధన్వాడ, డిసెంబర్ 19: ధన్వాడ మం డల కేంద్రంలోని ఆంధ్రాబ్యాంకులో డబ్బులు డ్రా చేసుకోవాడానికి ప్రజలు సోమవారం నానా తిప్పలు పడారు. కొందరు మహిళలు మాట్లాడుతూ కూలీపనులు వదిలిపేట్టి డబ్బులు డ్రా కోసం గంటల పాటు క్యూలో ఉండావాల్సిన పరిస్థితి నేలకోందని ప్రజలు వాపోయారు. పొలం పనులు వదులుకుని బ్యాంకుల ముందు ఉదయం నుండి క్యూలైన్‌లో ఉంటే పనులన్ని ఆగిపోతున్నాయని ఆవేధన వ్యక్తం చేశారు.

డ్రైవర్ అజాగ్రత్తతోనే ఆర్టీసీ బస్సు బోల్తా
మక్తల్, డిసెంబర్ 19: డ్రైవర్ ఆజాగ్రత్తవల్ల కర్ణాటకకు చెందిన ఆర్టీసి బస్సు బోల్తా పడిన సంఘటన సోమవారం తెల్లవారుజామున 3గంటల ప్రాంతంలో మక్తల్ సమీపంలోని దండు క్రాస్ రోడ్డువద్ద చోటుచేసుకొంది. ఎఎస్సై యాదయ్య కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కర్ణాటకలోని హౌస్‌పేట్ ఆర్టీసి డిపోకు చెందిన కెఎ32ఎఫ్1738 నెంబర్‌గల కర్ణాటక ఆర్టీసి బస్సు 19వ తేది తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో హైదరాబాద్ నుండి హౌస్‌పేట్‌కు వెళుతుండగా మక్తల్ సమీపంలోని దండు క్రాస్‌రోడ్డులో డ్రైవర్ కల్సాని అజాగ్రతవ వల్లా అదుపుతప్పి బోల్తపడింది. బస్సులో డైవర్ కల్సాని, కండక్టర్ అయ్యప్పస్వామితోపాటు మరో 17 మంది ప్రయాణికులు ఉన్నారని తెలిపారు. బస్సు బోల్తా పడినప్పటికి భగవంతుని కృపతో ఎవరికి ఎలాంటి పెద్దగాయాలు అయిన సంఘటన చోటుచేసుకోలేదని ఎఎస్‌ఐ తెలిపారు. బస్సులో ఉన్న 17 మంది ప్రయాణికులను ఆదే సమయంలో హోస్పేట్‌కు చెందిన మరో కర్నాటకు చెందిన బస్సు రావడంతో ప్రయాణికులను అట్టి బస్సులో ఎక్కించి పంపడం జరిగిందని ఎఎస్‌ఐ చెప్పారు. కండక్టర్ అయ్యప్పస్వామి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎఎస్సై యాదయ్య తెలిపారు.