మహబూబ్‌నగర్

లెక్కలు చెప్పాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, డిసెంబర్ 23: జిల్లాలోని వివిధ పాఠశాలల్లో పని చేస్తున్న, విద్యాశాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు ప్రతియేట వార్షిక ఆస్తుల వివరాలను వెల్లడించాల్సిందేనని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. అందుకు సంబంధించిన ఫారాలను జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి చేరాయి. దింతో జిల్లాలోని ఉపాధ్యాయుల్లో ఆందోళన, గుబులు మొదలైంది. ప్రతి ఉపాధ్యాయుడు తన స్థిరచారస్థుల వివరాలను వెల్లడించాలని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కమీషనర్ ఉత్తర్వులు జారీ చేయడం కలకలం రేపుతుంది. ఈ విదానాన్ని ఉపాధ్యాయులు వ్యతిరేకిస్తున్నారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం మాత్రం తాము తెచ్చిన జిఓ కాదని 1998లోనే జిఓ 52ను ఆనాటి సర్కారు జారీ చేసిందని వెల్లడిస్తుంది. అయితే ప్రస్తుతం అందులోని కొన్ని కఠినతరమైన వాటిని తాజాగా మార్పులు చేర్పులు చేస్తూ కొత్తగా ఆమలుపర్చేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ విధానంతో మహబూబ్‌నగర్ జిల్లాలో 5600 మంది ఉపాధ్యాయులు తన స్థిరచరాస్తుల వివరాలను వెల్లడించాల్సిందే. అదేవిధంగా ప్రధానంగా తనతో పాటు అంటే ఉపాధ్యాయుడితో పాటు అతనిపై ఆదారపడి ఉన్న కుటుంబసభ్యులపై ఉన్న ఆస్తులపై ఉన్న ఆస్తుల వివరాలను సైతం చూపించాలని ఉత్తర్వులను జారీ చేసింది. ఇందుకోసం ప్రత్యేకంగా నమూనాను తయారు చేసి విద్యాశాఖ అధికారులకు పంపించారు. 2017 జనవరి 10వ తేదిలోగా అందరు ఉపాధ్యాయులు ఖచ్చితంగా వివరాలు అందించాలని ఆదేశాలు జారీ చేశారు. విధానం పాతదైనప్పటికిని తెరమీదకు మాత్రం కొత్తదిగా కనబడుతుండడంతో ఈ జి ఓపై గతంలో ప్రభుత్వాలు ప్రత్యేకంగా శ్రద్ద చూపకపోవడంతో ప్రస్తుతం ఒక్కసారిగా ఉపాధ్యాయుల్లో గుబులు మొదలైంది. క్లాసిఫికేషన్ కంట్రోల్ అండ్ అప్పిల్ (సిసిఏ) 1964 నిబంధనాల ప్రకారం ప్రతి ప్రభుత్వ ఉద్యోగి తన వార్షిక ఆస్తి రాబడి ప్రకటన చేయాలి. అయితే ఇది ఉద్యోగులకు ఆమలు అవుతూ వస్తుంది. పలు కారణాలతో ఉపాధ్యాయులు వేతనం మినహా మిగిలిన ఆస్తుల వివరాలను చూపడం లేదనే విషయాన్ని పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం ప్రస్తుతం పంతుళ్లు కూడా లెక్క తప్పకుండా చేప్పాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులు లెక్కలు చెబుతుండగా ఉపాధ్యాయులకు ఎందుకు ఉపశమనమంటూ ఆనాటి టిడిపి ప్రభుత్వ హయంలో 1998లో ఫిబ్రవరి 4వ తేదిన జారీ చేసిన 52జిఓను ప్రస్తుతం కొన్ని సవరణలతో ఆమలుకు శ్రీకారం చుట్టబోతుంది. ప్రత్యేక ఫార్మట్‌లో సంబందిత ఉపాద్యాయుడికి బ్యాంకుల్లో డిపాజిట్లు, ఇతర ఆర్థిక సంస్థలు, నాన్‌బ్యాంకింగ్ సంస్థల్లో ఉన్న డబ్బుల నిలువల వివరాలు తెలపాల్సి ఉంది. బాండ్లు, షేర్లు, పోస్టల్ సేవింగ్స్, ఎల్ ఐసి పాలసీలతో పాటు రూ.50వేలకు పైగా చరాస్తులు ఎన్ని, వాహనాలు ఎన్ని, కారు, మోటర్ సైకిల్, ఇతర వాహనాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, ఎసి, టివి, రిప్రిజిరేటర్ ఇతర వస్తువులు ఉంటే ఫార్మట్‌లో పొందుపర్చాల్సిందే. వాహనాలు, బంగారు ఆభరణాలు ఇతర ఆస్తుల వాటి విలువ తప్పకుండా లెక్క చూపాల్పిందే. అదేవిధంగా ఆదాయపుపన్ను ఎంత చెల్లిస్తున్నారు. పాన్‌కార్డు నెంబర్, ఆస్తిపన్ను చెల్లింపు వివరాలు, సంబందిత ఉపాధ్యాయుడిపై ఆధారపడిన వారి వివరాలు వారు బ్యాంకు నుండి తీసుకుంటే వాటి వివరాలు, వారి ఆస్తులు, వారిపై ఉన్న అప్పులు సైతం చెప్పాల్సి ఉంటుంది. భవనాలు, ఫ్లాంట్లు వాటి వైశాల్యం, సదరు సర్వేనంబర్, డోర్‌నంబర్ ప్రస్తుత మార్కెట్ విలువ, అదనంగా ఎమైన ఆస్తులు, భూములు, డబ్బులు నిలువలు ఉంటే వాటి వివరాలు కూడా ఫార్మట్‌లో తెలపాల్సి ఉంటుంది. వ్యవసాయ, వ్యవసాయేతర భూములు సర్వే నంబర్లు, విస్తీర్ణం, తాజా మార్కెట్ విలువ ప్రకారం వివరాలను తెలపాలని రాష్ట్ర పాఠశాల విద్యాకమీషనర్ ఆదేశాలు జారీ చేశారు. మరికొన్నింటిని కూడా తెలుసుకునే ప్రయత్నం చేశారు. దింతో ఉపాద్యాయుల్లో గుబులు మొదలైంది. ఎక్కడ పదిమంది ఉపాధ్యాయులు గుమ్మిగూడితే ప్రభుత్వానికి లెక్కలు చెప్పాలని తీసుకున్న నిర్ణయంపైనే గుసగుసలు పెడుతున్నారు. ఏది ఎమైనప్పటికిని ఉపాధ్యాయుల్లో మాత్రం కలవరం మొదలైంది.