మహబూబ్‌నగర్

ఉద్దెర నాయకుల మాటలను వింటున్న సిఎం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగర్‌కర్నూల్, జనవరి 3: తమ జీతభత్యాలను వదిలి సకలజనుల సమ్మెలో భాగస్వాములై ఉద్యమం నిర్వహించిన కాంట్రాక్టు అధ్యాపకులను రెగ్యులరైజ్ చేయకుండా ఉద్దెర నాయకుల మాటలను సిఎం కెసిఆర్ వింటున్నారని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్.శ్రీనివాస్ ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రెగ్యులరైజ్ చేయాలని కోరుతూ కాంట్రాక్టు అధ్యాపకులు చేస్తున్న సమ్మె ఆరోరోజుకు చేరుకుంది. మంగళవారం దీక్షలో బండి నరసింహ్మా, ఇమ్మానువల్, నరసింహ్మారావు, రాజయ్య, యూసుఫ్ కూర్చోగా వివిధ పార్టీలు, సంఘాల నాయకులు దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. శ్రీనివాసులు మాట్లాడుతూ తెలంగాణ వస్తే తమ బతుకులు మారుతాయని ఆశించిన కాంట్రాక్టు అధ్యాపకులకు ఉద్దెర నాయకుడైన కడియం శ్రీహరి మాటలను వింటున్న సిఎం వారికి తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. సిపిఐ జిల్లా కార్యదర్శి బాల్‌నర్సింహ్మా మాట్లాడుతూ ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కళాశాలలో గత 16 ఏళ్ల నుంచి కనీస వేతనాలకు నోచుకోకుండా, ఉద్యోగ భద్రత లేకుండా సేవలందిస్తున్న కాంట్రాక్టు అధ్యాపకుల పట్ల ముఖ్యమంత్రి కెసిఆర్ చిన్నచూపు చూస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలనే నెరవేర్చాలని కోరుతున్నారనే విషయాన్ని సిఎం గుర్తించుకోవాలన్నారు. ఈ శిబిరంలో యుటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు వహీద్‌ఖాన్, నాన్ టీచింగ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం జిల్లా అధ్యక్షుడు కరణ్‌జీరావు, నాయకులు ఇమ్మానువల్, పాపయ్యయాదవ్, ఈశ్వర్, కోదండరాములు, నాగరాజు, జ్యోతి , మంజుల, రాధాకుమారి, సిపిఐ నాయకులు ఆనంద్‌జీ, కొమ్ము భరత్, స్వామి, వంకేశ్వరం శ్రీనివాసులు, కృష్ణాజీ, ఖాజా, మధు, కాశన్న తదితరులు ఉన్నారు.

యురేనియం తవ్వకాల అనుమతిని నిలిపివేయాలి
* మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి
అమ్రాబాద్, జనవరి 3: నల్లమల ప్రాంతంలోని అమ్రాబాద్, పదర మండలాలలో యురేనియం తవ్వకాల కోసం ప్రభుత్వం ఇచ్చిన అనుమతులను వెంటనే నిలిపివేయాలని సిపిఎం రాష్ట్ర నాయకుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన పదర మండల పరిధిలోని చిట్లంకుంట, పెట్రాల్‌చెన్, ఉడిమిల్ల తదితర గ్రామాలలో సిపిఎం జిల్లా నేతలతో కలిసి పర్యటించారు. ఇటీవల కాలంలో యురేనియం తవ్వకాలపై తీవ్రమైన చర్చ జరుగుతోందని, ఈ విషయంపై స్థానికులతో మాట్లాడారు. అనంతరం ఉడిమిల్లలో విలేఖరులతో మాట్లాడుతూ నల్లమల ప్రాంతంలో 2012లో జరిగిన ఉద్యమానికి అప్పటి తెలంగాణ ఉద్యమనేతలైన ప్రస్తుత ఎంపి కవిత, పలువురు నేతలు ఈ ప్రాంతంలో పర్యటించి ఈ ప్రాంత గిరిజనులకు ముఖ్యంగా ఆదివాసీలకు సంఘీభావం తెలిపారని గుర్తు చేశారు. ఈ ప్రాంతంలో ఆదివాసీలు, ఇతర వర్గాల ప్రజలతోపాటు వణ్యప్రాణులు, ఔషధ మొక్కలు అడవుల్లో ఉన్నాయని, యురేనియం తవ్వకాల మూలంగా పర్యావరణం పూర్తిగా నాశనమవుతుందని కనుక ప్రభుత్వం ఇచ్చిన అనుమతులను వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేకపోతే ఈ ప్రాంత ప్రజలతోపాటు ఆదివాసీలతో కలిసి సిపిఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను చేపడతామని ఆయన హెచ్చరించారు. ఆయన వెంట సిపిఎం జిల్లా కార్యదర్శి పర్వతాలు, దేశ్యానాయక్, ధర్మానాయక్, శంకర్, మునీలాల్ తదితరులు పాల్గొన్నారు.