మహబూబ్‌నగర్

బహుజన సమాజ స్వాప్నికురాలు సావిత్రీబాయి పూలే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మక్తల్, జనవరి 3: బహుజనులను బానిసత్వం నుండి విముక్తిగావించి సమాజానికి జ్ఞానబోధను పంచిన బహుజన సమాజ స్వాప్నికురాలు సావిత్రిబాయి పూలే అంటూ బిఎస్‌పి జిల్లా అధ్యక్షుడు కోరి మారెప్ప అన్నారు. మంగళవారం మక్తల్ పట్టణంలోని బిఎస్‌పి కార్యాలయంలో సావిత్రిబాయిపూలే 186వ జయంతి కార్యక్రమాన్ని బిఎస్‌పి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సావిత్రిబాయిపూలే చిత్రపటానికి పూలమాలలువేసి ఘననివాళులు అర్పించారు. మారెప్ప మాట్లాడుతూ దేశంలోని కుల, మత వివక్షతకు వ్యతిరేకంగా ఉద్యమించిన ఆధునిక సమాజ దార్శనికురాలు సావిత్రిబాయి పూలే అని కొనియాడారు. బాల్యవివాహాలకు, మూఢనమ్మకాలకు సతీసహగమనానికి వ్యతిరేకంగా పోరాడిన వీర వనిత సావిత్రిబాయి అని అన్నారు. వితంతువుల పునర్వివాహాల కోసం బలమైన ఉద్యమాన్ని నడిన ధీర వనిత ఆమె అంటూ కొనియాడారు. ఈ వారసత్వాన్ని రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ పొందుపరిచారని అన్నారు. భారతదేశంలో స్ర్తికి విద్య పాపం అనుకునే బ్రహ్మణీయ వ్యవస్థపై మనుధర్మ శాస్త్ర భావజాలంపై సమరశంఖం ఊది పేదప్రజలకు విద్యనందించడంలో మహోన్నతమైన కృషి చేసింది పూలే దంపతులని ఆయన కొనియాడారు. కార్యక్రమంలో బిఎస్‌పి నాయకులు చంద్రయ్య, ఆదిలింగం, అంజప్ప, మహాదేవ్, ఆనంద్, చందర్, బాలప్ప, బాల్‌రాజ్, శంకర్, నర్సింహ, ప్రకాష్, నవీన్, సాంతప్ప తదితరులు పాల్గొన్నారు.
వెల్దండ మండలంలో...
వెల్దండ: వెల్దండ, పెద్దాపూర్, రాచూర్ గ్రామాల్లో అంబేద్కర్ యువజన సంఘం ఆద్వర్యంలో తొలి మహిళ ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే 186వ జయంతిని మంగళవారం ఘనంగా జరుపుకున్నారు. ఆమె చిత్రపటానికి ఆయా సంఘాల నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళ్లు అర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు, గిరిజ, మార్కెట్ డైరెక్టర్ శ్రీనివాసులు, నాయకులు నిరంజన్, సుదర్శన్, శేఖర్, రాంమోహన్, జగన్ తదితరులు పాల్గొన్నారు.
నవాబుపేట మండల కేంద్రంలో...
నవాబుపేట: మహిళా హక్కుల సాధికారత మార్గదర్శి సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను మంగళవారం మండల కేంద్రంతో పాటు మండల పరిధిలోని పలు గ్రామాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బాన్ని పురస్కరించుకుని మండల కేంద్రంలోని మినీ తెలంగాణ భవన్‌లో, మండల పరిధిలోని కాకర్లపాడు, కోల్లూర్ గ్రామాల్లో సావిత్రిబాయి జయంతి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళ్లు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు నేతలు ఆమె మహిళ సాధికారత కోసం సుమారు 80 సంవత్సరాల క్రితం చేసిన సేవలను కొనియాడారు. మండల కేంద్రంలో నిర్వహించిన వేడుకల్లో జడ్పిటిసి ఇందిరాదేవి, మార్కెట్ కమిటీ చైర్మన్ నరసింహచారి, ఎంపిటిసి మల్లీశ్వరి, లక్ష్మయ్య, నాయకులు తాహేర్, మల్లయ్య, హన్మంతు కాకర్లపాడు నిర్వహించిన వేడుకల్లో గ్రామసర్పంచ్ జంకమ్మ, శంకర్‌నాయక్, ఉపసర్పంచ్ నరేందర్ పాల్గొన్నారు.
వివిధ సంఘాల ఆధ్వర్యంలో...
నాగర్‌కర్నూల్: ఆధునిక భారతదేశానికి మొదటి మహిళా ఉపాధ్యాయురాలు, సంఘ సంస్కర్త సావిత్రబాయిపూలే 186వ జయంతి మంగళవారం వివిధ సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బహుజన స్టూడెంట్ ఫ్రంట్, సిపియుఎస్సై, బహుజన టీచర్స్ అసోసియేషన్, కెవిపిఎస్, వ్యవసాయ కార్మిక సంఘం, ఐద్వా, ఎఐటియుసి తదితర సంఘాల ఆధ్వర్యంలో వేర్వేరుగా నిర్వహించిన కార్యక్రమాలలో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆమె జీవితంలోని ముఖ్య ఘట్టాల గురించి వివరించారు. ఇప్పటి మహిళలు ఆమె జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని సామాజిక పోరాటాలు నిర్వహించాలని కోరారు. ప్రభుత్వం ఆమె జయంతిని జాతీయ మహిళా దినంగా ప్రకటించాలని కోరారు. సిపియుఎస్సై ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు మిద్దె శ్రీరాములు, తూడుకుర్తి రవికుమార్, గూట విజయ్, గడ్డం విజయ్, ఎదిరెపల్లి కాశన్న, పరుశురాములు, ఎండి నిజాం, దశరథం, భానుప్రకాశ్, డప్పు నిరంజన్ తదితరలు పాల్గొన్నారు. బహుజన స్టూడెంట్ ఫ్రంట్ జిల్లా అధ్యక్షుడు మద్దెల బండ సాయిబాబు మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే జయంతిని జాతీయ ఉపాధ్యాయురాల దినోత్సవంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆంజనేయులు, దయాకర్, లాలు, ప్రశాంత్‌గౌడ్, శేఖర్, మధు తదితరులు పాల్గొన్నారు. బహుజన టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కొంగరి జంగయ్య, నాయకులు దేవరపాగ ప్రభాకర్, అర్జున్, కూరాకుల ఆంజనేయులు, సీతారాంనాయక్, తిరుపతయ్య, ఎఎస్సై చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. మండలంలోని పెద్దముద్దునూరులోని ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఆ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
వీపనగండ్ల కెజిబివి పాఠశాలలో..
వీపనగండ్ల: మండల కేంద్రంలోని కెజిబివి పాఠశాలలో మంగళవారం కెవిపిఎస్ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి జయంతి ఉత్సవాలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా మండల కార్యదర్శి మురళీ సావిత్రిబాయి చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో కెజిబివి ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
పాన్‌గల్ మండల కేంద్రంలో...
పాన్‌గల్: ఆధునిక భారత తొలి సామాజిక విప్లవకారుడు జ్యోతిరావు పూలే సతీమణి సావిత్రిబాయి జయంతి వేడుకలను మంగళవారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా జరుపుకున్నారు. సావిత్రిబాయి చిత్రపటానికి హెచ్‌ఎం చంద్రశేఖర్, ఉపాధ్యాయులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సావిత్రిబాయి చేసిన సేవలను విద్యార్థులకు వివరించారు. ఆమె ఆశయా సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
వనపర్తి అంబేద్కర్ చౌరస్తాలో..
వనపర్తి: పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో మంగళవారం సావిత్రిబాయి పూలే 186వ జయంతిని జెఎసి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సావిత్రిబాయి పూలే చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జెఎసి చైర్మన్ వేణుగోపాల్, కన్వీనర్ రాజారాం ప్రకాష్, సదుర్ల రమేష్, ఎన్.రాములు, అమర్‌నాథ్, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.