మహబూబ్‌నగర్

20న స్కీం వర్కర్ల సమ్మె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగర్‌కర్నూల్, జనవరి 16: దేశవ్యాప్తంగా ఉన్న అంగన్‌వాడి రంగాన్ని సంరక్షించాలని సమానపనికి సమానవేతనం ఇవ్వాలనే ప్రధాన డిమాండ్‌తో దేశవ్యాప్తంగా ఈనెల 20న స్కీం వర్కర్లు నిర్వహించే ఒక్కరోజు సమ్మెలో జిల్లాలోని స్కీం వర్కర్లంతా కూడా పాల్గొనాలని సిఐటియు జిల్లా కార్యదర్శి పొదిల రా మయ్య కోరారు. సోమవారం స్థానిక సిఐటియు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ 1970లో పసిపిల్లల ఆకలితీర్చి, బాలింతలకు పౌష్టికాహారాన్ని అందిస్తున్న అంగన్‌వాడీ రంగానికి గతంలో కేంద్ర ప్రభుత్వం 90శాతం నిధులు కేటాయించేదని, కాని ఎన్డీఎ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆ నిధులను 60శాతానికి తగ్గించి ఆ రంగం నుంచి కేంద్రం తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. ఒకవైపు సుప్రీంకోర్టు అక్టోబర్ 26న సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని తీర్పు ఇచ్చినా ప్రభుత్వాలు వాటిని ఖాతరు చేయడంలేదని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం అంగన్‌వాడీ రంగంలో నగదు బదిలీని తీసుకొచ్చేందుకు ఉత్సాహం చూపుతుందని ఆరోపించారు. ఇప్పటికైనా అంగన్‌వాడీ సంరక్షణకోసం పెద్ద ఎత్తున నిధులు కేటాయించి ఆ రంగాన్ని కాపాడాలని దేశవ్యాప్తంగా స్కీం వర్కర్లు జనవరి 20న ఒక రోజుసమ్మెలో పాల్గొనాలని కోరారు. ఐద్వా జిల్లా కార్యదర్శి కె.గీత, అంగన్‌వాడీ వర్కర్ల సంఘం వెంకటమ్మ, ఆలివేల, కౌసల్య, యాదమ్మ, ఆశ వర్కర్ల సంఘం చంద్రకళ, లక్ష్మీ, మంజుల పాల్గొన్నారు.

కోయిల్‌సాగర్‌తో పంటలను కాపాడండి

ధన్వాడ, జనవరి 16: ప్రస్తుతం యాసంగి పంటలకు కోయిల్‌సాగర్ ప్రాజెక్టు ద్వారా సాగునీరును విడుదల చేయాలని కాంగ్రెస్ పార్టీ ఓబిసి సెల్ జిల్లా అధ్యక్షుడు రాజేంధర్‌గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం మరికల్ మండల కేం ద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంను నిర్వహించారు. కార్యకర్తలను ఉద్ధేశించి కాంగ్రెస్ పార్టీ ఓబిసి సెల్ జిల్లా అధ్యక్షుడు రాజేంధర్‌గౌడ్ మాట్లాడుతూ యాసంగి పంటలకు రైతులు తూకాలను సిద్దం చేసుకోవడం జరిగిందన్నారు. రైతులు అప్పులు చేసి పంటలకు సిద్దం చేసుకున్న ప్రభుత్వం నేటికి కోయిల్‌సాగర్ ప్రాజెక్టు ద్వారా సాగునీరును విడుదల చేయలేకపోవడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కోయిల్‌సాగర్ ప్రాజెక్టు ద్వారా సాగునీరును విడుదల చేస్తామని చెప్పడంతో రైతులు ఎదురుచుస్తున్నారు. ప్రస్తుతం కోయిల్‌సాగర్ ప్రాజెక్టులో 25్ఫట్లకుపైగా సాగునీరు నిలువ ఉంది. గత సంవత్సరంలో 18్ఫట్లు నీళ్లు ఉన్న యాసంగి పంటలకు నీళ్లు విడుదల చేయడం జరిగిందని ఆయన గుర్తుచేశారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూందని ఆయన అన్నారు. రైతులకు నేటికి ప్రభుత్వం తరుపున సబ్సీడి పంపిణి చేసిన దాఖలాలు లేవన్నారు. సాగునీరును విడుదల చేయాలేనియాడల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు. పాలమూరు జిల్లాలోని ప్రతి గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గ్రామస్థాయి కమిటిలను ఏర్పాటుచేసి పార్టీ బలోపెతంకై ప్రతి కార్యకర్త తమ వంతుగా కృషి చేయాలని ఆయన కోరారు. కమిటిల నియామకం అనంతరం జిల్లా కేంద్రంలో అధ్యక్షుల, ఉపాధ్యాక్షుల ప్రమాణస్వీకారం కార్యక్రమం ఉంటుందని ఆయన తెలిపారు. అనంతరం జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో భారీ ఎత్తున సభను నిర్వహించాడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈసమావేశంలో జిల్లా డిసిసి ప్రధానకార్యదర్శి శేట్టి వీరబసంత్‌కుమార్, ధన్వాడ సింగిల్ విండో చైర్మన్ నిరంజన్‌రెడ్డి,నాయకులు లింగారెడ్డి, రాజుయాదవ్ పాల్గొన్నారు.
చేనేత వస్త్రాలనే వాడతాం

నాగర్‌కర్నూల్, జనవరి 16: ప్రభుత్వ ఆదేశానుసారం సోమవారం నిర్వహించిన ప్రజావాణికి జెసి సురేందర్‌కరణ్‌తోసహా జిల్లా అధికారులంతా కూడా చేనేత వస్త్రాలను ధ రించి హాజరయ్యారు. చేనేత వస్త్రాలను కొనుగోలు చేసి చేనేత కార్మికులను ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో ప్ర భుత్వం విధిగా చేనేత వస్త్రాలను కొనుగోలు చేయాలని, ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణికి చేనేత వస్త్రాల ను ధరించి రావాలని ఆదేశించడంతో జిల్లా కలెక్టర్ శ్రీ్ధర్ గతవారం ఇదే విషయాన్ని అన్నీ శాఖల అధికారులకు వివరించి తగిన ఆదేశాలు ఇచ్చారు. దీనితో సంక్రాంతి పండుగ సెలవుల అనంతరం ఈ సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా అధికారులంతా కూడా చేనేత వస్త్రాలను ధరించి రావడంతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మున్ముందు కూడా ఇదేవిధంగా హాజరుకావాలని, చేనేత వస్త్రాలను కొనుగోలు చేసి ప్రజలు కూడా వాటిని కొనుగోలు చేసేవిధంగా చూసి చేనేత కార్మికులను ఆదుకోవాల్సిన అవసరం ఉందని జెసి సురేందర్‌కరణ్ అన్నారు.