మహబూబ్‌నగర్

హెల్మెట్లు ధరించండి.. ప్రాణాలు కాపాడుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జడ్చర్ల, జనవరి 20: ద్విచక్ర వాహన చోదకులు తప్పని సరిగ్గా హెల్మేట్లు ధరించాలని మహబూబ్ నగర్ డిఎస్పీ బాస్కర్ తెలిపారు. శుక్రవారం రోడ్డు భధ్రత వారోత్సవాలను పురస్కరించుకొని 44 వనెంబర్ జాతీయ రహాదారిపై కావేరమ్మపేట దగ్గర వాహన చోదకులకు సేఫ్టీ డ్రైవింగ్ పై అవగాహాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్బంగా డిఎస్పీ బాస్కర్ మాట్టాడుతూ ద్విచక్ర వాహన దారులు హెల్మేట్లు,్భరీ వాహన చోదకులు సీట్ బెల్టులు తప్పని సరిగ్గావాడాలని అన్నారు. అలాగే వాహనాలు నడిపే వారు తప్పని సరిగ్గా లైసెన్స్‌లు, రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్ కాగితాలు తప్పనిసరిగ్గా కలిగి ఉండాలని అన్నారు. వాహానాలు నడిపే సమయంలో తగిన జాగ్రత్తలు పాటించడంతో పాటు రోడ్డు నియమ,నిబందనలు పాటించాలని తెలిపారు. హెల్మెట్లు ధరించకపోవడం వల్లేద్విచక్ర వాహానదారుల్లో చాలా మంది ప్రమాదాల భారిన,మృత్యుబారిన పడుతున్నారని అందువల్ల వారు తప్పని సరిగా హెల్మేట్లు ధరించే ప్రయాణం చేయాలని డిఎస్పీ తెలిపారు. ఈసందర్బంగా పోలీసులు ప్రేండ్లీ పోలిసింగ్ ద్వారా వాహాన చోదకులకు గులాబి పూలను అందించి వాహానాలను జాగ్రత్తగా నడపాలని, హెల్మెట్లను తప్పని సరిగ్గా ధరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐ గంగాధర్, ఎస్సై నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.

18 ఏళ్లు నిండిన విద్యార్థులు

ఓటరుగా నమోదు చేసుకోవాలి
* దేశ ప్రగతికి మంచి రాజకీయ సంపదను ఇవ్వాలి: కలెక్టర్ రోనాల్డ్ రోస్

మహబూబ్‌నగర్, జనవరి 20: 18 ఏళ్లు నిండిన విద్యార్థులంతా ఓటరుగా నమోదు చేసుకోవాలని మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్ తెలిపారు. శుక్రవారం మహబూబ్‌నగర్ పట్టణంలోని పాలిటెక్నిక్ కళాశాల, ఎం వి ఎస్ డిగ్రీ కళాశాలల్లో ఓటరు నమోదు అవగాహన సదస్సుకు కలెక్టర్ ముఖ్యఅతిథిగా హజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముఖాముఖి చర్చలో పాల్గొన్నారు. విద్యార్థులకు ఉన్నటువంటి అభ్యంతరాలను కలెక్టర్ నివృత్తి చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ రోనాల్డ్ రోస్ మాట్లాడుతూ 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకోవాలని ఈ నెల 25వ తేదిన జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా నూతనంగా ఓటరుగా నమోదు చేసుకున్న వారికి గుర్తింపు కార్డులు జారీ చేయడం జరుగుతుందన్నారు. విధిగా ఓటరుగా నమోదు చేసుకుని ప్రజాస్వామ్యబద్దంగా జరిగే ఎన్నికల్లో దేశ ప్రగతి కోసం మంచి రాజకీయ సంపదను ఇచ్చే నాయకులను అందించాలని అందుకు తొడ్పాటును ఇవ్వాలన్నారు. ముఖ్యంగా దేశంలో ఓ విచిత్రమైన వ్యవస్థ కొనసాగుతుందని అదిరూపుమాపాలంటే విద్యార్థులకే సాధ్యమన్నారు. భారతదేశమంటేనే ప్రజాస్వామ్యమని ప్రజాస్వామ్యంలో గ్రామాలను, దేశాన్ని పాలించే నాయకులను ఎన్నుకోవాలంటే ఓటుహక్కు తప్పనిసరి అన్నారు. అందుకే ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఉన్నటువంటి నిబంధనాల మేరకు 18 ఏళ్లు నిండిన వారంత ఓటరుగా నమోదు చేసుకోవాలన్నారు. అప్పుడే ఓటుహక్కును వినియోగించుకోవడానికి వీలు పడుతుందన్నారు. నాణ్యమైన రాజకీయ సంపద అందించాల్సిన భాద్యత ఓటరుదేనని అన్నారు. పాఠశాలలో, కళాశాలల్లో మొదటి, రెండవ బెంచీల్లో కూర్చోనే వారంత మంచిగా చదువుకునే వారని ఓ భావన ఉందని వారంత ఉద్యోగాలు వచ్చాక చట్టాలను ఆమలు చేసే భాద్యత మొదటి బెంచి వారికి ఎక్కువగా ఉంటుందన్నారు. కానీ చివరి బెంచీలో ఉన్నవారు చదువులో కొంచెం వెనుకంజలో ఉంటారని వీరే దేశంలో రాజకీయ నాయకులుగా ఉద్భవిస్తున్నారన్నారు. మంచిగా చదువుకున్న వారు కూడా మంచి నాయకులను ఎన్నుకోవడం లేదని అందుకే జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా ముఖ్యంగా విద్యార్థులు 18 ఏళ్లు నిండిన వెంటనే ఓటరుగా నమోదు చేసుకోవాలన్నారు. వెనుక బెంచీలో కూర్చున్న వారు ప్రజాప్రతినిధులుగా ఎన్నికై చట్టాలను చేసే స్థాయికి ఎదుగుతున్నారని వాటిని ఆమలు చేసే వారు మాత్రం మొదటి బెంచీలో కూర్చున్నవారు ఉంటుందన్నారు. దింతో రాజకీయాల్లో కొందరు నాయకులు నితినిజాయితీగా పని చేయడం లేదని అందుకే ఓటు వేసేటప్పుడే మంచివారిని ఎన్నుకోవాలని తెలిపారు. ప్రపంచంలో ప్రజాస్వామ్యానికి అర్థం చెప్పేది ఓటుహక్కు వినియోగించుకోవడమేనన్నారు. మద్యానికి, డబ్బుకు ఇతర వాటికి అమ్ముడు పోకుండా నిజాయితీగా ఓటు వేసిన వారే ప్రజాస్వామ్యాన్ని రక్షించిన వారు అవుతారన్నారు. ఒక్కసారి ఓటు వేయడానికి తమ ఓటును అమ్ముకుంటే ఐదేళ్లు ఇబ్బంది పడాల్సి వస్తుందన్నారు. విద్యార్థులు తమ తల్లిదండ్రులకు కూడా ఓటు విలువ గురించి తెలియజేయాల్సిన భాద్యత ఉందన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో విద్యార్థులే ముందుకు వచ్చి తమ తల్లిదండ్రులకు ఓటు విలువ గురించి చెప్పినట్లు అయితే వారు నిజాయితీగా, నితితో ఉండి సేవ చేసేవారికి మాత్రమే ఓటు వేస్తారని దాంతో ప్రజాస్వామ్యం విలువ మరింత పెరిగి నాణ్యమైన రాజకీయ సంపద అందించవచ్చారన్నారు. దేశ ప్రగతికి మంచి మార్గంపడాలంటే ఓటరు తమ విధిని మరిచిపోవద్దని తెలిపారు. ప్రస్తుతం దరఖాస్తు చేసుకున్న వారికి ఈ నెల 25న కొత్త ఓటరు గుర్తింపు కార్డును జారీ చేయడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో ప్రిన్సిపాళ్లు యాదగిరి, రవీంద్రబాబు, తహశీల్దార్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.