మహబూబ్‌నగర్

పెరిగిన వన్యప్రాణుల సంఖ్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన్ననూరు,జనవరి 21: నల్లమల అటవీ ప్రాంతంలోని అమ్రాబాద్ అభయారణ్యంలో వన్యప్రాణుల సంఖ్య ఘననీయంగా పెరిగిందని అటవీ శాఖ సంచారకులు పృద్వీరాజు అన్నారు. శనివారం మన్ననూరు అటవీ శాఖ చెక్‌పోస్టు సమీపంలోని వనమాలిక సముదాయంలో అటవీ సిబ్బందికి సిసి కెమెరాలు, వన్యప్రాణుల రక్షణపై అవగాహన కల్పించారు. గత మూడు నెలలుగా దోమలపెంట, మన్ననూర్ రేంజ్‌లలో పులులతో పాటు ఇతర వన్యప్రాణుల గణాంకాలను చేశారన్నారు. మద్దిమడుగు, అమ్రాబాద్ రేంజ్‌లలోని 35 బీట్లల్లో సిసి కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కెమెరాలలో నమోదైన అన్ని రకాల జంతువుల ఫోటోలను అధికారుల దృష్టికి తీసుకురావాలని ఆయన తెలిపారు. సిబ్బంది పనితీరుపై కమిషనర్ సంతోషం వ్యక్తం చేశారు. జింకలు, దుప్పులు, ఎలుగుబంట్లు తదితర జంతువులతో పాటు పక్షు లు నెమళ్ళు అధికంగా పెరిగాయని అన్నారు. ప్రజలు, కూలీలు, రైతులు తమ సిబ్బందికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎఫ్‌డి ఫర్గిన్,డి ఎఫ్ ఓ జోజి, రేంజర్లు కురుమూర్తి, దేవరాజు, రాణి,బీట్ ఆఫీసర్ రవి తదితరులు పాల్గొన్నారు.

ప్రైవేట్ ఆస్పత్రి సీజ్
పెద్దకొత్తపల్లి,జనవరి 21: శ్రీ లైలీ ఆయిస్మాన్ ఫ్యామిలీ ఆస్పత్రిని జాయింట్ కలెక్టర్ సురేందర్‌కరణ్, డిఎం అండ్‌హెచ్‌ఓ డాక్టర్ సుధాకర్‌లాల్ శనివారం సందర్శించి అర్హత లేని డాక్టర్ నాయుడు ఆపరేషన్ చేయడంతో మృతికి కారణమైన ఆస్పత్రిని సీజ్ చేశారు. బండరాయిపాకుల గ్రామానికి చెందిన సుల్తానమ్మ (30) అనే మహిళ గత సంవత్సరం డిసెంబర్ 2న కాన్పు కోసం ఆస్పత్రి లో చేరింది. ఆమెకు డాక్టర్ నాయుడు ఆపరేషన్ చేసి బాలుడిని తీశారు. కు టుంబ నియంత్రణ ఆపరేషన్ చేయడంతో మూత్రం రాకపోవడంతో మహిళ ఇబ్బందులకు ఎదుర్కొంది. చికిత్స నిమిత్తం తక్షణమే హైదరాబాద్‌లోని హో మిని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి సుల్తానమ్మ మృతి చెందింది. శనివారం శవాన్ని భర్త కుర్మయ్య తీసుకొచ్చి పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలోని ఆస్పత్రి ముందు ఉంచి ధర్నా చేశారు. మృతురాలి భర్త కుర్మయ్య జిల్లా కలెక్టర్ శ్రీ్ధర్, ఎస్పీ కలేశ్వర్‌సింగన్‌వారేకు ఫిర్యాదు చేయగా జాయింట్ కలెక్టర్ సురేందర్‌కరణ్, డిఎం అండ్‌హెచ్ ఓ సుధాకర్‌లాల్ వచ్చి మహిళా మృతికి కారణమైన ఆస్పత్రిని పరిశీలించి అర్హత లేని డాక్టర్ నాయుడు, డాక్టర్ విష్ణుప్రతాప్‌రెడ్డిలు ఆపరేషన్ చేయడంతో మహిళా మృతి చెందిందని తహశిల్దారు అశోక్ చే ఆస్పత్రిని సీజ్ చేయించారు. భర్త కుర్మయ్య ఫిర్యాదు మేరకు కొల్లాపూర్ సిఐ శ్రీనివాసరావు కేసు నమోదు చేశారు.