మహబూబ్‌నగర్

పాలమూరుపై కెసిఆర్‌ది సవతితల్లి ప్రేమ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగర్‌కర్నూల్, జనవరి 23: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అన్నీరకాలుగా దగా పడిన పాలమూరు జిల్లాపై సొంత రాష్ట్రంలో సైతం శీతకన్నుకు గురవుతున్నదని, అన్నీ రంగాలలో వెనుకబడిన పాలమూరు జిల్లాపై ముఖ్యమంత్రి కేసిఆర్ సవతితల్లి ప్రేమ చూపుతున్నారని బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజి మంత్రి నాగం జనార్ధన్‌రెడ్డి కేసిఆర్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సోమవారం స్థానిక ఆర్‌అండ్‌బి అతిథిగృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో నాగం మాట్లాడుతూ నిర్ధిష్టమైన ప్రణాళిక లేకుండానే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని చేపడుతున్నారని ఆరోపించారు. ఈ పథకం విషయంలో ముఖ్యమంత్రి ఒక రకంగా మాట్లాడుతుంటే, ఉన్నతాధికారులు మరోవిధంగా మాట్లాడుతూ కోర్టులకు నివేదికలను ఇస్తున్నారని అన్నారు. రోజుకు రెండు టిఎంసిల నీటిని ఈ ప్రాజెక్టుకోసం వాడుకుంటామని ముఖ్యమంత్రి చెబుతుండగా, అధికారులు ట్రిబ్యునల్‌కు ఇచ్చిన నివేదికలో రోజుకు ఒకటిన్నర టిఎంసిల నీరు వాడుకునేలా ప్రాజెక్టును రూపొందించడం జరిగిందని, మిగతా అర టిఎంసి డిండి పథకానికి ఉపయోగించుకుంటామని పేర్కొన్నారని తెలిపారు. దీనిని బట్టి పిఆర్‌ఎల్‌ఐ ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి ఏవిధంగా వ్యవహరిస్తున్నారో అర్థమవుతుందన్నారు. పిఆర్‌ఎల్‌ఐ పథకానికి రోజుకు అర టిఎంసి నీటిని తగ్గిస్తే పాలమూరు జిల్లాకు చెందిన మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు ఎందుకు నోరుమేదపడంలేదని ప్రశ్నించారు. జిల్లా రైతుల ప్రయోజనాలకు దెబ్బతిస్తున్నా ఎందుకు ప్రశ్నించడంలేదన్నారు. నార్లాపూర్, ఏదుల రిజర్వాయర్లను 4 టిఎంసిలతో నిర్మిస్తున్నారని, వీటి కింద ఒక ఎకరా ఆయకట్టుకూడాలేదని, ఎందుకు ఇంత పెద్ద రిజర్వాయర్లను నిర్మిస్తున్నారని ప్రశ్నించారు. ఈ ప్రాజెక్టుకు సంబందించి నిర్మిస్తున్న రిజర్వాయర్ల కట్ట నిర్మాణంకు మట్టి దొరకడంలేదని, కాంక్రీట్‌తో నిర్మిస్తామని కాంట్రాక్టర్లు ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేస్తున్నారని, డిజైన్ చేసే సమయంలో రిజర్వాయర్ నిర్మాణంకు అవసరమైన మట్టి అందుబాటులో ఉందాలేదా అనే విషయాన్ని పరిశీలించకుండానే డిజైన్ చేశారా అని ప్రశ్నించారు. 30 నెలల్లో ప్రాజెక్టు పూర్తి చేస్తామన్న ప్రభుత్వం 9నెలలు కావస్తున్న వందకోట్ల రూపాయల పనులు కూడా చేయలేదని, రాబోయే 21 నెలల్లో ఈ ప్రాజెక్టును ఎలా పూర్తి చేస్తారని ప్రశ్నిస్తూ కేవలం ప్రజలను మభ్యపెట్టేందుకే కేసిఆర్ ప్రకటనలు చేస్తున్నారని, ఈ ప్రాజెక్టు పూర్తి కావలనే చిత్తశుద్ది కేసిఆర్‌కు ఉంటే అవసరమైన నిధులను విడుదల చేయడంతోపాటు నిర్ధిష్టమైన ప్రణాళికతో ముందుకు వచ్చేవారని అన్నారు. ముఖ్యమంత్రికి టెండర్లు, కమిషన్లపై ఉన్న ధ్యాస నిర్మాణ పనులపై లేదని ఆరోపించారు. పిఆర్‌ఎల్‌ఐ ప్రాజెక్టు పరిధిలో ఒక ప్యాకేజికి ఇంకా టెండర్లే ఖరారు చేయలేదని, ఇప్పటికే మూడు సార్లు టెండర్లను ఆహ్వానించిన మంత్రి హరీష్‌రావుకు అనుకూలమైన కాంట్రాక్టర్‌కు రాలేదనే నెపంతో చిన్న చిన్నకారణాలు చూపెడుతూ మళ్లీమళ్లీ టెండర్లను పిలుస్తున్నారని ఆరోపించారు. కెఎల్‌ఐ ప్రాజెక్టు విషయంలో కూడా వివక్షత కొనసాగుతున్నదని, అవసరమైన రిజర్వాయర్ల నిర్మాణం ఎందుకు చేపట్టడంలేదని ప్రశ్నించారు. నాగర్‌కర్నూల్, నాగనూలుతోపాటు ఇతర చెరువులను తక్షణమే కెఎల్‌ఐ నీటితో నింపాలని, లేకపోతే బిజెపి ఆధ్యర్యంలో ఆందోళన కార్యక్రమాలను చేపడుతామని హెచ్చరించారు. ఈ విలేఖరుల సమావేశంలో సింగిల్‌విండో చైర్మన్ వెంకట్రాములు, నాయకులు కాశన్న, అర్థంరవి, నసీర్, సత్యం, లక్ష్మీనారాయణ, తదితరులు ఉన్నారు.

ప్రజలను మోసగిస్తున్న సిఎం
* కాంగ్రెస్ హయాంలోనే అభివృద్ధి
* కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే చిన్నారెడ్డి, ఎమ్మెల్సీ కూచుకుళ్ల
వనపర్తి, జనవరి23: మాటల గారడితో తెలంగాణ ప్రజలను మోసగిస్తూ కెసిఆర్ కుటుంబ పాలన కొనసాగిస్తున్నారని ఎఐసిసి కార్యదర్శి, వనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ జి.చిన్నారెడ్డి, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి అన్నారు. సోమవారం వనపర్తి మండలం నాగవరం శ్రీపద్మావతి శ్రీనివాస కళ్యాణం మండపంలో నిర్వహించిన జిల్లా స్థాయి కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో వారు మాట్లాడారు. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జిల్లాలో ప్రాజెక్టులను చేపట్టి 80శాతం పనులు పూర్తి చేశారని టిఆర్‌ఎస్ ప్రభుత్వం ‘‘వంట చేసిన తరువాత ఊదుకొని తిను’’ అన్న చందంగా పైపై పనులు చేసి తామే చేశామని చెప్పుకుంటున్నారని విమర్శించారు. మాటల గారడికి పడిపోయిన ఇతర పార్టీ కార్యకర్తలు సైతం టిఆర్‌ఎస్‌లో చేరారని తాము ఎందుకు చేరామా అని బాదపడుతున్నారని అన్నారు. వనపర్తి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది అనడానికి నేటి సమావేశానికి హాజరైన కార్యకర్తలే నిదర్శనమని అన్నారు. తాలు గింజలు పోయాయని, గట్టి గింజలు మిగిలాయని, మిగిలిపోయిన మనమంతా కష్టపడి పని చేస్తే రెండున్నర ఏళ్ల తరువాత అధికారం కాంగ్రెస్‌దేనని వారు అన్నారు. టిఆర్‌ఎస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామిలను ఏవి నెరవేర్చలేదని రెండున్నర సంవత్సరాల పాటు మాటలతోనే పబ్బం గడుపుతున్నారని విమర్శించారు. మైనార్టీలకు ఏదో చేసినట్లు మాట్లాడి పాలాభిషేకం చేయించుకుంటున్నారని, మైనార్టీలకు చేసింది ఏం లేదని వారు అన్నారు. రాష్ట్రంలో అవినీతి పాలన కొనసాగుతుందని, ఎవ్వరికి అందినంతా వారు దోచుకుంటున్నారని విమర్శించారు. కెఎల్‌ఐ నీటిని ఈ ప్రాంత ప్రజలకు కాకుండా ఇతర ప్రాంతాలకు తరలిస్తే అడ్డుకుంటామని హెచ్చరించారు. టిఆర్‌ఎస్ పాలన ‘‘అలిబాబా ఐదుగురు దొంగలు’’ అన్న చందంగా కొనసాగుతుందని అన్నారు. ఈ సమావేశంలో వనపర్తి జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ జడ్పిటిసిలు, ఎంపిపిలు, సర్పంచులు, ఎంపిటిసిలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.