మహబూబ్‌నగర్

విద్యార్థినీలు సమస్యలను ధైర్యంగా అధిగమించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, జనవరి 31: విద్యార్థినిలు తమకు ఎదురయ్యే సమస్యలను ధైర్యంగా ఎదుర్కోని భవిష్యత్తు బంగారు బాటగా మలుచుకోవాలన్న ఉద్దేశ్యంతో విద్యార్థులకు అవగాహన తరగతులను నిర్వహించి ఉత్సహపరుస్తున్నట్లు మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్ అన్నారు. మంగళవారం మక్తల్ నియోజకవర్గం మాగనూర్, నారాయణపేట నియోజకవర్గం దామరగిద్ద కస్థూర్భా గాంధీ పాఠశాలలను కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఉన్న అన్ని కెజిబివి పాఠశాలల్లో 8,9,10వ తరగతి విద్యార్థినిలకు దశల వారిగా అవగాహన పెంపొందించే కార్యక్రమాలను ఆమలు చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా మాగనూరు, నారాయణపేట, దామరగిద్ద కెజిబివి పాఠశాలల్లో ఇలాంటి కార్యక్రమాలను ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయమన్నారు. విద్యార్థినిలు కెజిబివిలో చదువుకోవడం అదృష్టంగా బావించాలని ఇలాంటి పాఠశాలల్లో చదువుకున్న విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. జిల్లాలో 1200లకుపైగా గ్రామాలు ఉన్నాయని అందులో జిల్లా చివరిలో ఉన్న కర్ణాటక సరిహద్దు గ్రామమైన మొగుల్‌మడక గ్రామాన్ని ఎంపి జితెందర్‌రెడ్డి దత్తత తీసుకోవడం గ్రామ ప్రజల అదృష్టమన్నారు. గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడంలో గ్రామస్థుల భాద్యత కూడా ఎంతో అవసరం ఉందన్నారు. గ్రామం అభివృద్ధి చెందాలంటే ఏమేమి చేయాలో చాలా మంది చెబుతారు కానీ ఆచరణలోకి వచ్చేసరికి ఎంతవరకు చేస్తారు అన్నది నిరుపించుకోవాలన్నారు. ఎవరికి దోరకని అవకాశం మొగుల్‌మడక గ్రామ ప్రజలకు దొరికిందని జిల్లా యంత్రాంగం అంతా కదిలివచ్చారని వీరందరికి సహకారం గ్రామస్థులు అందిస్తే అభివృద్ధి మరింత వేగవంతం అవుతుందన్నారు. మధ్యపాన రహిత గ్రామంగా తీర్చిదిద్దాలని గ్రామంలో ప్రతి ఒక్కరు అక్షరాస్యులుగా కావాలని, ఇంటింటికి మంచినీటి సరఫరా, 100శాతం ఇంకుడుగుంతలు, మరుగుదోడ్లు పరిశుభ్రత ఉండాలన్నారు. గ్రామంలో 600లపైచిలుకు గృహాలు, 4000లకుపైగాబడి జనాభా ఉండగా కేవలం 40 ఇళ్లల్లో మాత్రమే మరుగుదోడ్లు ఉండడం శోచనీయమన్నారు. సల్లోనిపల్లి గ్రామాన్ని ఆదర్శంగా తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో నారాయణపేట సబ్ కలెక్టర్ కృష్ణాదిత్య తదితరులు పాల్గొన్నారు.