మహబూబ్‌నగర్

పాదయాత్రలో 12 సంవత్సరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మక్తల్, ఫిబ్రవరి 7: కర్నాటకలోని సేడేం తాలూకా అడికి గ్రామానికి చెందిన 24 మంది రాఘవేంద్రస్వామి భక్తులు గత 12 సంవత్సరాలుగా మంత్రాలయానికి పాదయాత్రగా వెళుతున్నారు. అడికి గ్రామానికి చెందిన నర్సిములు ఆధ్వర్యంలో ప్రతి ఏడాది ఫిబ్రవరి మాసంలో భక్తులు మక్తల్ మీదుగా మంత్రాలయానికి వెళుతున్నారు. మంగళవారం భక్తుల పాదయాత్ర బృందం మక్తల్‌కు చేరుకుంది. ఈసందర్భంగా భక్తులు నర్సిములు విలేఖరులతో మాట్లాడుతూ కర్నాటకకు చెందిన తాము మంత్రాలయ శ్రీరాఘవేంద్రస్వామిని దర్శించుకోవడానికి గత 12 సంవత్సరాలుగా పాదయాత్రతో వెళుతున్నట్లు చెప్పారు. అడికి నుండి యానగొంది, నారాయణపేట, ఊట్కూర్, మక్తల్, మాగనూర్, కర్నాటకలోని రాయిచూర్ మీదుగా మంత్రాలయంకు చేరుకుంటామని తెలిపారు. ప్రతి ఏడాది ఫిబ్రవరి 10 తేదీలోపల రాఘవేంద్రసామిని దర్శించుకుంటామని తెలిపారు. ప్రతి ఏడాది పాదయాత్ర భక్తుల సంఖ్య పెరుగుతుందని తెలిపారు. 5 మంది భక్తులతో ప్రారంభమైన ఈసంఖ్య ఇప్పుడు 24 మంది భక్తులకు చేరుకుందని అన్నారు. ఈ పాదయాత్రలో భక్తులు రాంజీ, గోపాల్, నాగప్ప, సాయిలు, మహేందర్‌రెడ్డి, శివకుమార్, శేఖర్, వీరేష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.