మహబూబ్‌నగర్

మహాత్మా జ్యోతిరావు పూలే జీవితం ప్రపంచానికే ఆదర్శం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, ఏప్రిల్ 11: మహాత్మా జ్యోతిరావు పూలే జీవితం ప్రపంచానికి ఆదర్శమని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సోమవారం పూలే 190వ జయంతిని పురస్కరించుకుని మహబూబ్‌నగర్‌లోని అంబేద్కర్ కళాభవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హజరయ్యారు. ఆర్థిక అసమానత్వం, విద్య వివక్ష, పేదరికం వంటి వాటిని నిర్మూలించేందుకు పూలే చేసిన కృషి మరువలేనిదని, కుల, మత, రహిత సమాజ నిర్మాణానికి ఆయన ఎనలేని కృషి చేశారని అన్నారు. విద్యా పరంగా ఆర్థికంగా ఎదిగినప్పుడే సమాజం అభివృద్ధి అవుతుందని పూలే ఆశించారని ఆయన అన్నారు. జిల్లాలో అన్ని వనరులు ఉన్నప్పటికీ నిరక్షరాస్యత వల్ల అభివృద్ధి సాధించలేకపోతున్నామని, సమాజంలోని ఎస్సీ, ఎస్టీ, బిసిలకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ పథకం తీసుకున్నా మానవీయ కోణంతో కృషి చేయడం స్పష్టంగా కనిపిస్తున్నదని అన్నారు. పేదవారి లబ్ధికోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందని, విద్యలో అసమానతలు పోయినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందని, అందరు కలిసి పోరాటం చేస్తేనే నూరుశాతం అభివృద్ధి సాధ్యమని అన్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి మాట్లాడుతూ జ్యోతిరావు పూలే సమాజంలోని అన్ని వర్గాల కోసం కృషి చేసిన మహాత్ముడని అన్నారు. పూలే ఆశయాన్ని అర్థం చేసుకుని ముందుకెళ్లాలని, సమాజంలో ఉన్న 85 శాతం పేదల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని, ముఖ్యంగా బిసిలకు కూడా కళ్యాణలక్ష్మి పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. విద్యాపరంగా బిసిల అభివృద్ధికి కృషి చేస్తుందని, హాస్టళ్లలో సన్నబియ్యంతో పాటు వెనుకబడిన వర్గాలకు వివిధ పథకాల కింద సబ్సిడీ రుణాలను ఇస్తున్నట్లు తెలిపారు. మహబూబ్‌నగర్ లాంటి వెనుకబడిన జిల్లాకు పాలమూరు - రంగారెడ్డితో పాటు వైద్య కళాశాల మంజూరు చేశామని తెలిపారు. జిల్లా పరిషత్ చైర్మన్ బండారి భాస్కర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని వర్గాల అభ్యున్నతికి పాటు పడుతున్నదని అన్నారు. జిల్లా కలెక్టర్ టికె శ్రీదేవి మాట్లాడుతూ జ్యోతిరావు పూలే గొప్ప సాంఘిక సంస్కర్త అని కొనియాడారు. కులవ్యవస్థ నిర్మూలనకు కృషి చేసిన మహనీయుడని, బాలికలకు విద్య లేకపోవడం, అగ్రవర్ణాలకు మాత్రమే విద్య అందుబాటులో ఉన్న పరిస్థితులను ఎదిరించి పోరాడి మహిళా విద్యను ప్రోత్సహించడమే కాకుండా తన భార్య సావిత్రిబాయి పూలేను మొదటి మహిళ ఉపాధ్యాయురాలుగా తయారు చేసిన ఘనత జ్యోతిరావు పూలేదేనని అన్నారు. వనరుల వల్ల జిల్లా వెనుకబడలేదని, ఈ సంవత్సరం జిల్లాలో నూటికి నూరు శాతం బిసి యాక్షన్ ప్లాన్ ఆమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, బిసిల అభ్యున్నతికి జిల్లాలో బడ్జెట్‌లో ఎక్కువ కేటాయింపులు చేయాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు. సమావేశానికి అధ్యక్షత వహించిన మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ వెనుకబడిన తరగతుల వారికి అభ్యున్నతికి జ్యోతిరావు పూలే కృషి చేశారని, వారి విధానాలకు అనుగుణంగానే రాజ్యాంగం రచించారని అన్నారు. అంతకుముందు పద్మావతి కాలనీలోని పూలే విగ్రహానికి మంత్రులు, జడ్పీ చైర్మన్, జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బిసి సంక్షేమ శాఖ ద్వారా కులాంతర వివాహాలు చేసుకున్న 28 మందికి రూ.2.80 లక్షల చెక్కులను, కళాశాల విద్యార్థులకు రూ.11 లక్షల విలువ చేసే లైబ్రరీ పుస్తకాలను పంపిణీ చేశారు. అంతేకాక బిసి కార్పొరేషన్ ద్వారా 52 మంది లబ్ధిదారులకు రూ.కోటి 30 లక్షల సబ్సిడీ రుణాల చెక్కులను అందజేశారు.