మహబూబ్‌నగర్

ఇద్దరు పంచాయతీ సెక్రటరీల సస్పెన్షన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మల్దకల్, ఫిబ్రవరి 18: విధుల పట్ల నిర్లక్ష్యం..అలసత్వం వహించిన ఇద్దరు పంచాయతీ సెక్రటరీలను జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్ రజత్‌కుమార్‌షైని ఆదేశాల మేరకు సస్పెన్షన్ చేసినట్టు శనివారం ఉత్తర్వులు జారీ అయ్యాయని డిపిఓ కృష్ణ తెలిపారు. విఠలాపురం పంచాయతీ కార్యదర్శి దివాకర్‌రెడ్డి, పాల్వాయి పంచాయతీ కార్యదర్శి నర్సింహులు ఇంటి పన్నులు వసూలు, ఇటీవల బాలభవన్‌లోని అధికారుల సమావేశం నిర్వహించగా, గైర్హాజర్ కావడంతో మెమోలు జారీ చేసినా సంజాయిషీ ఇవ్వకపోవడంతో జిల్లా కలెక్టర్ వారిని సస్పెన్షన్ చేసినట్టు ఆయన చెప్పారు.
రైతుపై అడవిపంది దాడి
చిన్నచింతకుంట, ఫిబ్రవరి 18: మండల పరిధిలోని యదులాపూర్ గ్రామానికి చెందిన వెంకట్ రెడ్డి తన వ్యవసాయ పొలం వద్ద అడవి పంది ధాడి చేయడంతో శనివారం కుడికాలుకు తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం రోజువారిగా వెంకట్ రెడ్డి తన వ్యవసాయ పొలంలో మిరపపంట వద్ద ఉండగా ఆడవిపంది ధాడి చేయడంతో కుడికాలుకు తీవ్ర గాయమయి అక్కడే పడి పోయాడు. వెంటనే తేరుకొని కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా సమాచారమియ్యగా అతన్ని గ్రామానికి తరళించారు. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరళించి చికిత్సలు నిర్వహించారు. మెరుగైన వైద్యంకోసం 108లో జిల్లా ఆసుపత్రికి తరళించారు.
మొగుళ్లపల్లిలో కొండ చిలువల కలకలం
నవాబుపేట, ఫిబ్రవరి 18: అటవి ప్రాంతంలో గల మండల పరిధిలోని పర్వతాపూర్ మైసమ్మ అటవీ ప్రాంతంలో గల మొగుళ్లపల్లి గ్రామంలో శనివారం కొండచిలువలు కలకలం రేపాయి. ఒకేసారి మూడు కొండ చిలువలు గ్రామంలో కనిపించడంతో గ్రామస్థులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. గ్రామంలోని గొర్రెల కాపరులు గొర్రెలను మెపడానికై గ్రామసమీపంలోని అటవీ ప్రాంతంలోకి వెళ్లగా మూడు కొండచిలువలు ఒకే చోట కనిపించాయి. దీంతో గొర్రెల కాపరులు గ్రామస్థులకు, ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పంచాయతీ సెక్రటరీ వెంకటేశ్, ఫారెస్ట్ అధికారులు హుటాహుటిన అక్కడికి చేరుకొని కొండచిలువలను గమనించారు. అయితే వాటిని ఫారెస్ట్ అధికారులు తమ వెంట తీసుకెళ్లకుండా మళ్లీ వస్తామని అంతవరకు వాటికి కాపలా ఉండాలని గ్రామస్థులకు తెలపడంతో వారు ఉదయం నుండి సాయంకాలం వరకు కాపలాఉన్నారు. ఫారెస్ట్ అధికారుల తీరు పట్ల గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రజల ఆకాంక్ష నెరవేర్చేందుకు కృషి

ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి
నారాయణపేట, ఫిబ్రవరి 18: నారాయణపేట డివిజన్ ప్రజల ఆకాంక్షను నెరవేర్చేందుకు తనవంతు కృషి చేస్తానని నారాయణపేట ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి అన్నారు. నారాయణపేట జిల్లా సాధన కోసం జరుగుతున్న మలివిడత ఉద్యమం శనివారం నాటికి 80వ రోజుకు చేరుకోగా ఎంపి కేశవరావుతో కలసి చర్చించిన విషయాలను దీక్షలో కూర్చున్న వారితో పాటు దీక్షా శిబిరానికి చేరుకున్న నారాయణపేట ప్రజలు, జిల్లా సాధన సమితి సభ్యులు, అఖిలపక్ష నేతలకు వివరించారు. నారాయణపేట జిల్లా ఏర్పాటు అనేది ఈ ప్రాంత ప్రజల ఆకాంక్ష అని, అన్నీ అర్హతలు ఉన్న నారాయణపేటను జిల్లాగా ఏర్పాటు చేయాలని గత అసెంబ్లీ సమావేశాల్లో తాను వినిపించిన గళాన్ని మరోమారు ఎంపి కేశవరావుకు తెలియజేసినట్లు తెలిపారు. దీనికి స్పందించిన ఎంపి ఈ విషయమై ఎన్నికల కోడ్ నేపథ్యంలో తాను, ప్రభుత్వం ఎలాంటి హామీ ఇవ్వలేదని, అయితే అభివృద్ధి పథంలో నియోజకవర్గాన్ని తీసుకెళ్లాలని ఇందుకు తమ సహకారం ఉంటుందని, మరోమారు జిల్లాల పునర్విభజన జరిగితే మాత్రం మొదటి ప్రాధాన్యంగా నారాయణపేటను జిల్లాగా ఏర్పాటు చేసి తీరుతామని అన్నారని తెలిపారు. ఎన్నికల కోడ్ అనంతరం ఈ విషయమై సిఎంతో కలసి చర్చించి ఈ ప్రాంత అభివృద్ధికి సరిపడా నిధులను మంజూరు చేయించుకువస్తానన్నారు. ప్రభుత్వ పెద్దల సూచనల మేరకు జిల్లా సాధన సమితి సభ్యులు రిలేదీక్షలు వీడనాడాలని, ఈ దీక్షలకు ఇంతకాలం మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపి, దీక్షలో కూర్చున్న వారికి నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు.
కార్యక్రమంలో జిల్లా సాధన సమితి కన్వీనర్ డాక్టర్ మనోహర్‌గౌడ్, నాయకులు నాగూరావు నామాజీ, రతంగ్‌పాండురెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ గందె అనసూయ, డాక్టర్ కె.నర్సింహారెడ్డి, సుధాకర్, బి.రాము, వెంకట్రామిరెడ్డి, కాశీనాథ్, రఘువీర్‌యాదవ్, రఘురామయ్యగౌడ్, పోషల్ వినోద్, శివరాజ్, మారుతి తదితరులు పాల్గొన్నారు.