మహబూబ్‌నగర్

అలంపూర్‌లో భక్తజన సందోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అలంపూర్, ఫిబ్రవరి 24: రాష్ట్రంలో ఏకైక శక్తిపీఠమైన శ్రీ జోగుళాంబబాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాలు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శివనామస్మరణతో పులకించాయి. నవబ్రహ్మాలయాల దివ్యగామం, ప్రముఖ శైవక్షేత్రం కావడంతో వేకువ జామునుండే ఆలయాలను దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. స్వామివారి ఆలయంలో ఉదయం అభిషేకాలు, నిత్యపూజ హోమాలు, సాయంత్రం నిత్యపూజ హోమాలు, బలిహారణములు తదితర పూజా కార్యక్రమాలను నిర్వహించారు. రాత్రి శ్రీ బాలబ్రహ్మేశ్వరస్వామి వారి ఆలయంలో యామపూజలో భాగంగా మహాన్యాస పూర్వక ఏకదశ రుద్రపారాయణం, లింగోద్భవకాలంలో లఘు అభిషేకం, లఘుదర్శనం తదితర పూజా కార్యక్రమాలను నిర్వహించారు. భక్తుల కొరకు సాంస్కృతిక కార్యక్రమాలను ఇఓ గురురాజ ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాలను డిఎస్పీ బాలకోటి ఏర్పాటు చేశారు. భక్తుల సౌకర్యార్థం ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.
ఆకాశంలో శివజ్యోతి...
మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీ రామలింగేశ్వరస్వామి ఆలయ సమీపంలో భక్తులు, మహిళలు, శివస్వాములు ప్రత్యేక పూజలు నిర్వహించి శివజ్యోతిని నందికోల సేవలో మేళతాళాల మధ్య పట్టణంలోని పురవీధుల గుండా ఊరేగింపుగా శ్రీ బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయానికి తీసుకువచ్చారు. శివస్వాములు బాలబ్రహ్మేశ్వరస్వామి శిఖరం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి శివజ్యోతిని గాలిలోకి వదిలారు.
రామలింగేశ్వర సన్నిధిలో అఖండ భజనలు...
పట్టణంలోని శ్రీ రామలింగేశ్వరస్వామి సన్నిధిలో శుక్రవారం జాగరణ సందర్భంగా భక్తులు అఖండ భజన నిర్వహించారు. రాత్రి నుండి శనివారం వేకువజాము వరకు భజనలు నిర్వహించారు. జోగుళాంబగద్వాల జిల్లా విద్యాశాఖాధికారి వేణుగోపాల్, కర్నూలు ఎఆర్ డిఎస్పీ భరత్‌లు వేర్వేరుగా ఆలయాలను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
జోగుళాంబ సన్నిధిలో ఎమ్మెల్యే సంపత్
దక్షిణకాశీ శ్రీ జోగుళాంబదేవి, బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాలను శుక్రవారం సాయంత్రం అలంపూర్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ దర్శించుకున్నారు. ఎమ్మెల్యేకు ఆలయ సాంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికారు. ఆలయాలలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయనకు ఆలయ అర్చకులు శేషవస్త్రాలు సమర్పించి తీర్థప్రసాదాలు సమర్పించారు. ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ నాయకులు గడ్డం బ్రహ్మేశ్వరరెడ్డి, రుక్ముద్దీన్, పరుశరాం, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.