మహబూబ్‌నగర్

క్షయవ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగర్‌కర్నూల్, మార్చి 16: జిల్లాలోని గ్రామాలలో ముఖ్యంగా నల్లమల ప్రాంతంలోని ప్రజలకు క్షయవ్యాధిపై అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ ఇ.శ్రీ్ధర్ అన్నారు. గురువారం స్థానిక కలెక్టరేట్ ఆవరణలో వరల్డ్ విజన్ ఇండియా, అరూభ ప్రాజెక్టు అంతర్జాతీయ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్షయవ్యాధి నివారణ ప్రచార యాత్రను జిల్లా కలెక్టర్ ఇ.శ్రీ్ధర్ ప్రారంభించారు. మార్చి 29న అంతర్జాతీయ క్షయవ్యాధి దినోత్సవం సందర్భంగా ఈ ప్రచార యాత్ర నిర్వహించడం అభినందనీయమని, ప్రతి గ్రామంలోకి వెళ్లి క్షయవ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించాలని నిర్వాహకులకు సూచించారు. క్షయవ్యాధి నివారణకు చేపట్టే కార్యక్రమాలలో వైద్యసిబ్బంది, యువకులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ సుధాకర్‌లాల్ మాట్లాడుతూ కళాకారుల ఆట, పాట, మాటల ద్వారా జరిగే ప్రచార కార్యక్రమంలో వైద్య సిబ్బంది కూడా భాగస్వాములు కావాలని సూచించారు. ఆయా గ్రామాలలో జరిగే కార్యక్రమాలలో ఆయా ప్రాంతాలలో పనిచేసే వైద్య సిబ్బంది పాల్గొనాలన్నారు. అచ్చంపేట నియోజకవర్గంలోని ఉప్పునుంతల, బల్మూర్, అచ్చంపేట, లింగాల, అమ్రాబాద్ మండలాలలోని గ్రామాలలో ఈ ప్రచార యాత్ర కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారి డాక్టర్ రవిశంకర్, వివిధ శాఖాధికారులు అభిసరస్వతీబాబు, నర్సింహ్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పిడుగుపాటుకు గెదేల మృతి
* దేవరకద్రలో రెండు, గోపాల్‌పేట్‌లో ఒకటి
దేవరకద్ర, మార్చి 16: దేవరకద్ర మండల కేంద్రంలో బుధవారం రాత్రి 11సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. మండల పరిధిలోని లక్ష్మీపల్లి గ్రామంలో బుధవారం రాత్రి కురిసిన వర్షానికి ఈదురుగాలులతో పాటు పిడుగు పడడంతో అనంతరెడ్డి అనే రైతుకు చెందిన రెండు గెదేలు మృతి చెందాయి. దింతో దాదాపు రూ.50వేల నష్టం వాటిల్లినట్లు రైతు తెలిపాడు. తహశీల్దార్ విఆర్‌ఓ వెంకటేశ్వర్‌రెడ్డితో విచారణ చేయించడంతో రూ.50వేల ఆస్తినష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు. దినిపై అధికారులకు నివేదికలు ఇవ్వనున్నట్లు తహశీల్దార్ తెలిపారు.
గోపాల్‌పేట్‌లో..
గోపాల్‌పేట: మండల కేంద్రంలోన ధన్‌సింగ్‌తండాలో బుధవారం రాత్రి పిడుగు పాటుకు గెదే మృతి చెందిందని కాశీనాథ్ తెలిపారు. కాశీనాథ్ తమ ఇంటి ముందు గొలుసులతో గెదేలను కట్టేశాడు. బుధవారం రాత్రి ఉరుముగు, మెరుపులకు గ్రామానికి దూరంగా పిడుగు పడింది. ఆ సమయంలో గెదేలకు మెడలో కట్టిన ఇనుపు గొలుసులకు విద్యుత్ సరఫరా కావడంతో గెదే మృతి చెందినట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వం స్పందించి నష్టపోయిన బాధితున్ని ఆదుకోవాలని సర్పంచు పద్మ బాలరాజు కోరారు.