మహబూబ్‌నగర్

రీపోలింగ్‌కు సర్వం సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, మార్చి 18: హైదరాబాద్, ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల రి పోలింగ్‌కు అధికారులు సర్వం సిద్దం చేశారు. ఈ నెల 9వ తేదిన నిర్వహించిన పోలింగ్ సందర్భంగా బ్యాలెట్ పేపర్‌లో 12మంది అభ్యర్థులు పోటీ చేస్తుండగా అందులో ఇద్దరు అభ్యర్థుల ఫోటోలు తారుమారు కావడంతో ఈ నెల 19న రిపోలీంగ్‌కు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. దాంతో మరోసారి పోలింగ్ నిర్వహణకు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో నలుగురు కలెక్టర్లు ఎన్నికల అధికారులుగా వ్యవహరిస్తున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రోస్, నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ శ్రీ్ధర్, వనపర్తి జిల్లా కలెక్టర్ శే్వతామహంతి, జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్ రజిత్‌కుమార్ సైనిలు ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయించారు. ఉమ్మడి జిల్లాలో 57 పోలింగ్ కేంద్రాలకు గాను అందులో 49 జోగుళాంబ గద్వాల, మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్‌కర్నూల్ జిల్లాల పరిధిలో ఉన్నాయి. మిగితా 8 పోలింగ్ బూత్‌లు రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల విభజన జరగడంతో ఆయా జిల్లా పరిధిలోకి వెళ్లాయి. మహబూబ్‌నగర్ జిల్లాలో 18 పోలింగ్ బూత్‌లు, నాగర్‌కర్నూల్ జిల్లాలో 14, వనపర్తి జిల్లాలో 6, జోగుళాంబ గద్వాల జిల్లాలో 11బూత్‌లను ఏర్పాటు చేశారు. శనివారం మహబూబ్‌నగర్‌లోని అంబేద్కర్ కళాభవన్ నుండి పోలింగ్ కేంద్రాలకు బ్యాలెట్ బాక్స్‌లను గట్టి పోలీసు బందోబస్తు మధ్య తరలించారు. ఆదివారం ఉదయం 8గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. పోలింగ్ కేంద్రాలకు బాక్స్‌లను తరలిస్తున్న సమయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు, సిబ్బందికి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయా జిల్లాల కలెక్టర్లు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలను పక్బండిగా నిర్వహించాలని ఎక్కడ కూడా వివాదాలకు తావు ఇవ్వకుండా ఓటర్లు తమ ఓటుహక్కును ప్రశాంత వాతావరణంలో వినియోగించుకునేలా చూడాలని అధికారులకు సూచించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 7106మంది ఓటర్లు ఉండగా అందులో 4590మంది పురుషులు, 2515మంది స్ర్తిలు, ఇతరులు ఒకరు ఉన్నారు. ఆయా జిల్లాల ఎస్పీలు ఎన్నికల నిర్వహణకు పోలిసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇప్పటికే పోలింగ్ కేంద్రాల దగ్గర బందోబస్తును ఏర్పాటు చేయడమేకాకుండా కేంద్రాలకు బ్యాలెట్ బాక్స్‌లు వెళ్లడంతో పోలీసులు పోలింగ్ కేంద్రాల దగ్గర పటిష్టమైన నిఘాతో పాటు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మహబూబ్‌నగర్ ఎస్పీ రెమా రాజేశ్వరి శనివారం పోలీసులకు పలు సూచనలు సలహాలు ఇచ్చారు. పోలింగ్ కేంద్రాలకు 100మీటర్ల దూరం ఇతరులను పోలింగ్ కేంద్రాల వైపు రానివ్వకుండా పక్బంది చర్యలు చేపట్టాలన్నారు. ఎవరైన అల్లర్లకు పాల్పడితే అదుపులోకి తీసుకుని ఎన్నికల నియమావళి ప్రకారంగా కేసులు నమోదు చేయాలని సూచించారు. ఎన్నికల నిర్వహణలో పోలీసుల బందోబస్తు చాలా ముఖ్యమని వెల్లడించారు. కాగా ఈ నెల 9వ తేదిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు రద్దు కావడంతో నేడు రిపోలింగ్ నిర్వహిస్తున్నారు.