మహబూబ్‌నగర్

ఎస్సెస్సీ పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన సబ్ కలెక్టర్ కృషాదిత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మక్తల్, మార్చి 23: మండల కేంద్రంలోని మక్తల్ పట్టణంలో నిర్వహిస్తున్న ఎస్సెస్సీ పరీక్షా కేంద్రాలను గురువారం నారాయణపేట సబ్ కలెక్టర్ కృష్ణ్ధాత్య సందర్శించి తనిఖీ చేశారు. పట్టణంలోని 4పరీక్షా కేంద్రాలకు వెళ్లిన సబ్ కలెక్టర్ కొందరు విద్యార్థులు పరీక్షా కేంద్రాల బైట అక్కడక్కడ ఉండటంపై ఆయన ఆగ్రహం వక్తం చేశారు. సంబంధిత పరీక్షా కేంద్రాలలోని ఇన్విజిలెటర్స్‌ను విధులు సక్రమంగా నిర్వహించని పక్ష్యంలో (మిగతా 3వ పేజీలో)
(1వ పేజీ తరువాయి)వేటు తప్పదని హెచ్చరించారు. ఎక్కడ కూడా కాపియింగ్‌కు పాల్పడితే చర్యలు తప్పవన్నారు. పరీక్షా కేంద్రాల ఆవరణలో ఎవరిని కూడా రానివ్వకుండా గట్టి బందోబస్తూ నిర్వహించాలని సంబంధిత పోలీసులను సైతం ఆదేశించారు.

మండుటెండల్లోనూ కాలినడకన వెళ్లిన సబ్‌కలెక్టర్...

మక్తల్‌లోని స్థానిక ఐలీన్ పాఠశాలలలో ఏర్పాటు చేసిన 10వ తరగతి పరీక్షా కేంద్రాన్ని గురువారం సందర్శించిన నారాయణపేట సబ్‌కలెక్టర్ కృష్ణ్ధాత్య మేన్‌గేట్ నుండి వెళ్లకుండా తన వాహనాన్ని మండుటెండల్లో రోడ్డుపై వుంచి కాలినడకన పరీక్షా హాలు వెనుకభాగం నుండి వెళ్లి పరిశీలించారు. అక్కడక్కడ పరీక్షా కేంద్రం బైట నిలిచున్న యువకులపై సైతం ఆయన ఆగ్రం వ్యక్తం చేసి ఇక్కడి నుండి వెళ్లిపోవాలని చెప్పారు. మొత్తంపై పరీక్షలు ఎలాంటి కాఫియింగ్‌కు తావులేకుండా చక్కగా నిర్వహించాలని సంబంధిత పరీక్షల చీఫ్‌సూపరింటెండెంట్లకు, ఇన్విజిలెటర్లకు సూచించారు.

మార్కెట్‌లోనే విక్రయించి లాభాలు పొందాలి
వ్యవసాయ మార్కెట్ చైర్ పర్సన్ విజితారెడ్డి
కల్వకుర్తి, మార్చి 23: రైతులు తమ దాన్యాన్ని మార్కెట్‌లోనే విక్రయించి అధిక ధరలను పొందాలని కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్ చైర్ పర్సన్ విజితారెడ్డి అన్నారు. గురువారం పట్టణ కేంద్రంలో గల వ్యవసాయ మార్కెట్‌లో వేరుశెనుగ కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మార్కెట్ కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడుతూ రైతులు దళారీలకు దాన్యం విక్రయించి మోసపోవద్దని, మార్కెట్ లోనే విక్రయించాలని మార్కెట్‌లో వేరుశెనుగ క్వింటాళ్లుకు ధర 6051 రూపాయాల గరిష్టంగా ఉందని కనిష్టంగా రూ.4411లకు కమీషన్ ఎజెంట్లు కొనుగోలు చేశారని అందులో 1107 మంది రైతులు లబ్దిపొందారన్నారు. అలాగే మార్క్‌పైడ్ ద్వారా కందుల కొనుగోలు కేంద్రం నుండి 16 వేల 851 బస్తాల కందులను కొనుగోలు చేయడం జరిగిందన్నారు. కందుల కొనుగోలుకు వారం రోజుల గడువు కోరడం జరిగిందని అందుకు బ్యాగ్ లు లేక పోవడంతోనే కొనుగోలు చేయడం లేదని, మార్కెట్ అవరణలో రెండు నూతన బోర్లు మంజూరు కావడం జరిగిందని అమె పేర్కొన్నారు. అదేవిధంగా తన స్వగ్రామంలో ఈనెల 25వ తేదిన ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు సూచించారు. అమె వెంట వ్యవసాయ మార్కెట్ కార్యదర్శి సుదర్శన్‌రెడ్డి, సూపర్‌వైజర్ శ్రీనివాస్, జ్ఞానేశ్వర్, సిబ్బంది తదితరులు ఉన్నారు.