మహబూబ్‌నగర్

రెవెన్యూ ఆథీనంలో ‘పది’ పరీక్షా కేంద్రాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మక్తల్, మార్చి 24: ఈవిద్యాసంవత్సరానికి సంబంధించిన పదోతరగతి పరీక్షలు మక్తల్ మండల కేంద్రంలో సజావుగా కొనసాగుతున్నాయి. గత రెండు రోజులుగా ఈ పరీక్షలపై రెవెన్యూ శాఖ పరీక్షల నిర్వాహణను తన ఆధీనంలోకి తీసుకొని ఎలాంటి కాపియింగ్ తావులేకుండా చూస్తుంది. ఆయా మండలాల్లోని పరీక్షా కేంద్రాలలో పూర్తిస్థాయిలో రెవెన్యూ సిబ్బందిని మోహరించింది. మక్తల్ పట్టణంలోని నాలుగు పరీక్షా కేంద్రాలలో తహశీల్దార్ ఓంప్రకాష్‌తోపాటు వరప్రసాద్, సురేష్‌కుమార్ ఇద్దరు డిటిలతో సహ మొత్తం 46 మంది సిబ్బంది పరీక్షా కేంద్రాల వద్ద తమ విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఒక్కో పరీక్షా కేంద్రంలో ఓ చీఫ్‌సూపరింటెండెంట్, డిపార్ట్‌మెంటల్ అధికారులతో పాటు 11 మంది ఇన్విజిలెటర్స్ ఉన్నారు. కాగా వీరితోపాటు అధనంగా ప్రతి పరీక్షా కేంద్రంలో రెవెన్యూ శాఖకు చెందిన 4విఆర్‌ఓలు, 7గురు విఆర్‌ఎలతో కలపి 24 మంది విధులు నిర్వహిస్తున్నారు. పరీక్షా కేంద్రాలలో వాటర్ బాయిగా విద్యార్థులను కానీ, యుక్త వయస్సు ఉన్నవారిని నియమించుకోకూడదన్న స్పష్టమైన ఆదేశాలను జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రోస్ ఇవ్వడంతోటి గురువారం నుండి విఆర్‌ఎలతో పనులు చేయిస్తున్నారు. ఇంత పెద్ద ఎత్తున సిబ్బందిని చూసి విద్యార్థులు పరీక్షలు వ్రాయుటలో తీవ్ర భయాందోళనకు గురవుతున్నారని ఆయా విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆవేధనకు గురవుతున్నారు.
కుంటుపడుతున్న రెవెన్యూ శాఖ పనులు...
పదో తరగతి పరీక్షా కేంద్రాల వద్దకు మక్తల్ మండలంలోని తహశీల్దార్, డిటిలతో సహా విఆర్‌ఓలు, విఆర్‌ఎలందరు విధులు నిర్వహిస్తుండటంతోటి వివిద రెవెన్యూ పనులపై తహశీల్దార్ కార్యాలయానికి వచ్చి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఎలాంటి పనిగురించి అడిగినా తమకు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలు ఉండటంతోటి పరీక్షా కేంద్రాలకు వెళుతున్నట్లు రెవెన్యూ అధికారులు తెలియచేస్తున్నారు. మధ్యాహ్నం 2గంటల తర్వాతనే రెవెన్యూశాఖకు చెందిన పనులు అవుతున్నప్పటికి తీవ్ర ఎండల కారణంగా ప్రజలు రాలేక పోతున్నారు. రెవెన్యూ సిబ్బంది మొత్తాన్ని పదీ పరీక్షా కేంద్రాలకు తరలించడంతోటి మక్తల్ తహశీల్దార్ కార్యాలయంలో అన్ని ఖాళీ కుర్చీలే కనిపిస్తున్నాయని ప్రజలు తెలియచేస్తున్నారు.
ప్రమేయం లేని విద్యాశాఖ...
ఏపరీక్షల నిర్వాహణ అయినా విద్యాశాఖ ఆధికారులే పూర్తిస్థాయి బాధ్యత తీసుకొని ముందుండి నడిపించేవారు. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయ్యింది. తమ పనులు తాము చేయలేక ఎంతో సతమత మవుతున్న రెవెన్యూ శాఖ అధికారులు చివరి అదనపు బాధ్యతలు మోయవలసి వచ్చింది. చివరికి పది పరీక్షలపై వచ్చిన వివిధ ఆరోపణల కారణంగా రంగంలోకి దిగారు. దీంతో విద్యాశాఖా పూర్తిగా తన ప్రమేయం లేకుండా పోయినట్లైందని ప్రజలు అంటున్నారు. విద్యాశాఖ పూర్తిస్థాయిలో పరీక్షలను పకడ్బందిగా నిర్వహిస్తే రెవెన్యూశాఖ వారు ఎందుకు తలదూర్చుకుంటారని అంటున్నారు. వారి నిర్వాహణ లోపం కారణంగానే జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రోస్ జిల్లాకు చెడ్డపేరు రాకూడదని రంగంలోకి దిగినట్లు పలువులు భావిస్తున్నారు. మొత్తంపై పది పరీక్షలు అటు విద్యాశాఖ, ఇటు రెవెన్యూశాఖ, పోలీస్ యంత్రాంగంతో పూర్తిస్థాయిలో పకడ్బందీగా నడుస్తుండటంతోటి పలువురు హర్షిస్తున్నారు. మరి కొందరు విమర్శిస్తున్నారు.
నేతలకు ఊరట

ఉమ్మడి జిల్లా పరిధిలో నాలుగు అసెంబ్లీ స్థానాలు పెరిగే అవకాశం

మహబూబ్‌నగర్, మార్చి 24: గతకొంతకాలంగా అసెంబ్లీ నియోజకవర్గాల పెంపుపై ఎన్నో అనుమానాలు ఉండేవి అయితే గత వారం రోజుల నుండి కేంద్ర ప్రభుత్వం ఈ అంశాన్ని తెరపైకి తెవడంతో నేతలకు ఊరట లబించింది. అసెంబ్లీ నియోజకవర్గాలు పెరిగితే తాము ఎమ్మెల్యేలుగా పోటీ చేయడానికి అవకాశం లబిస్తుందనుకుంటున్న పలువురు నాయకులకు తీపి కబురని చెప్పవచ్చు. రాష్ట్ర పునర్ విభజన చట్టంలో ఈ అంశం ఉండడంతో ఎట్టి పరిస్థితుల్లో అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు తప్పకుండా జరుగుతుందని కేంద్ర ప్రభుత్వాలు సంకేతాలు ఇవ్వడంతో జిల్లాలో ఈ అంశంపైనే జోరుగా చర్చ జరుగుతుంది. అయితే కేంద్ర ప్రభుత్వం ఒకవేళ అసెంబ్లీ నియోజకవర్గాల పెంపుకు శ్రీకారం చుట్టినట్లు అయితే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో మరో నాలుగు అసెంబ్లీ స్థానాలు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం 14 అసెంబ్లీ స్థానాలు ఉండగా మరో నాలుగు అసెంబ్లీ స్థానాలు పెరిగితే ఆ సంఖ్య 18కి చేరుకుంటుంది. తెలంగాణ ఉద్యమ సమయంలో, రాష్ట్రం ఏర్పడ్డాక సైతం రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా పర్యటనలో భాగంగా పలు సందర్బాల్లో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో మరో నాలుగు అసెంబ్లీ స్థానాలు పెరిగితేనే పరిపాలన సౌలభ్యం ఉంటుందని పదేపదే చెప్పారు. దినిని దృష్టిలో ఉంచుకుని ఇదివరకే మహబూబ్‌నగర్ ఎంపి జితేందర్‌రెడ్డికి ముఖ్యమంత్రి కెసిఆర్ ఇచ్చిన సూచన మేరకు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో నాలుగు అసెంబ్లీ స్థానాల పెంపుపై ఓ నివేదికను తయారు చేయాలని సూచించడంతో జితేందర్‌రెడ్డి రహస్యంగా కెసిఆర్‌కు అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు ఎలా ఉండాలనే అంశంపై సూచన ప్రయమైనటువంటి నివేదిక ఇచ్చినట్లు తెలుస్తుంది. అయితే కేంద్రప్రభుత్వం అసెంబ్లీ స్థానాలు పెంచితే పార్లమెంట్ స్థానంలో ఒక్క ఓటు కూడా ఇతర పార్లమెంట్ స్థానం పరిధిలోకి రాకుండా నియోజకవర్గాల పెంపు జరగాలని సూచన ప్రయంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికల కమీషన్‌కు కూడా సూచించినట్లు తెలుస్తుంది. అదే జరిగితే మహబూబ్‌నగర్ పార్లమెంట్ పరిధిలో రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు పెరగనున్నాయి. అదేవిధంగా నాగర్‌కర్నూల్ పార్లమెంట్ పరిధిలో మరో రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు పెరిగే అవకాశం ఉంటాయి. విశ్వసనీయ సమాచారం మేరకు మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రాన్ని మూడు విభాగాలుగా విభజించి జడ్చర్ల, దేవరకద్ర, నారాయణపేట నియోజకవర్గాల్లోని మండలాలను కొన్నింటిని కలిపి రెండు అసెంబ్లీ నియోజకవర్గాలను పెంచేందుకు ఓ సూచనమైన ప్రణాళికను అధికార పార్టీ నేత కెసిఆర్ దృష్టికి ఇదివరకే తీసుకెళ్లినట్లు తెలుస్తుంది. వరంగల్ తరహలో ఈ పట్టణంలో కూడా అసెంబ్లీ స్థానం పెంచితే అభివృద్ధి జరుగుతుందనే అంచనా కూడా వేసినట్లు సమాచారం. అంతేకాకుండా నాగర్‌కర్నూల్ పార్లమెంట్ పరిధిలో సైతం వనపర్తి, కొల్లాపూర్, అలంపూర్, గద్వాల అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబందించిన కొన్ని మండలాలతో పెబ్బేర్ అసెంబ్లీ స్థానానికి శ్రీకారం చుడితే ఎలా ఉంటుందోననే విషయాన్ని సిఎం కెసిఆర్ దృష్టికి ఓ తెరాస నేత ఇది వరకు చర్చించినట్లు సమాచారం. ఇది ఇలా ఉండగా నాగర్‌కర్నూల్ పార్లమెంట్ పరిధిలో మరో అసెంబ్లీ స్థానం పెరగాలంటే కల్వకుర్తి, అచ్చంపేట, నాగర్‌కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని కొన్ని మండలాలను కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో కలిపి ఆమనగల్లు అసెంబ్లీ స్థానాన్ని పెంచితే ఎలా ఉంటుందోననే అంశాన్ని కూడా పరిశీలన చేస్తున్నట్లు తెలుస్తుంది. లేకుంటే నల్లమల అటవీ ప్రాంతంలోని కొన్ని మండలాలతో కలిపి నియోజకవర్గాన్ని సృష్టిస్తే బాగుంటుందనే అంశం కూడా తెరపైకి వస్తుంది. ఏది ఎమైనప్పటికిని రాజకీయ నాయకులు పెట్టుకున్న ఆశలకు కేంద్ర ప్రభుత్వం గ్రిన్‌సిగ్నల్ ఇస్తుందని అందుకు సంకేతాలు కూడా వెలువరించడంతో నాయకులు అసెంబ్లీ స్థానాల పెంపుపైనే దృష్టిసారించారు.

సంబురాలపై నీలినీడలు
* ఫ్రొటోకాల్ విస్మరించారని ప్రివిలైజేషన్ కమిటీకి ఎమ్మెల్యేల ఫిర్యాదు
* సంబురాలకు దూరమంటున్న అధికార, ప్రతిపక్ష కౌన్సిలర్లు
* ఎంపి కవిత రాకపై జిల్లా ఉద్యమకారుల సీరియస్
గద్వాల, మార్చి 24: పరిపాలన సౌలభ్యం కోసం నూతనంగా ఏర్పడిన కొత్త జిల్లాల్లో జోగుళాంబ గద్వాల జిల్లాకు చెందిన అధికార యంత్రాంగం ఆరు నెలల పాలన తర్వాత ఈ ప్రాంత వైభవాన్ని చాటిచెప్పేందుకు గద్వాల సంబురాలను నిర్వహిస్తున్నారు. ఈ ప్రాంతానికి చెందిన ప్రజాప్రతినిధులకు ఎలాంటి సమాచారం లేకుండా వారి సూచనలు, సలహాలు తీసుకోకుండా కలెక్టర్, ఎస్పీ ఏకపక్షంగా సంబురాలను నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఈ తరుణంలో సంబురాల ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి కెసిఆర్ గారాల పట్టి, నిజమాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత ముఖ్యఅతిథిగా హాజరవుతున్నట్టు అధికారులు వెల్లడించారు. ఈ విషయంపై ఇప్పటికే అధికారుల తీరుపై గుర్రుగా ఉన్న స్థానిక అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు జిల్లా అధికారులపై దుమ్మెత్తిపోస్తున్నారు. మున్సిపల్ కార్యాలయంలో చైర్‌పర్సన్ కృష్ణవేణి అధ్యక్షతన వైస్ చైర్మన్ శంకర్, కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ త్యాగరాజు, టిఆర్‌ఎస్ ఫ్లోర్ లీడర్ మహిమూద్‌లతో పాటు రెండు పార్టీల కౌన్సిలర్లు జిల్లా అధికారుల తీరును ఎండగట్టారు. మున్సిపల్ కమిషనర్ పట్టణంలో సమస్యలు తాండవిస్తున్నప్పటికీ పట్టించుకోకుండా శానిటేషన్ సిబ్బందిని, వాహనాలను సంబురాలకు ఏకపక్షంగా వాడుకుంటున్నారని ఆరోపించారు. అదే విధంగా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగనప్పటికీ సంబురాలు జరపాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. ఈ నెల 25 నుండి 29వ తేదీ వరకు జరిగే సంబురాలను బహిష్కరిస్తున్నట్టు కాంగ్రెస్, టిఆర్‌ఎస్ కౌన్సిలర్లు ముక్తకంఠంతో వాపోయారు. అదే విధంగా జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బండల పద్మావతి, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ గడ్డం కృష్ణారెడ్డి, మున్సిపల్ చైర్మన్ కృష్ణవేణి, వైస్ చైర్మన్ శంకర్, కాంగ్రెస్ నాయకులు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ఫ్రొటోకాల్‌ను విస్మరించి ప్రజాప్రతినిధుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్న కలెక్టర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదే విధంగా గద్వాల ఎమ్మెల్యే డికె అరుణ, అలంపూర్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌లు స్పీకర్ మధుసూదనాచారిని కలిసి ప్రివిలైజేషన్ కమిటీకి ఫిర్యాదు చేశారు. అన్ని అర్హతలు ఉన్న గద్వాలను జిల్లా చేయాలని డిమాండ్ చేస్తూ నడిగడ్డ ప్రాంత ప్రజలు వివిధ రూపాలలో ఉద్యమాలు చేసినప్పటికీ స్పందించకపోవడంతో ఎమ్మెల్యే డికె అరుణ రాజీనామాకు సిద్ధపడడంతో పాటు ఇందిరాపార్కు వద్ద రెండు రోజుల నిరాహార దీక్షకు పూనుకున్న సందర్భంలో కవిత అనుచిత వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. మూలనపడ్డ గద్వాలకు జిల్లాకు కావలసిన అర్హతలు లేవని చెప్పిన కవితను అధికారులు ఏ హోదాలో.. ఏ ఫ్రొటోకాల్ ప్రకారం సంబురాలకు ఆహ్వానించారని ప్రశ్నించారు. కేవలం అధికారులు ముఖ్యమంత్రి, మంత్రుల మెప్పుల కోసం ఈ ప్రాంత ప్రజాప్రతినిధుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే సహించేది లేదని హెచ్చరించారు. జిల్లా అధికారుల తీరుపై త్వరలోనే న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్టు కాంగ్రెస్ నాయకులు స్పష్టం చేశారు.