మహబూబ్‌నగర్

రైతులను నట్టేటముంచిన ప్రభుత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవరకద్ర, ఏప్రిల్ 3: రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఎకరా పంట కూడా ఎండనివ్వనని ప్రగల్బాలు పలికినా దేవరకద్ర నియోజకవర్గంలో కోయిల్‌సాగర్ ప్రాజెక్టుకు కూతవేటు దూరంలోనే పంటలు పోతూ రైతులు అధికారుల చుట్టూ కాళ్లకు ఉన్న చెప్పులు అరిగేలా తిరిగిన పట్టించుకోవడం లేదని వాపోయారు. దింతో చేసేది లేక రైతులు రోడ్డెక్కి ఆందోళన బాట పట్టారు. సోమవారం దేవరకద్ర పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆద్వర్యంలో రైతులు ఆందోళన కార్యక్రమాలు ఉదృతం చేశారు. అంతర్ రాష్ట్ర రహదారిపై రాస్తారోకోకు దిగారు.
ఈ సందర్భంగా దేవరకద్ర నియోజకవర్గ ఇన్‌చార్జి పవన్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ కోయిల్‌సాగర్ ప్రాజెక్టు సాగునీటి ప్రాజెక్టు అని తాగునీటి ప్రాజెక్టు కాదని అన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా 20 వేల ఎకరాలకు సాగునీరు అందించామని నీటిపారుదల శాఖ మంత్రి అనడం శోచనీయం. కానీ కేవలం నాలుగు వేల ఎకరాలకు సాగునీరు అందించడం జరిగిందని మరి మిగిలిన 16వేల ఎకరాలకు సాగునీరు ఎక్కడినుండి అందించారని ఆయన ఎద్దెవా చేశారు. నాలుగు వేల ఎకరాలకు కూడా సాగునీటిని సరైనసమయంలో అందించకలేకపోయారని తెలిపారు. ఐదుతడులకు సాగునీరు వదులుతామని జిల్లా కలెక్టర్ రైతులకు హామీ ఇచ్చి మూడు తడులకే నీటిని విడుదల చేయడం వెనుక అంతర్యాయం ఏమిటని ప్రశ్నించారు.
రైతులకు అందించే పంటరుణాలను మాఫీ చేయడంలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. అధికారులు పట్టించుకోకపోవడంతో ధర్నా రైతులను అడ్డుకునేందుకు వచ్చిన తహశీల్దార్ సిరాజోద్దిన్, పోలీసుల కాళ్లకు రైతులు నమస్కరించి తమరైన మా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి తగిన న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రాందాస్, మాజీ మార్కెట్ కమిటీచైర్మన్ అరవింద్‌కుమార్‌రెడ్డి, జిల్లా నాయకుడు మొగులన్న, చిన్నచింతకుంట మాజీ జడ్పిటిసి వేణుగోపాల్, కురుమూర్తిదేవస్థానం కమిటీ మాజీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

’బడిబాట‘లో విద్యాశాఖ
ఇంటింటికీ తిరుగుతూ ఉపాధ్యాయుల ప్రచారం
నారాయణపేటటౌన్, మార్చి 3: బడిఈడు, బడిమానిన పిల్లలను పాఠశాలల్లో చేర్పించేందుకు తలపెట్టిన బడిబాట కార్యక్రమాన్ని ప్రభుత్వం సోమవారం నుండి ప్రారంభించడంతో విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు చిన్నారుల ఇళ్లకు తిరుగుతూ వారిని పాఠశాలలకు తీసుకువచ్చి పాఠశాలల్లో చేర్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సోమవారం ఉదయం ఈ కార్యక్రమం పట్టణంతో పాటు మండలంలోని అన్నీ గ్రామాల్లో ఆయా పాఠశాలల ప్రధానోపధ్యాయులు, ఉపాధ్యాయులు ప్రారంబించారు. ప్రతి ఇంటికి వెళ్లి ఇంట్లో ఎంతమంది చిన్నారులు ఉన్నారు? అందులో పాఠశాలలకు వెళ్లేవారు ఎవరు? వెళ్లని వారు ఎవరు? బడిమానిన చిన్నారులు ఎంతమంది అని లెక్కలు వేసుకుని 1వ తరగతిలో చేరేందుకు సిద్దంగా ఉన్న చిన్నారులను తమ పాఠశాలలకు తీసుకెళ్లి పాఠశాలల్లో చేర్పించారు. ఈ కార్యక్రమం ఈ నెల 13వరకు కొనసాగనుండగా ఇప్పటికే అధికారుల వద్ద లెక్కల మెరకు జిల్లా వ్యాప్తంగా ఐదు సంవత్సరాలు నిండిన చిన్నారులు 16443మంది ఉండగా అందులో బడిబయటి పిల్లలు 1746మంది ఉన్నట్లు తెలిసింది. కాగా బడి ఈడు, బడిబయటి పిల్లలను బడిలో చేర్పించేందుకు స్థానికంగా ఉండే ప్రజాప్రతినిధులతో పాటు విద్యాకమిటీలు, ఉపాధ్యాయులు, స్థానిక రాజకీయ నాయకులతో పాటు విద్యావేత్తల సహకారం తీసుకునేలా ఇప్పటికే ప్రణాళిక రూపొందించుకున్న విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు ఆ దిశగా ముందుకు సాగుతున్నారు. నారాయణపేట నియోజకవర్గంలో 469మంది బడిబయటి చిన్నారులు ఉండగా అందులో 108మంది మాత్రమే పాఠశాలల్లో తిరిగి చేరినట్లు అధికారుల నివేదికల ఆధారంగా సమాచారం. ఏది ఏమైనా బడిబాట కార్యక్రమం ద్వారానైనా బడిఈడు, బడిబయటి చిన్నారులను బడిలో చేర్పించేలా అధికారులు ఖచ్చితమైన ఏర్పాట్లు చేసి ఈ విషయంలో సఫలీకృతులై ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చేందుకు అందరూ సహకరించాలని ఉపాధ్యాయులు కోరుతూ తమ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళుతున్నారు.

దసరాకల్లా సాగునీరు..
డిసెంబర్ నాటికి తాగునీరు
ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి
కల్వకుర్తి, ఏప్రిల్ 3: కల్వకుర్తి నియోజకవర్గ రైతులకు దసరా కల్లా సాగునీరు అందింస్తామని, డిసెంబర్ నాటికి ఇంటింటికి తాగునీరు అందించి తీరుతామని ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. సోమవారం పట్టణ కేంద్రంలో గల ప్రభుత్వ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కల్వకుర్తి నియోజకవర్గ రైతులకు సాగునీరు, మహిళలకు తాగునీరు అందించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి పట్టుదలతో ఉన్నారని, వేసవి కాలన్ని దృష్టిలో ఉంచుకొని కేవలం కల్వకుర్తి నియోజకవకవర్గాకే 6.98 కోట్ల రూపాయాలను తాగునీటి సమస్య నివారణకు కేటాయించారని, కెఎల్‌ఐ ప్రాజెక్ట్ పూర్తికి 999 కోట్ల రూపాయాలను కేటాయించారని వచ్చే దసరా నాటికి సాగునీరు, డిసెంబర్ కల్లా తాగునీరు అందిం, తీరుతామని ఆయన పేర్కొన్నారు. ఈ విలేఖరుల సమావేశంలో కల్వకుర్తి నియోజకవర్గ టిఆర్‌ఎస్ మాజి ఇన్‌చార్జి బాలాజిసింగ్, ఎంపిపి రామేశ్వరమ్మ, జడ్పీటిసి అశోక్‌రెడ్డి, వైస్ ఎంపిపి పర్వతాలు, సర్పంచ్ దామోదర్‌గౌడ్, నాయకులు సురేందర్‌రెడ్డి, మక్బుల్, విజయ్‌గౌడ్ తదితరులు ఉన్నారు.