మహబూబ్‌నగర్

హరితహారం వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, ఏప్రిల్ 26: జిల్లాలో గత సంవత్సరం హరితహారంలో నాటిన మొక్కలు వివిధ శాఖల వారిగా పూర్తి వివరాలతో పాటు బతికున్న మొక్కలను ఈ వేసివిలో నీరు అందించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రోస్ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏ ఏ ప్రదేశాలలో ఎన్ని మొక్కలు నాటారో మొక్కల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని అన్నారు. వచ్చే జూన్,జూలై నాటికి హరితహారం యాక్షన్ ప్లాన్‌ను తయారుచేసుకోవాలని తెలిపారు. జియో ట్యాగింగ్ జరగడం లేదని, జిల్లాలో బిసి హాస్టళ్లలో ప్రాథమిక పాఠశాలలో నాటిక మొక్కలను కూడా బతికించుకునేవిధంగా అధికారులు చూడాలని అన్నారు. సైట్ వారీగా యాక్షన్ ప్లాన్‌ను తయారు చేసుకుని వచ్చే హరితహారంలో ఈసారి తప్పిపోయిన వాటిస్థానంలో మొక్కలు నాటాలని తెలిపారు. గ్రామాల, మండలాల వారీగా ముందస్తు ప్రణాళికలు తయారు చేసుకోవాలని తెలిపారు. దేవాదాయశాఖ నాటిని 10వేల 500మొక్కలను బతికించుకోవాలని, దేవుని వనం ప్లెక్సీని ఏర్పాటు చేసి దేవాలయానికి వచ్చే భక్తులు విధిగా మొక్కలకు నీరు పోసినట్లు అయితే పుణ్యప్రాప్తి జరుగుతుందనే విషయాన్ని ప్లెక్సీ ద్వారా తెలియజేయాలని అన్నారు. జూన్‌లో కురిసే తొలకరి చినుకుల సమయం వరకు మొక్కలను కాపాడుకున్నట్లు అయితే లక్ష్యం నేరవేరుతుందన్నారు. గత సంవత్సరం హరితహారంలో జిల్లాలో 66లక్షల 75వేల మొక్కలను నాటడం జరిగిందని అన్నారు. బతికిన మొక్కలు, చనిపోయిన మొక్కల వివరాలు తెలుసుకుని చనిపోయిన మొక్కల స్థానంలో కొత్త మొక్కలను నాటేవిధంగా చూడాలని అన్నారు. నీటి సమస్య ఉంటే ట్రాక్టర్ల ద్వారా 5,6వారాలు నీరు అందించినట్లు అయితే మొక్కలు బతకడానికి అస్కారం ఉంటుందని తెలిపారు. గ్రౌండ్ వాటర్, అగ్రికల్చర్, హర్టికల్చర్, ఎక్సైజ్ శాఖల ద్వారా నాటిని మొక్కలను సంబంధిత అధకారులు పూర్తి బాధ్యత తీసుకుని నీరందించాలని ఆయన అన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శివకుమార్‌నాయుడు, నారాయణపేట సబ్ కలెక్టర్ కృష్ణాదిత్య, ట్రైనీ కలెక్టర్ గౌతం, డిసిహెచ్ డాక్టర్ మీనాక్షి, ఎస్పీ కార్పోరేషన్ ఎడి విజయ్‌కుమార్, డిపిఓ వెంకటేశ్వర్లు, శొశు సంక్షేమ శాఖ అధికారి గొవిందరాజులు, డిఎస్‌డిఓ సత్యవాణి, ఎక్సైజ్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఖరీఫ్ కోసం విత్తనాలు సిద్ధం
* ఎపి సీడ్స్ మేనేజర్ పురేందర్ రెడ్డి
వనపర్తి, ఏప్రిల్ 26: ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఖరీఫ్ సీజన్‌కు అవసరమైన విత్తనాలను రైతులకు కోసం సిద్ధం చేసి ఉంచామని వనపర్తి ఎపి సీడ్స్ మేనేజర్ పురేందర్ రెడ్డి అన్నారు. పాత పాలమూరు, ప్రస్తుతం వనపర్తి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, గద్వాల జిల్లాలకు వనపర్తి ఎపి సీడ్స్ నుండే రైతులకు విత్తనాలు సరఫరా చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే రైతులకు అవసరమైన విత్తనాలను అంచనా వేసి సిద్ధం ఉంచామని అవసరమైతే మరికొన్ని తెప్పించి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు. వరి విత్తనాలు మహబూబ్‌నగర్ జిల్లాకు 18వేల క్వింటాళ్లు, నాగర్‌కర్నూల్ జిల్లాకు 7800ల క్వింటాళ్లు, వనపర్తి జిల్లాకు 10వేల క్వింటాళ్లు, గద్వాల జిల్లాకు 5వేల క్వింటాళ్లు సిద్ధంగా ఉంచామన్నారు. కందులు మహబూబ్‌నగర్ జిల్లాకు వేయ్యి క్వింటాళ్లు, నాగర్‌కర్నూల్ జిల్లాకు 900 క్వింటాళ్లు, వనపర్తి జిల్లాకు 500 క్వింటాళ్లు, గద్వాల జిల్లాకు 1300 క్వింటాళ్లు, పెసరా మహబూబ్‌నగర్ జిల్లాకు 250 క్వింటాళ్లు, నాగర్‌కర్నూల్ జిల్లాకు 20క్వింటాళ్లు, వనపర్తి జిల్లాకు 100క్వింటాళ్లు, గద్వాల జిల్లాకు 200 క్వింటాళ్లు, మినుములు మహబూబ్‌నగర్ జిల్లాకు 15క్వింటాళ్లు, నాగర్‌కర్నూల్ జిల్లాకు 20 క్వింటాళ్లు, వనపర్తి జిల్లాకు 85 క్వింటాళ్లు, గద్వాల జిల్లాకు 25 క్వింటాళ్లు సిద్ధంగా ఉంచామన్నారు. వేరుశనగ విత్తనాలు మహబూబ్‌నగర్ జిల్లాకు 150 క్వింటాళ్లు, నాగర్‌కర్నూల్ జిల్లాకు 1250 క్వింటాళ్లు, వనపర్తి జిల్లాకు 1800 క్వింటాళ్లు, గద్వాల జిల్లాకు 1800 క్వింటాళ్లు, జినుగ మహబూబ్‌నగర్ జిల్లాకు వేయ్యి క్వింటాళ్లు, నాగర్‌కర్నూల్ జిల్లాకు 750 క్వింటాళ్లు, గద్వాల జిల్లాకు 650 క్వింటాళ్లు, జనుము మహబూబ్‌నగర్ జిల్లాకు 250 క్వింటాళ్లు, నాగర్‌కర్నూల్ జిల్లాకు 750 క్వింటాళ్లు విత్తనశుద్ధి చేసి సిద్ధంగా ఉంచామని మేనేజర్ తెలిపారు. సోయాబీన్, కంది, పెసరా, మినుము, వేరుశనగ విత్తనాలకు 33శాతం రాయితీతో రైతులకు అందజేస్తున్నట్లు, మొక్కజొన్న, జొన్న, సజ్జలు, సన్‌ఫ్లవర్ విత్తనాలకు కిలో ఒక్కంటికి రూ.25ల రాయితీ ఇస్తున్నట్లు తెలిపారు. అలాగే జనుము, జినుగ విత్తనాలకు 50శాతం సబ్సిడితో రైతులకు అందజేస్తామని తెలిపారు. సిద్ధం చేసిన విత్తనాలు తక్కువ అయినప్పటికి ఇతర ప్రాంతాల సీడ్స్ కార్యాలయం నుండి తెప్పించి అవసరమైన విత్తనాలను రైతులకు అందజేస్తామని తెలిపారు.