మహబూబ్‌నగర్

ఫాలమూరు ప్రాజెక్టు భూసేకరణ పూర్తి చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, ఏప్రిల్ 26: జిల్లాలో నిర్మిస్తున్న ప్రాజెక్టులకు ప్రధాన సమస్య అయిన భూసేకరణలో వచ్చే సమస్యలను అధిగమించి అనుకున్న సమయానికి భూసేకరణ పనులు పూర్తి చేయాలని జిల్లా ప్రజలకు తాగు,సాగునీరు సకాలంలో అందుతాయని జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రోస్ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జాతీయ రహదారి, రైల్వే, ఫారెస్టు భూములలో ఉన్న సమస్యలను యుద్ధ ప్రతిపాదికన ప్రణాళికలు సిద్ధం చేసి అనుకున్న సమయానికి భూసేకరణ జరపాలని తెలిపారు. పాలమూరు ఎత్తిపోతల, కర్వెన, ఉదండాపూర్ ప్రాజెక్టులకు సంబందించిన భూసేకరణకు కావల్సిన భూములకు అవార్డు ఇవ్వాలని అన్నారు. ఖానాపూర్ 180 ఎకరాలకు భూసేకరణకు సంబందించిన పనులు వెంటనే పూర్తి చేయాలని భూములు కొల్పోతున్న రైతులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం చెల్లింపులు జరుపుతామని పెర్కోన్నారు. మహబూబ్‌నగర్, పాలకొండ భూసేకరణ పనులు పూర్తి అయితే కాలువ పనులు పూర్తి చేయాలని అన్నారు. అవార్డు పాస్ చేసి భూసేకరణను యుద్ధ ప్రతిపాదికన పూర్తి చేయాలని అన్నారు. వచ్చే సమావేశానికి పూర్తిస్థాయి సమాచారంతో హాజరుకావాలన్నారు. భూసేకరణకు రెవెన్యూ అధికారులు సహకరించాలని అన్నారు. కార్యక్రమంలో జేసి శివకుమార్‌నాయుడు, నారాయణపేట సబ్ కలెక్టర్ కృష్ణాదిత్య, ట్రైనీ కలెక్టర్ గౌతం, భూసేకరణ స్పెషల్ కలెక్టర్ నవజాదేవి, ఆర్డిఓ లక్ష్మీనారాయణ, భూత్పూర్ తహశీల్దార్ జ్యోతి, సంబందిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
పిడుగుపాటుకు గొర్రెల కాపరి మృతి
బల్మూర్, ఏప్రిల్ 26: మండల కేంద్రం బల్మూర్‌కు చెందిన కొత్తపల్లి చిన్నయ్య (56) అనే గొర్రెల కాపరి బుధవారం సాయంత్రం పిడుగుపాటుకు గురై మృతి చెందాడు. మృతుడు చిన్నయ్య, అతని భార్య వీరమ్మ ఇప్పకుంట సమీపంలో గొర్రెలను మేపుతుండగా బుధవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో వచ్చిన వర్షంతో పిడుగుపడి చిన్నయ్య అక్కడిక్కడే మృతి చెందాడు. 10మీటర్ల దూరంలో ఉన్న ఆయన భార్య వీరమ్మ ఉరుములు, మెరుపుల శబ్దానికి స్పృహతప్పి పడి పోయానని, లేచి చూసే సరికి చిన్నయ్య చనిపోయి ఉన్నాడని తెలిపింది. విషయం తెలుసుకున్న ఎస్సై వెంకన్న, విఆర్వో గౌస్ సంఘటన స్థలానికి వెళ్లి పంచానామా నిర్వహించి కేసు నమోదు చేసుకున్నారు.