మహబూబ్‌నగర్

దారులన్నీ వరంగల్ వైపే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, ఏప్రిల్ 26: టిఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవ సభకు జిల్లా నుండి గులాబీ శ్రేణులు బయలుదేరడంతో రహదారులన్నీ వరంగల్ వైపు పయనిస్తున్నాయి. రోడ్లన్ని గులాబీమయంగా మారాయి. బుధవారం జిల్లా నలుమూలల నుండి విచ్చేసిన గులాబీ శ్రేణుల ట్రాక్టర్లు సాయంత్రం షాద్‌నగర్ సమీపంలోని రింగ్‌రోడ్డుకు చేరుకున్నాయి. అంతకుముందు ఉదయం మహబూబ్‌నగర్‌లో వందలాది ట్రాక్టర్లతో భారీ ఊరేగింపు నిర్వహించారు. జడ్చర్లలో కూడా వందలాది ట్రాక్టర్లతో ఊరేగింపు నిర్వహించడంతో జడ్చర్ల పట్టణమంతా గులాబీమయంగా మారింది. మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ ఆద్వర్యంలో మహబూబ్‌నగర్ పట్టణంలో భారీ ట్రాక్టర్ల ర్యాలీని నిర్వహించారు. ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ హైదరాబాద్ సమీపంలోని ఔటర్ రింగ్‌రోడ్డు వరకు చేరుకున్నారు. దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి కుటుంబసమేతంగా వరంగల్ సభకు బయలుదేరారు. భార్యపిల్లలతో కలిసి ట్రాక్టర్ నడుపుతూ అందరిని ఆకట్టుకున్నారు. ఔటర్‌రింగ్ దగ్గరకు చేరుకున్న ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా 14 నియోజకవర్గాల ట్రాక్టర్లలలో వచ్చిన తెరాస నాయకులు, కార్యకర్తలకు ఎంపి జితేందర్‌రెడ్డి, మంత్రి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌లు భోజన వసతి కల్పించారు. నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి ఇప్పటికే వరంగల్ జిల్లా సరిహద్దుకు చేరుకున్నట్లు తెలిసింది. మంత్రి జూపల్లి కృష్ణారావుసైతం స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ వందల కిలో మీటర్ల మేర అలసట చెందకుండా ట్రాక్టర్‌ను నడుపుతూ పయనించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన వివిధ నియోజకవర్గాల నుండి మంత్రులు ఇచ్చిన సమాచారం మేరకు దాదాపు 3000 ట్రాక్టర్లు బయలుదేరడం జరిగిందని తాము మొదటగా 2100ట్రాక్టర్లుగా అనుకున్నామని కానీ కార్యకర్తలు స్వయంగా తరలిరావడంతో అదనంగా మరికొన్ని ట్రాక్టర్లు ఏర్పాటు చేసినట్లు తెరాస వర్గాలు తెలిపాయి. కాగా జడ్చర్లలో జరిగిన ర్యాలీలో మంత్రులు లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌లు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఔటర్‌రింగ్ రోడ్డు దగ్గర ఏర్పాటు చేసిన భోజనం విరామం తర్వాత మంత్రులు లక్ష్మారెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఎంపి జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీనివాస్‌గౌడ్, ఆల వెంకటేశ్వర్‌రెడ్డిలు మాట్లాడుతూ వరంగల్ ప్రగతి నివేదిక సభ ద్వారా తెలంగాణ ప్రజల్లో మరింత దగ్గర అవుతామని దేశంలో ఎక్కడ లేనివిధంగా ఇంతపెద్ద బహిరంగసభ కేవలం ట్రాక్టర్ల ద్వారానే వెళ్లడం గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కూడా జరగలేదన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో జాతరలకు ప్రజలు వెళ్లే విధంగా ట్రాక్టర్లలో వెళ్తుంటో ఎంతో అనుభూతి పొందుతున్నామని తెలిపారు. బంగారు తెలంగాణ నిర్మాణానికి వరంగల్ సభ వేదిక కాబోతుందని వెల్లడించారు. అభివృద్ధిలో తెలంగాణ దూసుకుపోతుందని అందుకే ప్రగతి నివేదిక సభకు పెద్ద ఎత్తున రైతులు తరలివస్తున్నారని వెల్లడించారు. వరంగల్ సభతీరును వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ప్రత్యేకంగా సమాచారం తెప్పించుకుంటున్నారని దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఏ ప్రాంతీయ పార్టీ కూడా ఇలాంటి సహసోపేతమైన నిర్ణయాలు తీసుకోలేదని తెలిపారు. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి 10లక్షల ఎకరాలకు సాగునీరు తప్పకుండా అందుతుందని పాలమూరు జిల్లాకు తిరిగి వలసలు వచ్చే రోజు వచ్చిందని ఇప్పటికే పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి 4లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వడంతోపలు నియోజకవర్గాల్లోని వ్యవసాయ మార్కెట్లలలో దాన్యం రాశులుగా రైతులు పోసుకోవడం సంతోషించదగ్గ విషయమన్నారు. రైతు ఆర్థికంగా ఎదిగినప్పుడే రాష్ట్రానికి మంచిపేరు వస్తుందని తెలిపారు. ఏది ఎమైనప్పటికిని వరంగల్ సభకు జిల్లా నుండి తెరాస శ్రేణులు ట్రాక్టర్లపై బయలుదేరడంతో జిల్లాలోని రహదారులన్ని గులాబీమయం అయ్యాయి.