మహబూబ్‌నగర్

‘కాంగ్రెస్‌కు మళ్లీ పూర్వవైభవం తథ్యం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, ఏప్రిల్ 29: కాంగ్రెస్ పార్టీకి మళ్లీ పూర్వ వైభవం వస్తుందని టిఆర్‌ఎస్ పార్టీ మునిగిపోయే నావా అని మహబూబ్‌నగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఉబెదుల్లా కొత్వాల్ అన్నారు. శనివారం మహబూబ్‌నగర్ పట్టణ కాంగ్రెస్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడిగా లక్ష్మణ్‌యాదవ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా వినోద్‌కుమార్, బిసి సెల్ పట్టణ అధ్యక్షుడిగా విజయ్‌కుమార్, నియోజకవర్గ సమన్వయకర్తగా రావుల అనంతరెడ్డిలను నియమిస్తూ వారికి డిసిసి అధ్యక్షుడు కొత్వాల్ నియమాక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో డిసిసి అధ్యక్షుడు కొత్వాల్ మాట్లాడుతూ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా ఉందని రాబోయే ఏ ఎన్నికల్లోనైన పార్టీ అభ్యర్థులు గెలిచి తీరుతారన్నారు. గ్రామస్థాయి నుండి మరింత పార్టీని పటిష్టపరిచేందుకు జిల్లా నాయకత్వంతో పాటు పట్టణ, మండల స్థాయి నాయకులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో టిఆర్‌ఎస్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని ప్రజల్లో ముఖ్యమంత్రి కెసిఆర్‌పై తీవ్ర వ్యతిరేకత మొదలైందని గ్రామస్థాయిలో ప్రజలు ఎదుర్కోంటున్న సమస్యలపై నాయకులు ఎక్కడిక్కడ స్పందించాలన్నారు. మహబూబ్‌నగర్ పట్టణంలో బూత్‌ల వారిగా కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల కార్యక్రమాలు కూడా విస్తృత పర్చాలన్నారు. యువజన కాంగ్రెస్,మహిళా కాంగ్రెస్, కిసాన్ సెల్ కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహిస్తే టిఆర్‌ఎస్ పార్టీ రాబోయే ఎన్నికల్లో ఘోర పరాజయం తప్పదన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులపై టి ఆర్ ఎస్ మంత్రులు చేస్తున్న విమర్శలు అర్థరహితమైనవని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రెండు పార్లమెంట్ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాదిస్తుందని దీమా వ్యక్తం చేశారు. కొందరు డబ్బుల ఆశ కోసం పదవులను కాపాడుకోవడానికి పార్టీలు మారారని అయితే టిఆర్‌ఎస్‌లో చేరాక ఇమడలేకపోతున్నారని ఎద్దెవా చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత స్వేచ్చ, టిఆర్‌ఎస్‌లో లేకపోవడంతో ఎటు తెల్చుకోలేక పోతున్నారని విమర్శించారు. కొందరు ఇప్పటికే తిరిగి కాం గ్రెస్ గూటికి వస్తామని కోరుతున్నారని తగిన సమయంలో అలాంటి వారిని పార్టీలోకి తీసుకుంటాము తప్పా. ఇప్పట్లో సాధ్యం కాదన్నారు. ప్రస్తుతం ఉన్న కమిటీ సభ్యులు పార్టీ సిద్దాంతాలకు అనుగుణంగా పనిచేయాలని, పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిసిసి నాయకులు ముత్యాల ప్రకాష్, రంగారావు, నాయకులు బెనహర్, పటేల్ వెంకటేష్, కట్ట రవికిషన్‌రెడ్డి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పద్మజాయాదవ్, మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షుడు జహిర్ అక్తర్, బిసి సెల్ అధ్యక్షుడు రాజేందర్‌గౌడ్, ఎస్టీ సెల్ అధ్యక్షుడు లింగం నాయక్ తదితరులు పాల్గొన్నారు.