మహబూబ్‌నగర్

దేవాలయాలకు మహర్దశ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెల్దండ, ఏప్రిల్ 29: తెలంగాణ రాష్ట్రంలోని దేవాలయ నిర్మాణాలు పునర్ నిర్మాణాలకు ప్రభుత్వం వేల కోట్ల రూపాయల నిధులను వెచ్చిస్తోందని సమైఖ్య రాష్ట్రంలో తె లంగాణ దేవాలయాలకు అదరణ కరువైందని, దేవాలయ నిర్మాణాలకు ప్రజలు ముందుకోస్తే నిదులు మంజూరు చేస్తామని రాష్ట్ర దేవాదయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. శనివారం మండల పరిదిలోని చొక్కన్నపల్లి గ్రామంలో రూ.40లక్షలతో నూతనంగా నిర్మించిన శ్రీసీతారాముల కళ్యాణ మండపాన్ని మంత్రి ఇంద్రకరన్‌రెడ్డి,ఎమ్మెల్సీ కసిరెడ్డి నారయణరెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆలయకమిటి చైర్మన్ ద్యాప వెంకట్‌రెడ్డి అద్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి మాట్టాడుతూ సమైఖ్య రాష్ట్రంలో తెలంగాణ దేవాలయాలకు అదరణ, నిదులు కరువని ప్రస్తుత ప్రభుత్వం హయంలో మునుపెన్నడు లేనంతగా నిదులు మంజూరు చేసి నిర్మాణాలు పునర్‌నిర్మాణాలు చేపట్టి మహర్దశ తెచ్చి పెడుతుందన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో దళితవాడల్లో దేవాలయ నిర్మాణాలకు కేవలం రూ.3లక్షలను కేటాంచిందని టిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజలు రూ.2.50లక్షల వాటా చెల్లిస్తే అదనంగా రూ.10లక్షలను మంజూరు చేస్తుందన్నారు. గత సమైఖ్య పాలనలో దేవాలయాల పేరు చెబితేనే అంద్ర ప్రాంత దేవాలయాలు పేరు చెప్పే వారని ప్ర స్తుతం స్వరాష్ట్రంలో తెలంగాణ దేవాలయాలైన యాద్రాది, భద్రాది, వేములవాడ, కోమరవెల్లిమల్లన్న దేవాలయాల పునర్ నిర్మాణాలకు ప్రభుత్వం బడ్జెట్ లో పెద్దపీట వేసి వేల కోట్ల రూపాయలను మీంజూరు సేసిందన్నారు. రాష్ట్ర ప్రజలు ఎల్లప్పుడు సుఖసంతోషాలతో ఉండాలని భక్తి భావం కల్గిన ముఖ్యమంత్రి కెసిఅర్ దేవాలయ నిర్మాణాలకు అత్యదిక ప్రాదన్యతను ఇస్తున్నారని చెప్పారు. గత పుష్కారాలకు దీటుగా స్వరాష్టంలో పుష్కారాలను నిర్వహించి లక్షాలాది పుణ్యస్థానాలు అచరించేవిదంగా చేస్తామన్నారు. ప్రతి దేవాలయాబివృద్దికి ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.50వేలకోట్లు వెచిస్తుందని తెలిపారు. భక్తులకు దేవాలయాల్లో ఎక్కడ కూడా అసౌర్యం కల్గకుండా ఎర్పాట్లు పూర్తి చేయడం జరిగిందన్నారు. ముఖ్యంగా మహిళల పూ జాలు,పునఃస్కరాల వల్లనే కుటుంబాలు అన్నింట్లా రాణించగల్గుతున్నాయని అయన అన్నారు.రాష్ట్రంలో పంటలు సమృద్దిగా పండాలని ముఖ్యమంత్రి కోరుకుంటున్నారని దానిలో బాగంగానే వచ్చే ఎడాది జూన్ నుంచిరెండు పంటలకు గాను పంటల పెట్టుబడులకు రూ.8వేలను చెల్లించనున్నట్టు తెలిపారు. రైతులకు 9గంటలపాటు నిరాటకంగా విద్యుత్ ను సరపరా చేయడంతో పాటు పెడింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో మందుకెళ్ళుతుందని గుర్తుచేశారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుల పూర్తితో ఈప్రాంతమంతా పచ్చడిపోలాలతో కళకళాలాడనుందన్నారు. వర్షాపునీరు సముద్రం పాలు కాకుండా అవసరమైన చోట్లా ఎక్కడక్కడ రిజర్వేయర్లను నిర్మింసున్నట్లు మంత్రి తెలిపారు. సాగు,తాగునీటి సమస్య భవిష్యత్తులో తలెత్తకుండా లక్షలా కోట్ల రూపాయలతో పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి,మిషన్ భగీరథ వంటి బృహత్తర పథకాలతో తీర్చనుందన్నారు. డిసెంబర్ నాటికి ప్రతి ఇంటికి తాగునీరుందిస్తామని తెలిపారు. అనంతరం దక్షణకాశిగా ప్రసిద్ది చెందిన గుండాల అంబరామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేకపూజలు నిర్వహించారు. దేవాలయ పునర్‌నిర్మాణానికి కోటి రూపాయలకు పైగా నిదులు మంజూరు చేస్తానని హమీనిచ్చారు. మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, మార్కెట్‌చైర్మన్ ద్యాపవిజితారెడ్డి, గోళి శ్రీనివాస్‌రెడ్డి,బాలాజీసింగ్,ప్రజాప్రతినిదులు వెంకటమ్మ,రాజశేఖర్,మోహన్‌రెడ్డి,పర్వాతాలుగౌడ్.లక్ష్మి,జంగయ్యయాదవ్,నాయకులు భూపతిరెడ్డి,సంజీవ్‌కుమార్‌యాదవ్,గోపాల్‌రెడ్డి ,ఐజక్,దామోదర్‌రెడ్డి,అదికారులు సైదులు,కృష్ణ పాల్గొన్నారు.