మహబూబ్‌నగర్

మాయమాటలతో కాలం వెళ్లదీస్తున్న ముఖ్యమంత్రి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆత్మకూరు, మే 16: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఎన్నికల హామీలను నెరవేర్చకుండా మాయమాటలతో కాలం వేలదీస్తున్నారని బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు నాగం జనార్దన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆరోపించారు. మంగళవారం అమరచింత మండల కేంద్రంలో జరిగిన మండల స్థాయి కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గడిచిన మూడు సంవత్సరాలుగా పేద ప్రలజకిచ్చిన వాగ్ధానాలను నెరవేర్చకుండానే పూటకో మాట చెబుతూ కాలం వెళ్ళదీస్తున్నారని, కేంద్ర ప్రభుత్వ నిధులను పక్కదారి పట్టించడమే కాకుండా ఓట్ల రాజకీయాలతో పబ్బం గడుపుకుంటున్నారని ఆయన ధ్వజమెత్తారు. రైతులకు రుణమాఫీ పథకాన్ని అమలు చేసినప్పటికి వడ్డీలకే సరిపోవడం లేదని మరోమారు ఎకరాకు రూ.4వేల చొప్పున రెండు పంటలకు చెల్లిస్తామని సిఎం రైతులను మోసం చేసేందుకు ఎత్తులు వేస్తున్నారని ఆయన ఆరోపించారు. 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి రావడం ఖాయమని అందుకు కార్యకర్తలు అనునిత్యం ప్రజలతో మమేకమవుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరించాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. ఈనెల 20న బిజెపి జాతీయ అధ్యక్షులు రాష్ట్రంలో పర్యటించిన అనంతరం రాష్ట్ర రాజకీయాలల్లో పెనుమార్పులు చోటు చేసుకోవడం ఖాయమన్నారు. అధికార టిఆర్‌ఎస్ పార్టీకి బిజెపి మాత్రమే ప్రధాన ప్రతిపక్షంగా మారడం ఖాయమన్నారు. కార్యక్రమానికి మండల బిజెపి అధ్యక్షులు విజయ్‌కుమార్ అధ్యక్షత వహించగా, కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు ప్రభాకర్‌రెడ్డి, ఉపాధ్యక్షులు నాగభూషణంగౌడ్, నాయకులు రాజు, నారాయణ, కృష్ణయ్య, అశోక్‌కుమార్, ప్రకాష్, అనిల్, కార్యకర్తలు పాల్గొన్నారు.

మిషన్ భగీరథ పనులను పరిశీలించిన కలెక్టర్
కోడేరు, మే 16: మండల పరిధిలోని పస్పుల, బావాయిపల్లి గ్రామాల పరిధిలో జరుగుతున్న మిషన్ భగీరథ పనులను జిల్లా కలెక్టర్ శ్రీ్ధర్ మంగళవారం పరిశీలించారు. సకాలంలో పనులు పూర్తయ్యేవిధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వ్యవసాయ పనులలో రైతులకు ఎలాంటి ఆటంకాలు కలుగకుండా అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఒంటరి మహిళల దరఖాస్తులపై ప్రత్యేక శ్రద్ద వహించాలని కలెక్టర్ కృష్ణయ్యను ఆదేశించారు.
రైతులకు చెక్కుల పంపిణీ
మిషన్ భగీరథ కింద భూములు కోల్పొయిన 120 మంది రైతులకు నష్టపరిహారం కింద రూ.8.26లక్షల విలువ చేసే చెక్కులను తహశిల్దార్ కృష్ణయ్య బావాయపల్లి రైతులకు అందచేశారు.