మహబూబ్‌నగర్

ప్రైవేట్ పాఠశాలల్లో.. ఫీజు దోపిడీని అరికట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గద్వాలటౌన్, జూన్ 19: జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల్లో అధిక ఫీజులను వసూలు చేస్తూ పేద విద్యార్థులను దోపిడీకి గురి చేస్తున్నారని ఎబివిపి జిల్లా కన్వీనర్ నాగరాజు, వెంకటేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా విద్యాశాఖాధికారి వేణుగోపాల్‌కు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలల యజమాన్యాలు విద్యతో వ్యాపారం చేస్తూ, పుస్తకాలు, బ్యాగులు, డ్రస్సులు ఏజెన్సీల పేరుతో కోట్ల రూపాయలు దోపిడీ చేస్తున్నారన్నారు. విద్యాహకుక చట్టం ప్రకారం ప్రైవేట్ విద్యాసంస్థల్లో బలహీన వర్గాల పేద విద్యార్థులకు 25 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయడం లేదన్నారు. దీంతో ప్రైవేట్ యాజమాన్యాలు వేలకు వేలు ఫీజులు వసూలు చేసి పేద విద్యార్థుల నడ్డి విరుస్తున్నారని చెప్పారు. టెక్నో, ఈ-టెక్నో, ప్లేస్కూల్ తదితర కొత్తకొత్త పేర్లతో తల్లిదండ్రులను మభ్యపెట్టి అధిక వసూలు వసూలు చేస్తున్నట్టు వాపోయారు. ఇప్పటికైనా విద్యాశాఖాధికారులు స్పందించి ఇష్టానుసారంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలపై తగు చర్యలు తీసుకోవాలని వారు కోరారు. సమావేశంలో నంద, ప్రసాద్, గోపి, నరసింహా, శంకర్ పాల్గొన్నారు.
తెలంగాణది సెక్యూలర్ ప్రభుత్వం
* రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖమంత్రి లక్ష్మారెడ్డి

మహబూబ్‌నగర్, జూన్ 19: ముస్లింలకు ప్రభుత్వం పూర్తిగా అండగా ఉం టుందని రాష్ట్రంలో సెక్యూలర్ ప్రభుత్వం ఉన్నందునే అన్ని వర్గాల ప్రజల పం డుగలను గౌరవించి అందుకు ప్రత్యేక నిధులు విడుదల చేస్తున్న ఘనత ము ఖ్యమంత్రి కెసిఆర్‌కే దక్కిందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖమంత్రి లక్ష్మారెడ్డి అన్నా రు. సోమవారం జడ్చర్ల నియోజకవర్గంలోని ముస్లింలకు మంత్రి ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ప్రభుత్వపరంగా ఏర్పాటు చేసిన ఈ ఇఫ్తార్ విందులో మిడ్జిల్, జడ్చర్ల మండలాలకు సంబందించిన వందలాదిమంది ముస్లీంలు ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జడ్చర్ల పట్టణంలోని చంద్రగార్డెన్స్‌లో నిర్వహించిన ఇఫ్తార్ విందుకు మంత్రి లక్ష్మారెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని ముస్లీంలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేసి రంజాన్ మాసంలో నిర్వహించే ఇఫ్తార్ విందులు ఎంతో పవిత్రమైనవని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ తెలంగాణలో సెక్యూలర్ ప్రభుత్వం కొనసాగుతుందని అందుకే అన్ని వర్గాల ప్రజలు తమ తమ పండుగలను జరుపుకుంటుంటే వాటిని గౌరవించడానికే ప్రభుత్వం కొంత చేయూతను అందిస్తుందని తెలిపారు. ప్రజలు ఎదైతే పండుగలతో తమభావాలను వ్యక్తపరుచుకుంటారో సంతోషంగా ఉంటారో వాటికి అనుగుణంగా ప్రభుత్వాలు నడుచుకుంటేనే పండుగలను గౌరవించినట్లుగా భావించిన ముఖ్యమంత్రి అన్ని మతాలకు సంబందించిన వారి ప్రముఖ పండుగలను ప్రభుత్వం కూడా నిర్వహిస్తుందన్నారు. ముస్లీంలు అత్యంత పవిత్రంగా భావించే రంజాన్ పండుగను దృష్టిలో పెట్టుకుని ముస్లీంలకు ప్రభుత్వమే ఇఫ్తార్ విందులను ఇస్తుందని తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ రోనాల్డ్‌రోస్, మాజీ టిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
బాధ్యతతో పని చేస్తేనే అభివృద్ధి
* కలెక్టర్ శ్రీ్ధర్

లింగాల, జూన్ 19: ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ, అభివృద్ది పథకాలు సరైన విధంగా అమలయ్యేటట్లు జిల్లా యంత్రాంగం బాధ్యతతో పనిచేస్తేనే అభివృద్దిలో జిల్లా ముందంజలో ఉంటుందని జిల్లా కలెక్టర్ శ్రీ్ధర్ అన్నారు. సోమవారం స్థానిక మినీ గురుకులం పాఠశాల, ప్రభుత్వ ఆస్పత్రిలను ఆకస్మికంగా ఆయన తనిఖీ చేశారు. మినీ గురుకుల పాఠశాల రికార్డులను, తరగతి, వంట గదులను ఆయన పరిశీలించారు. తరగతి గదులలో విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థుల హాజరుశాతం పెరిగేవిధంగా పాఠశాల సిబ్బంది చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని బిజినేపల్లి, అమ్రాబాద్, లింగాలలోని మినీ గురుకుల పాఠశాలలను ఆకస్మిక తనిఖీలో భాగంగా తాను లింగాలకు వచ్చినట్లు తెలిపారు. పాఠశాలలు, గురుకులం, వసతి గృహాలలో వౌళిక వసతులను కల్పించి జిల్లాలో అక్షరాస్యత పెంపుదలకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జిల్లాలోని మినీ గురుకులాలలో నిరుపయోగంగా ఉన్న కంప్యూటర్లను వాడుకలోకి తెచ్చేందుకు పాఠశాల సిబ్బందికి కంప్యూటర్‌పై శిక్షణ ఇప్పించాలని డిటివో మంగ్యనాయక్‌ను ఆదేశించారు. మరుగుదొడ్లు, స్నానాల గదులు శుభ్రంగా ఉంచేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. జూలై మొదటి వారంలో మొదలయ్యే హరితహారం జిల్లాలో విజయవంతమయ్యేలా అన్నీ ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. 1.25 కోట్ల మొక్కలను పెంచే లక్ష్యాన్ని నిర్దేశించుకొని అన్నీ శాఖలను సమన్వయపరుస్తూ హరితహారంలో భాగస్వాములయ్యేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించే బాధ్యతలను ప్రతి ఒక్కరు తీసుకునేలా ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు వివిధ కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు. మొక్కను రక్షించుకునేందుకు కంచె ఏర్పాట్లకోసం జిల్లాలోని దాతలు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. రైతులకు ఎరువులు, విత్తనాల కొరత లేకుండా అన్నీరకాల చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఎంజికెఎల్‌ఐ మిగులు పనులను పూర్తి చేసి ఈ దఫా ఐదు మోటార్ల ద్వారా రైతులకు సాగునీరు అందించేలా కృషి చేస్తున్నట్లు తెలిపారు. రెండో విడత మిషన్ కాకతీయ పనులు జిల్లాలో 95శాతం పనులు జరిగాయని, మిగతా పనులను కాంట్రాక్టర్లు పూర్తి చేయకపోతే అట్టి పనులను రద్దు చేస్తామన్నారు. ఈనెల 20 నుంచి జిల్లాలో విడతల వారిగా గొర్రెల పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. అనంతరం ప్రభుత్వ ఆస్పత్రిని తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో ఆపరేషన్లు నిర్వహించేలా వసతులను కల్పిస్తామని హామి ఇచ్చారు. కార్యక్రమంలో డిఎం అండ్ హెచ్‌వో సుధాకర్‌లాల్, డిటివో మంగ్యానాయక్, డిపివో శ్రీనివాసరావు, ఎంపిడివో సుజాత, డాక్టర్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
ఇసుక ట్రాక్టర్లను అడ్డుకున్న గ్రామస్తులు
పెబ్బేరు, జూన్ 19: మండల పరిధిలోని వైశాగాపూర్ గ్రామ సమీపంలోని ఊకచెట్టు వాగు నుండి ఇసుక అక్రమ రవాణను గ్రామస్తులు అడ్డుకున్నారు. సోమవారం ఆత్మకూరు మండలం రే జింతల, వీరరాఘవపురం, తదితర గ్రామాలకు చెందిన ట్రాక్టర్లు ఇసుక తోడుకొని వనపర్తికి తరలిస్తున్నారు. ట్రాక్టర్లకు ఉదయం 10గంటల నుండి సాయంత్రం 5గంటల వరకే పర్మిషన్ ఉన్నప్పటికీ ఇసుకాసురులు ప్రభుత్వం ఇచ్చింది పర్మిషన్ అదునుగా చేసుకొని విచ్చలవిడిగా ఒక్క పర్మిట్‌పై 6 ట్రిప్పు ల ఇసుకను వనపర్తి ప్రయివేట్ ఇండ్ల కట్టడాలకు తరలిస్తున్నారు. ఈ విషయాన్ని తహశీల్ధార్‌కు, సంబంధిత పో లీస్ అధికారులకు తెలిపినప్పటికి వారు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారని వారంతా వాపోయారు. ఇసుక అక్రమ రవాణాతో తమ గ్రామ పంచాయతికి ఒరిగింది ఏం లేదన్నారు. ఇప్పటికైనా అధికారులు నిబంధనలు పాటించి గ్రామ పంచాయతీకి రావల్సిన రాయితీని అందించాలని లేనిచో గ్రామం నుండి ట్రాక్టర్లను వెళ్లనివ్వమని సర్పం, లక్ష్మి, ఎంపిటిసి నాగిరెడ్డి, గ్రామస్తులు తెలిపారు. ట్రాక్టర్లకు ఆత్మకూరు తహశీల్దార్ పర్మిషన్ ఇచ్చారని తాము వారికి ఎటువంటి ఇసుక తరలించేందుకు పర్మిషన్ ఇవ్వలేదన్నారు. అయినప్పటికి ప్రభుత్వ అధికారులు పర్మిషన్ ఇచ్చినప్పటికి నిబంధనల ప్రకారం ఇసుక తరలించే విధంగా విఆర్‌ఓలు అక్కడ నిఘా ఏర్పాటు పెడుతామని పెబ్బేరు తహశీల్ధార్ శ్రీనివాసులు తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోను ప్రభు త్వ నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు.
మతసామరస్యానికి ప్రతీక రంజాన్
*ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌రెడ్డి
మక్తల్, జూన్ 19: మతసామరస్యానికి ప్రతీక రంజాన్ ఉత్సవాలని ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన మక్తల్‌లో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఇచ్చిన ఇఫ్తార్ విందుకు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఇఫ్తార్ విందుకంటే ముందు ఎమ్మెల్యే చిట్టెంతోపాటు దేవరి మల్లప్ప, మార్కెట్ చైర్మన్ పి.నర్సింహగౌడ్, ఎంపిటిసి సభ్యులు, టిఆర్‌ఎస్ నాయకులు రవిశంకర్‌రెడ్డి, కావలి శ్రీహరి, రాజేశ్వర్‌గౌడ్, మహిపాల్‌రెడ్డిలు ముస్లిం సోదరులతో కలసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌రెడ్డి మాట్లాడుతూ రంజాన్ మాసం ఎంతో ప్రత్యేకత చాటుకునే పండుగని, హిందూ, ముస్లింల మధ్య ఎంతో సఖ్యత పెంచుతుందని అన్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటులో ముస్లిం సోదరుల ఉద్యమం ఎంతో లిఖించ దగ్గదని అన్నారు. పవిత్ర రంజాన్ మాసంలో ముస్లింలకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి కెసిఆర్‌కే దక్కుతుందని అన్నారు. గత ప్రభుత్వాలు ముస్లిం మైనార్టీల గురించి ఏనాడు ఆలోచించిన పాపాన పోలేదని అన్నారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వంలో ముస్లింలకు షాదిముభారక్ పేరుతో పెళ్లీడుకొచ్చిన మహిళలకు ఆర్థికంగా ఆధుకొని వారిని పెళ్లిళ్లు చేయడం జరిగిందని అన్నారు. నేడు పవిత్ర రంజాన్ మాసంలో పేద ముస్లింల అభ్యునతికై కెసిఆర్ కిట్ల పేరుతో చీరలు, దోతీలను పంపిణి చేసిన ఘనత టిఆర్‌ఎస్ ప్రభుత్వందేనని అన్నారు. కార్యక్రమంలో టిఆర్‌ఎస్ నాయకులు సూర్యప్రకాష్, ఉస్సేన్‌పాష, రవికుమార్, రాజమహేందర్‌రెడ్డి, రాజీవ్‌లతోపాటు మైనార్టీ నాయకులు అబ్దుల్‌ఖవి, యాకూబ్‌అలీ, అస్గర్‌అలీ, ఖాజీషహబొద్ధిన్, నూరోద్దిన్, అబ్దుల్ రహామాన్, రహీంపటేల్, ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు.
సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
* రూ.18.5 లక్షలతో
అభివృద్ధి పనులు
* ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్
మహబూబ్‌నగర్‌టౌన్, జూన్ 19: ప్రజా సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా రాష్ట్రప్రభుత్వం ముందుకు సాగుతోందని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. సోమవారం పట్టణంలోని పాల్కొండలో వాసవీ కల్యాణ మండప ముఖద్వారం, సిసిరోడ్డు ని ర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడు తూ మహబూబ్‌నగర్ పట్టణంలోని అన్ని వార్డులలో సిసిరోడ్ల నిర్మాణం, మురికి కాలువల నిర్మాణాన్ని చేపట్టి పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దడం జరిగిందన్నారు. పట్టణంలోని మినీ ట్యాంక్ బండ్ నిర్మాణం పనులను వేగవంతం చేయడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా ఒంటరి మహిళలకు ఆసరాను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నెలకు రూ.1000ల భృతిని అందించి వారికి భరోసాను అందించడం జరిగిందన్నారు. జిల్లాలోని ఏ గ్రామంలో పర్యటించిన సిసిరోడ్లతో గ్రామాలు సుందరంగా తీర్చిదిద్దడం జరిగిందన్నారు. పాల్కొండలోని సిసిరోడ్ల నిర్మాణానికి రూ.18.5లక్షలతో ప లు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయం ఆద్వర్యంలో నిర్వహించిన శతమానం భవతే పూజకార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. దేశాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. షష్టిపూర్తి చేసుకున్న 108జంటలను సన్మానించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ రాధ ఆమర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేశ్వర్, గ్రంథాలయ చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
ఆత్మకూరులో ఘనంగా విగ్రహాల ప్రతిష్ఠ
ఆత్మకూరు, జూన్ 19: ఆత్మకూరు పట్టణ సమీపంలోని మల్లాపురం ఆంజనేయ స్వామి దేవాలయంలో సోమవారం శ్రీదేవి, భూదేవి విగ్రహాలను ఘనం గా ప్రతిష్టింపజేశారు. విగ్రహప్రతిష్టకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు రమణాచారి, గద్వాల ఎమ్మెల్యే డీ.కె అరుణ, మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్ రెడ్డి, తదితరులు హాజరయ్యారు. సోమవారం తెల్లవారుజాము నుంచే దేవాలయంలో ప్ర త్యేక పూజలు నిర్వహించిన అనంతరం విగ్రహాలను వేదమంత్రోచారణల మధ్య ప్రతిష్టింపజేశారు. దేవాలయం తరపున అర్చకులు అతిథులకు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పట్టణానికి చెందిన పలువురు ప్రముఖులతో పాటుగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
వనపర్తి ఏరియా ఆసుపత్రిలో రక్తదానం
* పాల్గొన్న ఎమ్మెల్యే చిన్నారెడ్డి
వనపర్తి, జూన్ 19: ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ 47వ జన్మదినాన్ని పురస్కరించుకొని సోమవారం వనపర్తి ఏరియా ఆసుపత్రిలో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎఐసిసి కార్యదర్శి, వనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ జి.చిన్నారెడ్డి పాల్గొని రక్తదానం చేశారు. 47వ జన్మధినం సందర్భంగా 47 మంది రక్తదానం చేసినట్లు నాయకులు తెలిపారు. అంతక ముందు ఆసుపత్రిలో కాంగ్రెస్ నాయకులు కేక్‌ను కట్ చేసి అందరికి పంచారు. కార్యక్రమంలో డిసిసి అధ్యక్షులు శంకర్‌ప్రసాద్, నాయకులు శివసేనారెడ్డి, కోట్లరవి, నందిమల్ల చంద్రవౌలి, రాగివేణు, జనార్దన్, భువనేశ్వరి, ధనలక్ష్మి, కృష్ణబాబు, రాజు, యాది, తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ కళాశాలలో
ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలని వినతి
గద్వాలటౌన్, జూన్ 19: జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్ర భుత్వ జూనియర్ జూనియర్ కళాశాలలో ఇంగ్లీష్ మీ డియం విద్యను ప్రవేశ పెట్టాలని డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఉప్పేరు నర్సిం హ్మ కలెక్టర్‌ను కోరారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి సందర్భంగా కలెక్టర్‌కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ కళాశాలలో ఇంగ్లీష్ మీడియం బోధన లేక విద్యార్థులు తీవ్రంగా నష్టపోతునారన్నారు. అలాగే ధరూర్, గట్టులలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల భవనాలు నిర్మాణం పూర్తి అయినప్పటికి అధికారుల ప్రారంభించక ఇరుకు గదులోనే విద్యార్థులు చదువులు కొన్నసాగుతున్నాయని,, నూతన భవనాలలో తరగతులు బోధించేలా చర్యలు చేపట్టాలన్నారు. ఉర్దూ మీడియంలో పదవ తరగతి వరకు చదివిన విద్యార్థులు పై చదువుకోసం సుదూర ప్రాంతాలకు వెళ్లలేక చదువును మధ్యలో ఆపేస్తున్నారని, దృష్టిలో ఉంచుకుని జిల్లా కేంద్రంలో ఉర్దూమీడియం ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలన్నారు. జిల్లా ఉపాధ్యక్షుడు శివ, రాజు, తదితరులు పాల్గొన్నారు.
మరుగుదొడ్లు లేక ఇక్కట్లు
* పట్టించుకోని అధికారులు
నాగర్‌కర్నూల్, జూన్ 19: వివిధ పనుల నిమిత్తం మండల పరిషత్ కార్యాలయానికి వచ్చిన ప్రజలకు మరుగుదొడ్లు, మూత్రశాలలు లేక అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. వేలాది రూపాయలతో మరుగుదొడ్లు, మూత్ర శాలలు నిర్మించినప్పటికీ అవి ఉపయోగంలో లేవు. అయతే కార్యాలయాల సముదాయానికి నీటిని అందించేందుకు ప్రత్యేకంగా బోరును డ్రిల్ చేసినప్పటికి దానిని కూడా వినియోగంలోకి తేలేదు. ముందుగా ఈబోరుకు మోటర్‌ను బిగించి నీటి సౌకర్యాన్ని కల్పించి మరుగుదొడ్లను, మూత్రశాలలను వినియోగంలోకి తేవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మండల పరిషత్ కార్యాలయం ఆవరణలోనే మండల మహిళా సమాఖ్య కార్యాలయం ఉండడంతో వివిధ గ్రామాల నుండి వందలాది మహిళలు నిత్యం వస్తుంటారు. ఇప్పటికైనా మహిళల పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని నిరుపయోగంగా ఉన్న మరుగుదొడ్లను, మూత్రశాలలను వినియోగంలోకి తేవాలని వారు కోరుతున్నారు.
కేంద్ర పథకాల గురించి తెలపాలి
* బిజెపి జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి
వనపర్తి, జూన్ 19: కేంద్ర ప్రభుత్వ పథకాలను గడప గడపకు వెళ్లి ప్రజలకు తెలియజేప్పాలని బిజెపి జిల్లా అధ్యక్షులు అయ్యగారి ప్రభాకర్ రెడ్డి అన్నారు. జిల్లా పాదాధికారుల సమావేశం సోమవారం జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఇంఛార్జీ నర్సింగారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర పార్టీ పిలుపుమేరకు ఈనెల 30వ తేది వరకు పండిట్ దీన్‌దయల్ ఉపాధ్యాయ విస్తార్ యోజన కార్యక్రమం నిర్వహించాలని తెలిపారు. జిల్లాలోని ప్రతి పాదాధికారి కచ్చితంగా పర్యటించి బూత్‌కమిటీలు వేయని చోట కమిటీలు వేయాలని ఆయన అన్నారు. బిజెపిని తెలంగాణలో అధికారంలోకి తీసుకు రావడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పని చేయాలని అన్నారు. జిల్లాలో 446 బూత్‌లలో 300 కమిటీలు ఇప్పటికే పూర్తి చేశామని ఇంకా 100 కమిటీలు ఈనెల చివరి కల్లా పూర్తి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు బి.కృష్ణ, సబ్బిరెడ్డి వెంకట్‌రెడ్డి, నాగభూషణ్‌గౌడ్, బుడ్డన్న, శ్రీశైలం, సీతరాములు, మాదవరెడ్డి, సాయిరాం, శ్రీనివాస్‌గౌడ్, రామన్‌గౌడ్, శ్రీనివాస్, జ్యోతి, మోహన్‌యాదవ్, జైపాల్‌రెడ్డి, కుమార్, రమేష్, సుధాకరా చారి, పరుశరామ్, శైలేశ్వర్‌రావు పాల్గొన్నారు.
యోగా దినోత్సవం కరపత్రాలు విడుదల
నాగర్‌కర్నూల్, జూన్ 19: ఈనెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని జిల్లా సంయుక్త కలెక్టర్ సురేందర్ కరణ్ కోరారు. సోమవారం ప్రజావాణిలో ప్రజల నుంచి విన్నతులను స్వీకరించిన అనంతరం ఆయన మూడో అంతర్జాతీయ యోగా దినోత్సవ కరపత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 21న స్థానిక సాయిగార్డెన్స్‌లో ఉదయం 6.30 గంటల నుంచి 8.30 గంటల వరకు నిర్వహించే యోగా కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఈనెల 20న జడ్పీహెచ్‌ఎస్ నుంచి ఉదయం 9.30 గంటలకు యోగా వాక్ ఉంటుందని, దీనిని కలెక్టర్ శ్రీ్ధర్ ప్రారంభిస్తారని తెలిపారు. కార్యక్రమంలో డిఆర్వో మధుసూధన్‌నాయక్, ఎస్‌డిసి శ్రీరాములు, ఆయుష్ శాఖాధికారిణి డాక్టర్ అనిత, మురళికృష్ణ తదితరులు పాల్గొన్నారు.