మహబూబ్‌నగర్

రూ.5వేలకోట్లతో గొర్రెపిల్లల పంపిణీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, జూన్ 20: రాష్ట్ర వ్యాప్తంగా గొర్రెల పంపిణీ పథకం కింద రూ.5వేలకోట్ల నిధులతో ఆమలు చేస్తున్నామని రాష్ట్ర పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. మంగళవారం మహబూబ్‌నగర్ జిల్లాకు విచ్చేసిన మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ముందుకు మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఆర్‌అండ్‌బి అతిథిగృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా గొర్రెలను పంపిణీ చేయడం జరుగుతుందని రాష్ట్రంలో ఉన్న గొల్ల కురుమలకు 75శాతం సబ్సిడీ కింద ఈ గొర్రె పిల్లలను అందిస్తున్నామని కేవలం రాష్ట్రంలోనే కాకుండా పక్క రాష్ట్రాల నుండి ఈ గొర్రెపిల్లలను కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు. మొదట 4లక్షల యూనిట్లు అనుకున్నామని కానీ అవి సరిపోనందున వాటిని 8లక్షల యూనిట్లుగా కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగిందన్నారు. 8లక్షల గొర్రెలను పంపిణీ చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మొదటివిడత పూర్తి అయిన తర్వాత రెండవ విడుతలో గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని 18 సంవత్సరాలు నిండిన ప్రతి గొల్ల కురుమలకు లాటరీ పద్దతిన గొర్రెపిల్లలను పంపిణీ చేస్తామన్నారు. ఈ సంవత్సరం చేపపిల్లలను పంపిణీ చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగిందని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారిని ముందుకు రాణించాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. ముఖ్యంగా గొర్రెలకు ఇన్సురెన్స్ సౌకర్యంతో పాటు వైద్యులు అందుబాటులో ఉండే విధంగా ప్రతి నియోజకవర్గానికి ఒక వెటర్నరి డాక్టర్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. పక్క రాష్ట్రాల సంతల నుండి కొనుగోలు చేసిన గొర్రెపిల్లలను సరఫరా చేయడం కోసం ముఖ్యమంత్రి కెసిఆర్ చాలా కృషి చేస్తున్నారన్నారు. సంక్షేమ పథకాలను ప్రతిపక్ష పార్టీల నాయకులు ఒకసారి పరిశీలించాలని గాలిమాటలు మాట్లాడకూడదని ఆయన హితవు పలికారు. గత ప్రభుత్వాలు రైతులకు 9గంటల విద్యుత్‌ను అందివ్వలేకపోయిందని రాష్ట్రం ఏర్పడిన తర్వాత రైతులకు 9గంటల విద్యుత్‌ను అందిస్తున్నామని వలసల జిల్లా అయిన పాలమూరు జిల్లాలో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం వల్ల జిల్లాలో వలసలు తగ్గుముఖం పట్టాయన్నారు. 4.50లక్షల ఎకరాలకు సాగునీరు అందించడం జరిగిందన్నారు. ప్రతి కుటుంబానికి మేలు జరగాలనే ఉద్దేశ్యంతో ఇల్లు, ఉద్యోగం సమకూర్చడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. 40 ఏళ్లుగా ఉమ్మడి రాష్ట్రాన్ని ప్రతిపక్ష పార్టీల నాయకులు పాలించారని వారికి మన పండుగలు, ప్రభుత్వ సంక్షేమపథకాలు ఎందుకు నచ్చడం లేదో అర్థం కావడం లేదన్నారు. ముఖ్యంగా ప్రభుత్వం పంపిణీ చేస్తున్న గొర్రెలకు అటవీశాఖ భూముల్లో గొర్రెలను మేత కోసం గడ్డిని మేపడానికి ప్రభుత్వం అనుమతించిందని గొల్ల కురుమలకు ఉన్న భూముల్లో కొంతభాగం గడ్డిని పెంచుకుని వాటిని మేపాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ వెంకటయ్య, కోట్ల కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
పాడిపరిశ్రమ బలోపేతానికి చర్యలు

* రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి
మహబూబ్‌నగర్‌టౌన్, జూన్ 20: రాష్ట్రంలో పాడిపరిశ్రమను బలోపేతం చేయడానికి ఆవులు,గెదేలను రైతులకు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. మంగళవారం మండల పరిధిలోని జమిస్తాపూర్ గ్రామంలో కురుమ యాదవుల లబ్దిదారుల ఎంపిక కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆమలు చేస్తున్న కళ్యాణలక్ష్మీ పథకం నిరుపేదలకు గొప్పవరం లాంటిదని ఈ పథకం ద్వారా లబ్దిదారులకు రూ.71వేల చోప్పున ఆడపిల్ల వివాహానికి ఆర్థిక సహయం అందిస్తున్నామని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్‌భగీరథ పథకం ద్వారా ప్రతి ఇంటికి తాగునీరు అందించాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని చేపట్టడం జరిగిందని వచ్చే డిసెంబర్ నాటికి ప్రతి ఇంటికి నల్లాల ద్వారా తాగునీటిని అందిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని అన్ని కులాలు ఆర్థికంగా ఎదగడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని అందులో భాగంగా కురుమయాదవులకు జీవనోపాధిని కల్పించాలనే లక్ష్యంతో వారికి ఈ గొర్రెల పంపిణి కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని అన్నారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో బాగంగా గొర్రెల పంపిణీ ఓ బృహత్తర కార్యక్రమమని మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. గతంలో వృద్ధులకు, వితంతువులకు రూ.200 పించన్ కోసం తీవ్ర ఇబ్బందులు పడేవారని అందులో కేవలం గ్రామానికి 10మందిచోప్పున వారికే వచ్చేవని ప్రస్తుతం అలా కాకుండా అర్హులైన అందరికి రాష్ట్ర ప్రభుత్వం రూ.1000 నుండి 1500 ఇచ్చి వారి జీవితాల్లో వెలుగులు నింపిందన్నారు. రాష్ట్రంలో మెరుగైన విద్యను అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం గురుకుల పాఠశాలను మంజూరు చేయడం జరిగిందని ప్రైవేటు పాఠశాలలకు దీటుగా నాణ్యమైన విద్యను అందించేందుకు ఈ పాఠశాలలు ఎంతగానో ఉపయోగపడుతాయన్నారు. ప్రస్తుతం ఆమలు చేస్తున్న కెసిఆర్ కిట్ పథకం గర్భిణీ స్ర్తిలకు ఎంతగానో ఉపయోగపడుతుందని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకోవడం వల్ల పుట్టిన శిశువులకు రూ.12వేల ఆర్థిక సహయంతో పాటు కెసిఆర్ కిట్‌ను అందించడం జరుగుతుందని అన్నారు. అదేవిధంగా ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి ఎదో ఒక రూపన అందుతున్నాయని గతంలో కులవృత్తులు పూర్తిగా చితికి పోయాయని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కులవృత్తులు ఆర్థికంగా ఎదగాలనే ముఖ్య ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టడం జరిగిందన్నారు. మిషన్‌కాకతీయ పథకం ద్వారా ప్రతి గ్రామంలోని చెరువులు కలకలలాడుతున్నాయని ఈ చెరువల ద్వారా రైతులు రెండు నుండి మూడు పంటలు పండించుకోవచ్చని రైతులు పండించిన పంటను గిట్టుబాటు ధర వచ్చేవరకు మార్కెట్ యార్డులలో ధాన్యాన్ని నిలువ ఉంచుకోవాలనే ఉద్దేశ్యంతో గోదాములను నిర్మించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ రోనాల్డ్‌రోస్, ఎంపి జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీనివాస్‌గౌడ్, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, ఆర్డిఓ లక్ష్మీనారాయణ, ఎంపిపి సావిత్రి, తహశీల్దార్ శంకర్ తదితరులు పాల్గొన్నారు.

గొర్రె పిల్లల పంపిణీ
కొత్తకోట, జూన్ 20: మండల పరిధిలోని పామాపురం గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం నుండి మంజూరు అయిన గొర్రె పిల్లలను మంగళవారం ఎమ్మెల్యే అల వెంకటేశ్వర్ రెడ్డి పంపిణీ చేశారు. ఆ గ్రామంలో 28 మంది లబ్ధిదారులకు 558 గొర్రెలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గొర్రె పిల్లలను ఇతర రాష్ట్రం నుండి తెప్పించి 75శాతం సబ్సిడిపై కాపరులకు అందజేస్తున్నామని ఇటీవలే మత్య్సకారులకు చేప పిల్లలను కూడా అందించామన్నారు. కుల వృత్తుల వారిని ప్రోత్సహిస్తున్నామని అన్ని వర్గాల ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి గుంత వౌనిక, మార్కెట్ ఛైర్మన్ రాజేశ్వరమ్మ, సర్పంచు చెన్నకేశవరెడ్డి, బీచుపల్లి, ప్రశాంత్, సాయులు, భీంరెడ్డి, కొండారెడ్డి, రుగ్మాంద రెడ్డి, గోవిందు నాయుడు పాల్గొన్నారు.

రైతాంగానికి కష్టాలు దూరం
* పంచాయతి రాజ్ శాఖ మంత్రి జూపల్లి

పాన్‌గల్, జూన్ 20: రైతాంగానికి సాగునీటి కష్టాలు ఉండనివ్వమని, అవసరమైన చోట నూతన రిజర్వాయర్లను ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర పంచాయతి రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మంగళవారం మండల పరిధిలోని చిక్కెపల్లి, మదరావుపల్లి, పాన్‌గల్, గోప్లాపూర్ గ్రామాలలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాలలో నూతనంగా రిజర్వాయర్ల ఏర్పాటు కోసం అధికారులతో కలిసి భూములను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం సాగునీటి ప్రాజెక్టులు ఏర్పాటు చేయడం జరిగిందని, కాల్వల ద్వారా రైతాంగానికి ప్రతి ఎకరాకు సాగునీరు అందించేందుకు సిఎం కెసిఆర్ ఆహార్నిషలు కృషి చేస్తున్నారన్నారు. తక్కువ భూములు ముంపునకు గురై ఎక్కువ నీటి నిల్వ సామార్థ్యం ఉన్న చోట రిజర్వాయర్లను నిర్మిస్తామని ఆయన తెలిపారు. పాలమూరు జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసి రైతాంగానికి సాగునీరు అందిస్తామన్నారు. కాల్వల ద్వారా ప్రతి కుంటను, చెరువును నీటితో నింపడం జరుగుతుందన్నారు.
చిక్కెపల్లి-మైలారం గ్రామాల మధ్య పెద్దమొత్తలబండ, మాదరావుపల్లి గ్రామ సమీపంలో ఉడుగలకుంట సమీపంలో సీతంబోర్డు, అనుగుల బోర్డు గుట్టల వద్ద, కిష్టాపూర్ దగ్గర రామన్నగట్టు, పాన్‌గల్ పొల్కి చెరువులను రిజర్వాయర్లుగా మార్చేందుకు సర్వే నిర్వహించాలని అధికారులను మంత్రి జూపల్లి ఆదేశించారు. అలాగే వీపనగండ్ల మండల పరిధిలోని బొల్లారం, వల్లాబాపురం గ్రామాల సమీపంలో నూతన రిజర్వాయర్లను నిర్మాణానికి రాష్ట్ర పంచాయతి రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్థలాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి రవికుమార్, కోడేరు ఎంపిపి రాంమోహన్‌రావు, సింగిల్‌విండో ఛైర్మన్ బాల్‌రెడ్డి, వైస్ ఛైర్మన్ భాస్కర్‌యాదవ్, కెఎల్‌ఐ ఎస్‌ఇ భద్రయ్య, ఇఇ రాంచంద్రయ్య, రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ మధన్‌మోహన్ రావు, నాయకులు సుదర్శన్‌రెడ్డి, నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రిజర్వాయర్ల కోసం చెరువులను పరిశీలించిన మంత్రి జూపల్లి
పెద్దకొత్తపల్లి, జూన్ 20: కెఎల్‌ఐ ప్రాజెక్టు ద్వారా వచ్చే నీటిని నిలువ ఉంచేందుకు అదనపు రిజర్వాయర్ల నిర్మాణం కోసం మండల పరిధిలోని వివిధ గ్రామాల చెరువులను రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పరిశీలించారు. మంగళవారం ఉదయం మండల పరిధిలోని సాతాపూర్, మారెడుమాన్‌దినె్న, యాపట్ల, రాయవరం, దేదినేనిపల్లి, పెద్దకొత్తపల్లి గ్రామాలలోని చెరువులను రిజర్వాయర్లకోసం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన రాయవరం వద్ద వాగుపై రిజర్వాయర్ నిర్మాణం కోసం వాగు మ్యాప్‌ను పరిశీలించారు. పెద్దకొత్తపల్లిలోని జాతరకుంట వద్ద బ్యాలెన్స్ రిజర్యాయర్ ఏర్పాటుకు అనుకూలంగా ఉండటంతో మంత్రి సాగునీటిపారుతల శాఖ అధికారులను సర్వేకోసం ఆదేశించారు. వచ్చే యాసంగీ సీజన్ నాటికి కెఎల్‌ఐ ప్రాజెక్టులోని రెండో లిప్టులోని ఐదు మోటార్లను నడిపించి పూర్తిస్థాయిలో సాగునీరు అందిస్తామన్నారు. జొన్నలబొగుడ రిజర్వాయర్ నుంచి సాతాపూర్, తిర్మలాంపల్లి, కల్వకోలు, చెన్నపురావుపల్లి, సాతాపూర్, గంట్రావుపల్లి, నారాయణపల్లి మరికొన్ని గ్రామాలలో వేసవిలో సాగునీరు అందించడంతో చెరువులు, కుంటలు నీళ్లతో నిండి ఉన్నాయన్నారు. రైతులు వరి పంటసాగు చేయడమే కాకుండా వాణిజ్య పంటలను సైతం సాగుచేసి అధిక లాభాలను పొందాలన్నారు. కుంటలలో నీరు ఉండటంతో వేసవిలో తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు కలుగలేదన్నారు. ఆయన వెంట కెఎల్‌ఐ ప్రాజెక్టు ఎస్‌ఇ భద్రయ్య, ఇఇ రాంచందర్, డిఇ మాలతిరెడ్డి, జడ్పీటిసి వెంకటయ్య, ఎంపిపి వెంకటేశ్వరరావు, టిఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.

గొర్రెల పంపిణీ చారిత్రాత్మకం

* ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నిరంజన్ రెడ్డి
ఖిల్లాగణపురం, జూన్ 20: గొర్రెల పంపిణీ పథకం ఒక చారిత్రత్మకమని ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. మంగళవారం మండల పరిధిలోని వెంకటాంపల్లి గ్రామంలో గొర్రెల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కుర్వ, గొల్లల అభివృద్ధికి శ్రీకారం చుట్టారని రాష్ట్రంలో గొర్రెల పంపిణీ పథకానికి రూ.5వేల కోట్లను కేటాయించి వారి అభివృద్ధికి బాటలు వేశారన్నారు. దేశంలో వ్యవసాయం తరువాత గొర్రెల పెంపకం ద్వారా ఆదాయం వస్తుందని దీనిని దృష్టిలో ఉంచుకొని కర్ణాటక నుండి గొర్రెలను కొనుగోలు చేసి కుర్వ, గొల్లల్లో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి 20 గొర్రెలు, ఒక గొర్రె పొట్టెలు దాదాపు రూ.లక్ష20వేలతో ఈ పథకం వర్తింపజేస్తుందని అన్నారు. మాంస ఆహారం ఎక్కువగా తీసుకుంటున్నారని దానికి అనుగుణంగా ప్రణాళికను సిద్ధం చేసి గొర్రెల పెంపకంతో రాష్ట్రానికి కూడా ఆదాయం రానుందన్నారు. గ లబ్ధిదారులు డిడిలు చెల్లించినట్లు అయితే పథకం వర్థిస్తుందని తెలిపారు.
యాదవులు ఈ పథకాన్ని వినియోగించుకోవాలి
టిఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న గొర్రెల పెంపక పథకాన్ని వినియోగించుకోవాలని ఎమ్మెల్యే చిన్నారెడ్డి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 84లక్షల గొర్రెలు పంపిణీ చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసిందని వనపర్తి జిల్లాలో 23,600 మంది యాదవులను ఎంపిక చేశారని, మొదటి విడుతగా 11,828 మందికి ఈ పథకం వర్థిస్తుందని రెండవ విడుతగా 11,820 మందిని ఎంపిక చేసినట్లు తెలిపారు. ఆరు నెలలు కష్టపడి గొర్రె పిల్లలను పెంచితే మార్కెట్‌లో మంచి ధర వస్తుందని అలాగే రాబోయె రోజుల్లో కోళ్లకు షెడ్లు వేసి ఎలా పెంచుతారో గొర్రెలను అలా పెంచే రోజులు వస్తాయని ఆయన అన్నారు.
గొల్ల, కుర్వల అభివృద్ధే లక్ష్యం
గొల్ల, కుర్వల అభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఈ పథకాన్ని వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ శే్వతామహంతి అన్నారు. దళారులను నమ్మకుండా ప్రభుత్వం నేరుగా లబ్ధిదారులకు గొర్రెలను అందిస్తుందని తెలిపారు. మొదటి విడుతలో ఎంపికైన లబ్ధిదారులకు గొర్రెల పంపిణీ అనంతరం రెండవ విడుతలో ఎంపికైన లబ్ధిదారులకు కూడా ఈ పథకం వర్థిస్తుందని ఆమె అన్నారు.
గ్రామసభల ద్వారా లబ్ధిదారుల ఎంపిక సహాజంగానే జరిగిందని దరఖాస్తు చేసుకున్న ప్రతి లబ్ధిదారుడికి గొర్రెలను అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి కృష్ణనాయక్, జడ్పిటిసి రమేష్‌గౌడ్, వైస్ ఎంపిపి ఉమా మహేశ్వరి, టిఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షులు లక్ష్మారెడ్డి, సింగిల్‌విండో అధ్యక్షులు రవిందర్ రెడ్డి, వివిధ పార్టీల నాయకులు, సర్పంచులు, ఎంపిటిసిలు, గొర్రెల లబ్ధిదారులు పాల్గొన్నారు.